ప్రజాస్వామ్య దేశంలో మత పిచ్చోళ్ళు పెరిగిపోతున్నారు. తళమినాడులోని ఓ ప్రాంతానికి చెందిన క్రిష్టియన్లు ఈ నెల పదో తేదీన హిందువులు జరుపుకొనే వినాయక చవితి పండగను ఎలాగైనా నిలిపివేసేందుకు లేదా పండగ విజయవంతం కాకుండా చేసేందుకు పక్కా ప్రణాళిక చేశారు.
సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ ఫర్ ఉమెన్, సెయింట్ పాల్స్ మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్, కోయంబత్తూర్ ఛైర్మన్ & మేనేజింగ్ ట్రస్టీ, రెవ., పేరిట ఒక కరపత్రం జారీ అయింది. సెప్టెంబర్ 10 వినాయక చవితి రోజు లేదా అంతకు ముందు రోజు పట్టణంలో పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి, యేసును స్తుతిస్తూ “జప యాత్ర” చేసి విగ్రహారాధనను ముగించాలని అందులో పేర్కొన్నారు. హిందువుల పండగపూటే ఇటువంటి కార్యక్రమాలకు పూనుకొవడం వారికేమీ కొత్తకాదు.
2017-2018, 2019 లో ఇదే విధమైన కౌంటర్ ఊరేగింపులు కోయంబత్తూరులోని అన్ని వార్డులలో జరిగాయి. గణేష్ పూజకు వ్యతిరేకంగా వందలాది వాహనాలలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఊరేగింపులు జరిపారు. వీరి చర్య వల్ల అక్కడి హిందువులు, ముఖ్యంగా వినాయక చవితి కమిటీలు ఇబ్బందులకు గురయ్యాయి. అప్పటి నుంచే అక్కడి కలెక్టర్ వినాయక చవితి పూజలకు కఠినమైన నిబంధనలు పెట్టారు. దీంతో ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో క్రైస్తవులను సమీకరించాలని ఆ కరపత్రంలో కోరారు. ఇక్కడ మరో విషయం గమనించాలి… మంచినడవడికతో జీవితంలో గొప్పగా స్థిరపడాలని కలలు గని విద్యాబుద్దుల కోసం సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ ఫర్ ఉమెన్, సెయింట్ పాల్స్ మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చేరిన విద్యార్థులను ఇలా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించడం ఆ విద్యాశాలల యజమానుల వక్రబుద్దికి సాక్ష్యంగా నిలుస్తోంది.
ఈ ఏడాదీ కఠిన నిబంధనలు
అక్కడి ప్రభుత్వం ఈ ఏడాదీ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో గణేష్ విగ్రహాల ఏర్పాటును పూర్తిగా నిషేధించింది. అయితే, హిందు మున్నాని నేతృత్వంలోని హిందువులు ఈ నిషేధానికి వ్యతిరేకంగా ఇప్పటికే పోరాడుతున్నారు. అక్రమ నిషేధాన్ని ధిక్కరిస్తామని హెచ్చిరించారు. బిజెపి కూడా ధిక్కరిస్తోంది.
Courtesy : విశ్వసంవాద కేంద్రము (AP & TS)