సంఘకార్యం - ఇది ఆధారభూతమైన మౌలిక కార్యం
రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఎటువంటి పరిస్థితులలోనైనా తప్పక కొనసాగింపవలసిన ఒక ఆధారభూత కార్యం. ఈ పని జరుగవలసిన ప్రకారంగా, ప్రభావవంతంగా జరుగుతూ ఉన్నట్లయితే, దీని శక్తి పెరుగుతూ పోతుంది. సంఘకార్యం దేశమంతటా వ్యాపించినపుడు దీని ఆధారంగా మన సమాజానికి ఎటువంటి దిశ ఇవ్వాలనుకొంటామో అటువంటి దిశను మనం ఇవ్వగల్గుతాం. వివిధ రకాల పనులు జరుగుతూ ఉంటాయి. అయితే అవన్నీ జరగడానికి ఆధారరూపమైనదిగా సంఘకార్యం అత్యంత ఆవశ్యకమౌతుంది. ఈ కారణంగా, ఎటువంటి పరిస్థితులలోనైనా, సంఘకార్యాన్ని పెంచుకొంటూపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకనే మనం సంఘకార్యం పరిస్థితి నిరపేక్షమైనదని అంటూ ఉంటాం. అయితే పరిస్థితులగురించి ఆలోచించకుండా ఉండాలని దీని భావం కాదు.
విషయసూచిక :