: సావధానత ప్రతిక్షణమూ అవసరమే :
సంఘం ప్రారంభించకముందే, గాంధీజీ, తిలక్ మహాశయుల కాలంలోనూ తమ వ్యక్తిగత జీవితం కోసం ఏమీ చేసుకోకుండా, సమాజసేవచేసిన కార్యకర్తలున్నారు. వారిలో చాలామంది వైవాహిక జీవితాన్ని త్యాగం చేసి సమాజ సేవామగ్నులైనారు. ప్రజాజీవితంలో డాక్టర్జీకి గల అనుభవం అపారమైనది. ఆ అనుభవం ఆధారంగా వారు చెప్పుతూ ఉండేవారు. సమాజంలో వ్యవహరించే సమయంలో ఎంతో మెలకువగా ఉన్నప్పటికీ, ఎంతమెలకువగా ఉన్నప్పటికీ అది తక్కువే అవుతుంది. మేము అందరినీ జయించేశామనే అహంకారం ఏమాత్రం తగదు.
ఎవరైతే అహంకారంలో చిక్కుకుంటారో, వారు తప్పనిసరిగా దెబ్బలు తింటారు. మన మనస్సు లక్షవిధాల శుభ్రంగా ఉన్నప్పటికీ, యావత్ప్రపంచం యొక్క మనస్సుకూడా శుభ్రంగా ఉందని అనుకోలేము గదా! మనం నడుచుకొనే తీరు (మాట, వ్యవహారమూ), మనస్సు ఎంత బాణాపాడు చేయగా శుద్ధంగా ఉండాలంటే విమర్శనాత్మక దృష్టి, రంధ్రాన్వేషణ దృష్టి ఉన్నవారుకూడా ఏదోషమూ చూడజాలనంత శుద్ధంగా ఉండాలి. ఈ విధమైన సావధానత ప్రతిక్షణమూ అవసరం.