సంఘశక్తి వృద్ధికావాలి, బాగా పెరగాలి
1946-48 సంవత్సరాలలో దేశంలో జరిగిన ఘటనల కారణంగా సంపూర్ణ హిందూ సమాజంలో ఒక ప్రతిక్రియ నిర్మాణమై ఉంది. దీనివల్ల సంఘానికి ఏదో ఒక విధంగా లాభం కలిగింది. ఆ సమయం ప్రపంచంలో ఏదేశమైనా ఎంత పురాతనమైనదో, దాని చరిత్ర, వారసత్వములు కూడా అంతపురాతనమైనవిగా ఉంటాయి.లో వందల సంఖ్యలో ప్రచారకులు వచ్చి, అనేకచోట్లకు పోయి, ఎన్నెన్నో శాఖలు ప్రారంభించారు. అయితే ఆ ప్రతిక్రియవల్ల కలిగిన లాభం నిలకడ సాధించలేదు. 1948లో జనవరి 30న గాంధీజీ హత్య అనే ఘటన జరిగి ఉండకపోతే, దేశంలోని పరిస్థితులకు స్పందించి, సంఘానికి చేరువైన వేలాదిమంది స్వయం సేవకులను తీర్చిదిద్దుకొనడానికి సంఘానికి సమయం లభించి ఉండేది. దానివల్ల మనశక్తి పెరిగి ఉండేది.
సమాజంలోని అనేక దోషాలు తొలగిఉండేవికూడా. ఆ సమయంలో మహారాష్ట్ర ప్రాంతంలో ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చిన అంశం- వందల సంఖ్యలో ప్రచారకులు వచ్చి గ్రామ గ్రామాన శాఖలు ఆరంభించటంతో బ్రాహ్మణ, బ్రాహ్మణేతర కుటుంబాలనుండి మంచివారు, బాగా చదువుకున్నవారూ మంచి సంఖ్యలో శాఖలకు రానారంభించారు. అంతవరకు ఎవరైతే బ్రాహ్మణ అబ్రాహ్మణ భావనలు ఆధారంగా సమాజంలో నేతృత్వం చలాయిస్తూ వచ్చారో వారికి 'గొప్పవ్యాకులపాటు కలిగింది. సంఘం కారణంగా బ్రాహ్మణ అబ్రాహ్మణ వర్గాల మధ్య వైరం సమసిపోతే మన నాయకత్వం ఏమవుతుంది? సాగుతుందా?” అని. రెండు మూడు సంవత్సరాల సమయం లభించినట్లయితే, ఉభయవర్గాలనుండి వేలాదిగా స్వయం సేవకులు వచ్చి ఉండేవారు, వారు సంఘంలో లీనమై, జీర్ణమై ఉండేవారు. ఫలితంగా సంపూర్ణంగా మహారాష్ట్ర ప్రాంతమంతటా బ్రాహ్మణ-అబ్రాహ్మణ విభేదభావాలు మాయమై ఉండేవి. ఇతర ప్రాంతాలలో కూడా సంఘంలోకి చాలా పెద్దసంఖ్యలో యువకులు, నడివయస్కులు వచ్చి చేరారు. వారు సంఘంలో కొనసాగి, సంఘకార్యమగ్నులై ఉండి ఉంటే, దేశం యొక్క చిత్రమే మారిపోయి ఉండేది. ఆనాడు సంఘశాఖలకు వచ్చినవారందరూ నిలిచి ఉండక, కొద్దిమంది క్రియాశూన్యులు అయివుండేవారేమో! అలా కొందరు దూరంగా ఉండినా, సంఘకార్యంలో నిమగ్నులై పూర్తిగా విలీనమై పనిచేయగలవారు చాలామంది ఉండేవారు. భగవంతుని నిర్ణయంమరో విధంగా ఉండినదేమో-1948లో పైన పేర్కొనిన ఘటనలను అవకాశంగా తీసికొని నాటి ప్రభుత్వం సంఘంపై అకారణంగా పిడుగులు కురిపించింది. ఆ కారణాన పెద్ద సంఖ్యలోశాఖలకు వస్తూ ఉండినవారు సంఘంలో భాగం కాలేకపోయారు.
ఇప్పుడు అనుకూల పరిస్థితి ఏర్పడింది కాబట్టి స్వయం సేవకులందరూ ప్రేరణ పొంది, నడుంబిగించి, కార్యంలోకి ప్రవేశించి, గ్రామగ్రామాన శాఖలు నడిపించ నారంభిస్తే, అక్కడక్కడా కొన్ని శాఖలు మూతబడినా, చాలా శాఖలు కొనసాగగలవు. ఈ శాఖలద్వారా మనకు సన్నిహితులయ్యేవారిని అరిగించుకోవటంలో సంఘం సఫలం కాగలదు. సమాజాన్ని స్థిరంగా ఉంచడానికి సంఘశక్తి కీలకం. ఈ కారణంగానే, వివిధ రంగాలలో పనిచేస్తున్న ఇతరవ్యక్తులు స్పష్టంగా చెప్పినా, కొంత అస్పష్టంగా చెప్పినా, వారందరూ చెప్పుతున్న మాటలలో వ్యక్తమౌతున్నది ఒక్కటే - సంఘశక్తి పెరగాలి.
ఈనాడు దేశంలో సమాజవాదులు (సోషలిస్టులు)గానో, వామపక్షాలవారుగానో, మితవాదులుగానో చెప్పబడుతున్న వారందరూ సంఘ సంపర్కంలోకి వస్తున్నారు. వివిధ పార్టీలలో ఒకరకమైన అంటరానితనం పాటింపబడుతూ, అస్పృశ్యతా సూత్రాలేవో ఉన్నట్లుగా దృష్టి గోచరమవుతుంది. కాగా ఈ జాడ్యానికి దూరంగా ఉన్న ఒకే ఒక సంస్థగా సంఘం కనబడుతూ ఉంది. సంఘకార్యకర్తలలో చాలామంది అన్ని రకాల మనుషులతోనూ కలుస్తూ ఉండే ప్రయత్నాలు చేస్తుంటారు. మన కార్యక్రమాలకు అధ్యక్షులుగా రావాలనో, ఉపన్యసించ దానికి రావాలనో, ఆలోచనలు కలబోసుకొనేందుకు రావాలనో ఆహ్వానిస్తూ మన కార్యకర్తలు ఎంతమంది వద్దకు వెళ్తూ ఉంటారో, అంతస్థాయిలో ఏ సంస్థలో వ్యక్తులూ వెళ్ళటంలేదు. కొంతమంది వ్యక్తులు మన సంస్థ ఎంత అనుశాసనంతో కార్యక్రమాలు నిర్వహిస్తుందో చూసి, దీనిలో తాము ఇమిడి ఉండలేమని దూరంగా ఉంటూ ఉన్నప్పటికీ వారిలో చాలామంది మానసికంగా మనవైపే ఉన్నారని వివిధ సందర్భాలలో మనకు అనుభవమవుతూ ఉంటుంది. వారుకూడా సంఘశక్తి పెరగాలని కోరుకొంటున్నారు. చైనా దురాక్రమణ సమయంలో కలిసిన సైన్యాధికారులు కూడా అడుగుతూ ఉండేవారు - 'సంఘశక్తిని ఇంకా ఎక్కువగా పెంచలేరా?” అని. ఎందుకంటే, సమాజం స్థిరంగా ఉండాలంటే సంఘంవంటి శక్తి అవసరమని వారికి అర్థమైంది.
సంఘంలో నిర్మాణమవుతున్న అంతర్గతశక్తి ఎటుతిరిగి సమాజ కల్యాణానికే ఉపయోగపడగలదని వారు గ్రహించుకోగల్లుతున్నారు. వివిధ పార్టీలవారితో మనకు కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. తాము సొషలిస్టులమని, అత్యంత ప్రగతివాదులమని అనుకొనే వారిని సంఘం ఎప్పుడైనా విమర్శిస్తుందంటే అందుకు కారణం వారిపై ద్వేషంకాదు. వారి ఆలోచనలను సరిదిద్దటం, తద్వారా, ఏవిధమైన 'గోల్ మాల్' జరగకుండా నివారించటం కోసమే. వారు ఏ దిశలో ప్రజలను తీసికొని పోజూస్తున్నారో, దానిని గురించి వారికి స్పష్టంచేయటం కోసమే. ఈ విధమైన ప్రయత్నం అవసరమై ఉండటంతో పాటుగా, వారిని ప్రత్యక్షంగా కలసి మాట్లాడే సందర్భాలలో అనేక విషయాలలో ఆలోచనల మధ్య సామ్యం ఉన్న విషయం దృష్టి గోచరమవుతుంది. పడిగట్టు పదాలను ఉపయోగించటంలో పట్టుదలను, కోపతాపాలనూ వదిలి పెట్టి ఆలోచనలను పంచుకొంటున్నప్పుడు 'సంఘానికి వ్యతిరేకంగా మతతత్వవాదమని, పాత వ్యవస్థల పునరుద్ధరణవాదులని మీ మీద చేస్తున్న ఆరోపణలలో సత్యం లేదు' అని వారు అంటూ ఉంటారు.
అనేక సమస్యల విషయంలో అభిప్రాయాలు కలుస్తూ ఉంటాయికూడా. నమాజవాదులుగా ప్రకటించుకొనే వారితో మాట్లాడే సందర్భాలలో మన వాళ్ళు వారిని అడుగుతుంటారు. " ఈ సోషలిజం అనే మాటకు అర్థం ఏమిటి? వ్యక్తికి ఏవిధమైన గుర్తింపు, ప్రాధాన్యము ఇవ్వదలచని కమ్యూనిజాన్ని తీసుకురావాలని మీరు అనుకొంటున్నారా? వర్గ సంఘర్షణ పేరున లక్షలాదిమందిని చంపివేయ కోరుతున్నారా? మనిషి ఒక నిర్జీవమైన యంత్రంలోని ఒకనట్టు లేదా బోల్టువంటి భాగం లాంటివాడని అనుకొంటున్నారా?' అని. 'అబ్బే! అలాంటిదేమీ పరస్పరం లేదు. మేము మనుష్యుని మహానతను అంగీకరిస్తున్నాం, రష్యాలో, చైనాలో వచ్చిన వర్గసంఘర్షణ ఇక్కడ రావలసిన అవసరమే లేదు.” అని వారు చెప్పుతుంటారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు సోషలిస్టులు కూడా మంచి మార్పు కోరుతున్నవారేనని తెలిసివస్తుంటుంది.