మన హైందవ సంస్కృతిలో జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణ అంశము చేర్చబడి ఉన్నది. మనం ఉదయం నిద్రలేచిన నుండి రాత్రి నిద్రపోయే వరకు మనం చేసే ప్రతిపనీ కూడా పర్యావరణ పరిరక్షణతో ముడిపడిఉన్నది. ముఖ్యంగా కుటుంబం ద్వారా ఐదు అంశాలు పర్యావరణ పరిరక్షణ చేయోచ్చు. దీనిని హరితఘర్ అంటారు.
1. వృక్ష పరిరక్షణ: మనం జీవించాలంటే స్వచ్చమైన ఆక్సిజన్ అవసరం కావున ఆక్సిజన్ కావాలంటే వృక్ష పరిరక్షణ ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా మీద్దె తోట, మన ఇంటి పై మనం వాడే కూరగాయలు మొక్కలు మరియు పువ్వుల చెట్లు బెషధ చెట్లు మన మిద్దె విద్య పై వివిధ రకాల చెట్లను ముక్కలను పెంచడం ద్వారా మరియు ఇంటి ముందట వేప చెట్టు వివిధ రకాల చెట్లు పెంచడం ద్వారా వృక్ష పరిరక్షణ చేయవచ్చు.
2. నీటి పరిరక్షణ: మనం నీరు లేనిదే జీవించలేం. కావున మనం నీటిని పాదువుగా వాడాలి. మనం స్నానం చేసేటప్పుడు షవర్ ద్వారా కాకుండా బకెట్‌లో నీటిని నింపి స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీటిని కూరగాయలు కడిగిన నీటిని మనం పొదుపు చేసి వీటి ద్వారా మొక్కలకు అందించాలి. వర్షపు నీటిని కూడా ఇంకుడు గుంటలు ద్వారా మనము నీటిని సంరక్షించాలి. భూమిలో నీటి శాతాన్నిపెంచుకోవాలి.
3. ప్లాస్టిక్: ప్లాస్టిక్‌ను మనం వాడకుండా ఉండడమే చాలా మంచిది కొన్ని పరిస్థితుల వల్ల వాడవలసి వస్తే మనం వాడిన ప్లాస్టిక్ కవర్లను ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి నిండిన తర్వాత ఆ ప్లాస్టిక్ డబ్బాలను వివిధ అలంకార వస్తువులుగా, చిన్న గోడల నిర్మాణంలో వాడుకోవచ్చు.
4. కంపోస్ట్ ఎరువుతయరీ: మనం వాడిన పొడి చెత్త, తడిచెత్తలను విడివిడిగా చేయాలి. పొడి చెత్తను మామూలుగా ఒక డబ్బాలో వేసి మూసినట్లయితే 20 రోజులలో అది ఇది ఎరువుగా తయారవుతుంది.
తడి చెత్తను ఎరువుగా మార్చాలంటే సుమారు రెండు మీటర్లు ఉండే లావుపాటి రెండు పైపులను
తీసుకోవాలి. వీటిని 20 సెంటీమీటర్లు లోతుగా తీసి దూరం దూరంగా పాతాలి. ప్రతిరోజు తడి చెత్తను ఒక ప్లాస్టిక్ పైపులో వేసి ఈ మూత పెడుతూ ఉండాలి ఆ పైపు నిండిన తర్వాత దాన్ని పూర్తిగా 40 రోజులపాటు మూసి ఉంచాలి. 40 రోజుల తర్వాత మంచి కంపోస్ట్ ఎరువు తయారీ ఈ 40 రోజులపాటు రెండవ పైపులో తడి చెత్త వేయాలి ఈ రకంగా మార్చి వాడుకోవచ్చు.
5. వనరులు పరిరక్షణ: విద్యుత్తును, పెట్రోల్‌ను వాడకాన్ని తగ్గించాలి. దీనికి బదులుగా ప్రత్యామ్నాయ సోలార్ శక్తిని ఇంటికి, వాహనాల కొరకు వాడుకోవచ్చు. కావున ఎనర్జీ సేవింగ్ చాలా ముఖ్యమైనది. వృధా పోతున్న సూర్యుని శక్తిని మనం వాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణ విభాగం ప్రతి కుటుంబంలో ఈ ఐదు అంశాలు పాటించినట్లు కృషి చేస్తుంది. ఈ ఐదు అంశాలను 'హరితఘర్” పేరుతో మనం ప్రచారం చేస్తున్నాం.
పర్యావరణ పరిరక్షణ బాగుంటేనే ప్రపంచ మంతా ఎలాంటి విషమ పరిస్థితులను ఎదుర్కొంది. వరదలు ఉప్పెనలు భూకంపాలు వీటన్నిటి ద్వారా రక్షింపబడాలి. అంటే పర్యావరణ సమతుల్యత ఉండాలి.