: పరమపూజనీయ - డా॥ హెడగేవార్ జీవిత సంగ్రహం :
“క్రియాసిద్ధిః సత్వేభవతి మహతాం నోపకరణే”
ప్రపంచంలో మానవుడు ఆలోచించని అపేక్షించని ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అందులో కొన్నింటికి “విధి వైపరీత్యం” అని నిట్టూరుస్తాం. ఉరుములు, మెరుపులు, ఎడతెరపిలేని వానా, నిప్పులు చెరిగే ఎండల్లో రవ్వంతైనా వాడక, మార్దవం కోల్పోక, నవనవలాడుతూ సాగివస్తూన్న ఒక లత అనుకోకుండా ఏదో ఒకనాడు చిన్న గాలికెరటం తాకిడికే సమూలంగా వాలిపోయినట్లయితే ఆ “విధివిధానాన్ని” ఏమనాలి ? పరమ పూజనీయ దాక్టర్‌జీ నిర్యాణమూ ఇలాంటిదే.
ఆ మహామహాని పవిత్రస్మృతిని ఎలా స్తుతించాలి ? హిందూరాష్ర్ట్రానికి మంత్ర ద్రష్ట సామర్ధ్యమూ, దివ్యదృష్టీ కలిగిన నాయకుడు, వీరవ్రతాన్ని సృజించిన మహానుభావుడు, స్నేహితులపాలిట పట్టుకొమ్మ, అనాధబాలుర క్షేమాన్ని కోరే పితృతుల్యుడు-ఇలా ఎన్నిపేర్లు పెట్టి ఆయన ఘనతను మాటలతో చెప్పడానికి ప్రయత్నించినా అసంపూర్ణమనే అనాలి. అంతులేని ఆకాశంలా వెలుగొందే మహావిభూతికి హద్దులేర్చరచడం, సంకుచిత పరిధిలో ఇముడ్చడం ఎలా సాధ్యమవుతుంది ? కీర్తిని కాంక్షించక త్యాగమే సర్వస్వంగా ప్రకాశించిన ఈ పుణ్యాత్ముని జీవితాన్ని వర్ణించడానికి మాటలకటువు ఏర్పడుతుందనడంఅతిశయోక్తి కాదు. కాని మనసా ప్రేమించిన ధ్యేయదేవతను సమ్మానింపనిదే భక్తహృదయానికి తనివితీరదు. సంపూర్ణంగా తృప్తి లభించడమనేది అసంభవమే. ఐనా (థద్ధాపూర్వకంగా సమకూర్చుకున్న భావప్రసూనాంజలి ఆ సమాధిమైోల అర్చిస్తే కొంతవరకైనా ఆత్మతృప్తి లభిస్తుంది. ఈ భావమే ఈ ప్రయత్నానికి ప్రేరేపిస్తుంది.
కుటుంబ పరిచయం
శా.శ. 1811 (క్రీ.శ. 1889) సంవత్సరాది పాడ్యమినాడు నాగపూరులో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో డాక్టర్‌జీ జన్మించారు. నాగపూరులో బీవితము సందేశము చాలాకాలంనుంచి ఉంటూ వచ్చిన సనాతనుల్లో వీరి కుటుంబం ఒకటి. పూర్వులు హైదరాబాద్ సంస్థానంలోని కందకుర్తి నివాసులు. వేదాధ్యయనం, వేదాధ్యాపనం ఈ రెండే వీరికి లభించిన పిత్రార్దన సంపత్తి. కాని పౌరోహిత్యం ఎన్నడూ చేయకపోవడం వీరి కుటుంబానికి ఒక విశిష్టత. తండ్రి బలీరామ్‌పంత్‌కు ముగ్గురు కుమారులు. జ్యేష్టుడు మహాదేవశాస్త్రి, ద్వితీయుడు సీత్రారాంపంత్, తృతీయుడు మన నాయకుడు కేశవరావు.
తల్లిదండ్రుల నిర్గమనం
నాగపూర్‌లో 1902లో ప్లేగు మరపురాని విలయతాండవం చేసింది. అప్పట్లో డాక్టర్‌జీ తండ్రి కుటుంబయుక్తంగా అల్లుడు వించురేగారి ఇంట్లో ఉంటూ ఉండే వారు. అచ్చటనుండి నిత్యం కులదేవత పూజ నిమిత్తం తమ ఇంటికి వస్తూ పోతుండేవారు. ప్లేగు మూలాన ఎవరైనా చనిపోయారన్న వార్త వింటే చాలు వారి అంత్యక్రియలలో సహాయపడేందుకు తప్పనిసరిగా వెళ్ళేవారు. శుద్ధికొరకు ప్రతిసారీ చన్నీటి స్నానం చేయవలసివచ్చినా, ఒక్కొక్కరోజు మృతుల దహన సంస్కారాల నిమిత్తం ఎన్నోసార్లు స్మృశానవాటికకు వెళ్ళి వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించేవారు. బలీరాం పంత్‌గారి సదాచార సంపన్నత ఎంత ప్రశంసనీయమైనదైనా ప్లేగుకు మాత్రం వారిపట్ల కనికరం లేకపోయింది. బలీరాం పంత్‌గారు, వారి సహధర్మచారిణి ఒకరితర్వాత ఒకరుగా ఇద్దరికీ ప్లేగు సంక్రమించింది.
ఇంటి భారమూ రోగుల బాధ్యత జ్యేష్టుడు మహాదేవశాస్త్రి పైనే పడ్డాయి. దగ్గరే ఉన్న వైద్యుణ్ణి పిలుచుకురావడానికి సీతారామ్ పంత్ వెళ్ళివచ్చేసరికి తల్లిదండ్రులు మరణించారు. అప్పటికి సీతారామ్‌పంత్ పద్దెనిమిదేండ్ల వాడు. డాక్టర్ జీ వయస్సు పన్నెండు సంవత్సరాలు. పూజ్యులగు తల్లిదండ్రులు ఇలా హృదయవిదారకంగా ఒకేసారి గతించడంతో డాక్టర్‌జీకి ప్రమమయమైన చల్లని నీడ కజువయింది. సీతారామ్‌పంత్ మితిమీరిన అన్నగారి అదుపాజ్ఞలకు నిలువలేక వేదాధ్యయనానికని ఇంటిని విడిచి వెళ్ళిపోయినారు.
జ్యేష్ట సోదరుడు
డాక్టర్‌జీ పెద్ద అన్న మహాదేవశాస్రిగారు మంచి బలిష్టుడు. వ్యాయాయం అంటే అయన కమిత ప్రీతి. ఇంట్లోనే ఒక వ్యాయామశాల వుండేది. ఆయన పరమవూజనీయ దా॥ హెడగేవార్ కోపిష్టి తలుపులు బార్లగా తెరచి ఉన్నా ఇంట్లో అడుగుపెట్టడానికి ఎంతవాడికైనా గుండెలుండేవికావు. కోపిష్టి అనే కానీ, స్వభావం చాలా సరళమైనది. అన్యాయాన్నీ అవమానాన్నీ సహించలేక పోయేవారు. ఒకసారి తిలక్ రోడ్డులో (నాగపూర్) తన మిత్రుని ఇంటి రెండవ అంతస్థులో కూర్చుని ఉండగా పది గజాల దూరాన ఆ రోడ్దుమీదనే ఒక హిందువును ఇద్దరు మహమ్మదీయులు కొడుతూండడం చూచారు. క్రోధావేశంలో ఒళ్ళు తెలియక ఆపై అంతస్తుమీదనుంచే రోడ్డుమీదికి దూరి ఆ ఇద్దరికి తన ముష్టిఘాతాలతో తగిన సమాధానం ఇచ్చారు. 1916లో పండిత మహదేవశాస్త్రిని గూడ ప్లేగు పొట్టన పెట్టుకున్నది.
స్వభావంలో మార్చు
ఈ కోపం కొంచెం హెచ్చుతగ్గుల్లో అన్నదమ్ము లందరిలోనూ ఉండేది. కాని తాము స్వీకరించిన ఈ సంఘటనకార్యానికి ఇలాంటి స్వభావం హాని కలుగచేస్తుందని తెలిసికొని, ప్రయత్నపూర్వకంగా దానిని అదుపులో పెట్టుకున్నారు దాక్టర్‌జీ. అప్పటినుండి ఆయన ప్రవర్తన ఎంతో స్నేహపూరితంగానూ, ఆర్ధంగానూ ఉండేది. ఈ గుణాలను అలవరచుకోవడమే కాదు, జీవితాంతంవరకు ఆచరించి చూపారాయన. సంఘటన కార్యంలో వ్యక్తిగతములైన ఇష్ట్రానిష్టాలకు తావునివ్వక, ఇతరులతో పూర్తిగా కలిసి మెలసి ఒకటై మెలగగలిగే వైఖరిని పాటించాలి.
సంఘటన కార్యంలో విచిత్ర స్వభావాలకు తావులేదు. రకరకాల మనుష్యులమధ్య పరస్పరం సంబంధం వచ్చినపుడు భేదభావాల కారణంగా సంఘటన కార్యానికి నష్టం వాటిల్లకుండా ఉండాలంటే, ప్రతివ్యక్తీ జాగరూకుడై తన లోపాలను తొలగించుకుని సమైక్యతకు అనువుగా మారాలి. ఈ మార్పును దాక్టర్‌జీ తమనుంచే ఆరంభించారు. ప్రసంగవశాత్తు ఎప్పుడైనా కర్ణకలోరమైన మాటలు వినవలసి వచ్చినా, శాంతంగా వినగలిగే సమానశీలతనూ, గాంఛీర్యాన్నీ కష్టపడి ప్రయత్నించి అలవరచుకున్నారు. బాల్యంలో శరీరం దృఢంగా ఉండకపొయ్యేది. కాని నిత్యమూ వ్యాయామం చేసి తగినంత బలంకూడా సంపాదించుకోగలిగాడు. వేకువన నాలుగైదు మైళ్ళు పరుగెత్తడం, వ్యాయామం చేయడం, రెండుశేర్ల గుమ్మపాలు త్రాగడం, ఇలా విడువకుండా ఇరవై సంవత్సరాలపాటు చేసినందువల్ల ఆ తరువాత బాధలబరువుకు జీవితం కృంగిపోకుండా విజయం సాధించగల సామర్థ్యం ఆయనకు సమకూడింది.
ఆత్మవిశ్వాసం
శరీరసామర్థ్యానికి తోడుగా ఆత్మవిశ్వాసం. పట్టుదలకూడా ఆయనలో ఉండేవి. పెరటిలో క్రొత్తగా త్రవ్వించిన బావికి వాస్తుకర్మ చేయించేముందు ఒకసారి నీరంతా తోడి బావిని శుభం చేయాలని ఆయన నిశ్చయించుకున్నారు. దీనికి పెద్దల అనుమతి లభించదమనేది అసంభవం. అందుకని మొదట ఇంట్లోకి అవసరమైనంత నీరు వేరుగా తోడిపెట్టి, తెల్లవారేసరికి ముగ్గురు అన్నదమ్ములూ కలిసి ఒక్క నీటిబిందువుకూడా లేకుండా బావిని అద్దంలా చేశారు. ఇంట్లోచూస్తే కటిక బీదతనం; వృత్తిచూడబోతే వేదాధ్యాపనం. అందుకని డాక్టర్‌జీ బాల్యంలో కొన్ని ఇండ్లలో దేవతార్చన చేస్తూ అక్కడనే భోజనం చేసేవారు. పేదల కష్టాలు పేదలకే తెలియాలి ! బాధలు, విచారాలు, దుఃఖదైన్యాలు, వీటితో వీరికి శాశ్వతస్నేహం. మన అదృష్టంవల్ల ఈ దుఃఖదైన్యాల జ్వాలల్లో డాక్టర్‌జీ వ్యక్తిత్వం కుమిలిపోలేదు.
బాల్యంలో సంస్కారాలు
ఆ మహానుభావుని ఆదర్భజీవితానికి నాందికూడా చాలా సాధారణంగా జరిగింది. పాఠశాలల్లో ఛత్రపతి శివాజీ చరిత్రను పిల్లలు ఆనాటినుంచి ఈనాటివరకు చదువుతూనే వున్నారు. కాని పసితనంలో బరువెక్కిన హృదయంతో చదివిన ఆపాఠాన్ని దాక్టర్‌జీ యావజ్జీవితం మరువలేదు. వేలమైళ్ళ దూరాన్నుంచి సప్త సముద్రాలుదాటి విదేశీయులు ఈదేశానికి రావడం, వ్యాపారసంస్థను
స్థాపించడం, చిటుకవేసినంతలో తమ రాజ్యాన్నీ ప్రభుత్వాన్నీ నెలకొల్పడం, ఇవన్నీ ఆ పసిహృదయానికి తర్మయుక్తాలుగా కనుపించలేదు. ఎవరో కొందరు విదేశీయులు ఇంత విశాలమైన భూమిని శాసిస్తుండడం చూచి ఆయన హృదయం తపించేది.
మహారాష్ట్ర సామ్రాజ్య ప్రాచీన వైభవాన్ని స్కృతిపథాన నర్తింపచేసే భగ్నావశేషాలు, భోంప్లే రాజధాని నాగపూర్‌లో అప్పటికింకా మిగిలిఉందేవి. ఆ హృదయ విదారకర దృశ్యాలను చూచినపుడు ఏ హిందూహృదయం (ద్రవించిపోదు. డాక్టర్‌జీ జన్మతః ఆదర్భజీవి. మరి భావశబలమైన ఆయన యువకహృదయం తన పూర్వుల విజయాలకు ఆనందంతో నర్తించిందంటేనూ, వారి పరాభావాలకు క్రుంగిపోయిందంటేనూ ఆశ్చర్యమేమున్నది: ఆయన జీవితంలో ప్రతిపనిలోనూ ఆ ప్రాచీన చరిత్ర తన ప్రభావాన్ని అచ్చువేసినట్లు కన్పిస్తూవుంటుంది.
యదార్థ జీవిత ప్రారంభము
రాష్ట్రాన్ని సముద్ధరించి, ప్రజలను సమీకరించడానికి ప్రయత్నించినా, పేరు ప్రతిష్టలంటే డాక్టర్‌జీ ఏవగించుకునేవారు. కొన్ని కొన్ని అనుభవాలవల్ల తుదివరకూ వారలాగే పేరుప్రతిష్టలకు విముఖులుగా ఉందేవారు. అభినందనలో, సందేశాలో, దుఃఖోపశమనాలో, ఆశీర్వాదాలో పరిస్థితుల ననుసరించి పంపి తమ భావాలను వ్యక్తం చేయాలని తాపత్రయపడడం కూడా మంచిదికాదనే ఆయన తలంపు. దీనికంతటికి పేరుప్రఖ్యాతుల నాశించకపోవడమే కారణం. విద్యార్థి జీవితంలోనే ఆయన చేసిన ప్రతిపనిలోనూ దేశభక్తి, స్వాతంత్రేచ్చ్భా ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. కీ శే! శ్రీ జనార్థన వినాయకరావు ఓక్ “నీల్ సిటీ హైస్కూలుకు ప్రధానోపాద్యాయులుగ ఉంటూవున్న రోజులవి. “వందేమాతరం” సమస్యపై డాక్టర్‌జీ పెద్ద పెట్టున ఉద్యమం లేవదీశారు. ఆరోజుల్లో “వందేమాతరం” అని ఉచ్చరించటమే మహాపరాధంగా పరిగణింపబదేది. విద్యార్థులో దేశాభిమానాన్ని మేల్కొలుపుతున్న ఈ “అపరాధిని పాఠశాలలో ఉండనివ్వడం భావ్యంకాదని 'రిస్లేసర్క్యులర్' ననుసరించి ప్రధాపాధ్యాయులు భావించారు. స్కూలు రిజిష్టరులో పేరు కొట్టివేయబడింది. తరువాత డాక్టర్‌జీ 'యవత్‌మాల్' జాతీయ పాఠశాలలో చేరారు. కాని కొన్ని రోజులకే కొందరి ప్రేరేపించినందున ప్రభుత్వం ఆ పాఠశాలనుకూడా మూసివేసింది. అక్కడినుంచి డాక్టర్‌జీ పూనావెళ్ళి 'పూనా జాతీయ పాఠశాలలో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్డులైనారు. తరువాత కొంతకాలంపాటు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసి, ఇంట్లో చదువుచెప్పి కొంతధనం ప్రోగుచేసుకున్నారు. అటుపైన 1910లో కలకత్తాలోని “నేషనల్ మెడికల్ కాలేజీలో చేరారు. వారి యదార్థ జీవితం ప్రారంభమయ్యేది ఇప్పటినుంచే.
కలకత్తాతో ఆరు సంవత్సరాలు
1907-1908లో జరిగిన “స్వదేశీ ఉద్యమం” తరువాత లోకమాన్య తిలక్, లాలా లజపత్‌రాయ్ మొదలైన జాతీయ నాయకులంతా నిర్చంధింపబడ్డారు. వారి నిర్బంధంతో వారు వ్యాపింపచేసిన చైతన్యంకూడా చల్లారిపోయింది. నలువైపులా స్తబ్ధత వ్యాపించింది. డాక్టర్‌జీ 1906-1908 వరకు జరిగిన ఉద్యమాలలో దేశభక్తికి ఒరవడి దిద్దుకున్నారు. ఆయన పట్టుదల సడలకపోగా రోజురోజుకూ దృఢమైంది. అప్పుడే గరమ్‌దళ్ (అతివాద) రాజకీయపక్షంలో చేరారు. కలకత్తాలో డాక్టర్‌జీ ఉన్నది మొత్తం ఆరుసంవత్సరాలు. ఈ కొద్దికాలంలోనే వందలకొలది ఆదర్బోపాసకులైన యువకులు ఆయనచుట్టూ చేరారు. ఈ విధంగా దాక్టర్‌జీ తమ కార్యరంగాన్ని విస్తరింపచేసుకున్నారు. అప్పుడే సుప్రసిద్ధ వంగప్రాంత దేశభక్తులు శ్రీశ్యామసుందర చక్రవర్తి, బాబూ మోతీలాల్ ఘోష్, అమృతబజార్ పత్రికా సంపాదకవర్గం, ఇంకా అనేకమంది సుప్రసిద్ధ నాయకులతో డాక్టర్‌జీకి పరిచయం లభించడమే కాక వారితో ఆయనకు సన్నిహిత సంబంధంకూడా ఏర్పడింది.
శాంతినికేతన్ వసతిగృహం
1908లో కలకత్తాలో 'మహారాష్ట్రలాడ్డ్' స్థాపన జరిగింది. బీరారు, మధ్యప్రాంతం, మహారాష్ట్ర కన్నడ ప్రాంతాలనుంచి మెడికల్ కాలేజీలో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు ఇందులో ఉండేవారు. క్రొత్తగావచ్చే విద్యార్థుల సంఖ్య 'హెచ్చడం ఆరంభమైంది. పరిమితికిమించి విద్యార్థులు రావడంజూచి, శ్రీ అణ్జాసాహెబ్ భాహ్వే సలహాననుసరించి 'శాంతినికేతన్' అనేపేర మరొక నూతన వసతిగృహం ఆరంభింపబడింది. ఈ వసతిగ్భహంలో డాక్టర్‌జీయే అగ్రగామిగా ఉండేవారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన తెలివితేటలూ, దేశభక్తీ, సాహసం కల్గిన విద్యార్థులు ఇక్కడ ఒకచోట కూడారు. "శాంతినికేతన్ యువక బృందం” అంటే కాలేజీలోనేకాక, మొత్తం నగరంలోనే పేరుమోగింది. సమానవృత్తి నవలంబించే సమాన వయస్కులు ఒకచోట చేరినప్పుడు సహజంగా కన్పించే హాస్యవినోదాలవల్ల తదితర కార్యక్రమాలవల్లా “శాంతినికేతన్ లాడ్జి' నిరంతరం కళకళలాడుతూ ఉండేది. ఏదోరీతిగా దేశభక్తిని బలపరచే కార్యక్రమాలే అక్కడ జరుగుతూ ఉండేవి. అక్కడి వాతావరణం తదనుకూలంగానే ఉండేది. ఈ కార్యక్రమాలన్నింటికీ డాక్టర్ జీయే అగ్రగామిగా ఉండేవారని వేరే చెప్పనవసరం లేదు. అప్పటి ఆయన విద్యార్థిజీవితమంతా ఇలా 'స్వదేశోద్యమాన్ని గురించి అత్యధికంగా ప్రచారం చేయడంలోనే గడిచింది. వందలకొలదిగా నూతన కార్యకర్తలతో మైత్రి సంపాదించుకోవడం, తమ కార్యరంగాన్ని విస్తరింపచేయడం, ఈ విధంగా అనేక ఉద్యమాలను ఆరంభించడం, ఇదీ నాటి ఆయన కార్యక్రమం.
బెంగాలీ జీవితంతో సమైక్యత
కలకత్తాలో బెంగాలీ ప్రజలు ఆరంభించిన ప్రతి ఉద్యమంలోనూ, ప్రతి కార్యక్రమం లోనూ డాక్టర్‌జీ అత్యంతోత్సాహంతో పాల్గొంటూ ఉండేవారు. రాష్ట్ట్రోద్ధరణకొరకు సంకల్పింపబడిన ప్రతి ఉద్యమంలోనూ ఆయన తప్పనిసరిగా పాల్గొంటూ ఉండేవారు. కలకత్తాలోని అనేకమంది నాయకులతోనూ, కార్యకర్తలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. ప్రాంతీయ సంకుచి తత్వం లేని అఖండ రాష్ట్రీయభావాలతో ఆయన హృదయం తొణికిసలాడుతూ ఉందేది. అందుకే త్వరగా బెంగాలీ సమాజంలో కలిసిపోగలిగారు.
బెంగాలీ సమాజంలో ఒకరుగా, బెంగాలీ ప్రజలకై పాటుపడేందుకు అనువుగా, అచటి వేషభాషలను కూడా పూర్తిగా అలవరచుకున్నారు. కొద్దికాలంలోనే బెంగాలీభాష అనర్గళంగా మాట్లాదేశక్తి వారికి లభించింది. జీవితాంతంవరకూ ఎప్పుడైనా బెంగాలీ స్వయంసేవకులు కలిసినప్పుడు, వారితో బెంగాలీలోనే మాట్లాడుతూ ఉండేవారు. సంకుచిత ప్రాంతీయతకు డాక్టర్‌జీ హృదయంలో తావు లేనందువల్లనే బాబూ శ్యామనుందర్ చక్రవర్తి మొదలైనవారు డాక్టర్‌జీని తమ ఆత్మీయునివలె చూసుకొనేవారు. ప్రభుత్వాగ్రహానికి గురియై, నిర్వాసితులైన అనేకమంది వంగ యువకులను ఆయన స్వయంగా పోషిస్తూండేవారు. నిస్సహాయులైన అనేక వంగ కుటుంబాలకు ఆయన యెంతో ఆదరంతో అనేక విధాల సాయంచేస్తూ ఉండేవారు. దామోదరనది వుష్పాంగి వేలకొలది కుటుంబాలను నిరాశ్రయులను చేసినప్పుడు, రామ కృష్ణాశ్రమం పక్షాన నిర్వాసుల సహాయానికై డాక్టర్‌జీ చేసిన ప్రయత్నాలు మరువరానివి. దేశంలో అందరినీ డాక్టర్‌జీ సమదృష్టితో చూడగలిగేవారని చెప్పడానికివి నిదర్శనాలు. ఏ ప్రాంతీయులైనా సరే నిస్సహాయులైతే జాలిపడి, గుండె కరిగి సహాయానికై పరుగులెత్తేవా రాయన. ఈవిధంగా హిందువులందరి సుఖదుఃఖాలను స్వీయ సుఖదుఃఖాలుగా భావించండని మనకు ప్రబోధించారు. మొదట తాను ఆచరించిన తరువాతనే ఈ ప్రబోధం ఇతరులకు చేశారు.
ధ్యేయవాద జీవితం
ఇలా దాక్టర్‌జీ ప్రయత్నాలవల్ల అనేక కార్యక్రమాలు నడువబడుతూ ఉండడం చూస్తు ఉన్నప్పుడు పోలీసువారి 'చూపు' ఆయనవైపు ప్రసరించక తప్పుతుందా? నాగపూర్‌లో నీల్‌సిటీ హైస్కూల్లో విద్యార్థిగా వుంటున్నప్పటినుంచే సి.ఐ.డి. పటాలం ఆయన వెంటబడుతూ ఉండేది. దీనిని, ఇతర సాంఘిక కార్యక్రమాలను సరిచూచుకుంటూ, అనేక విషయాలలో ఉత్తమజ్ఞానాన్ని సంపాదించుకొంటూ, ప్రథమశ్రేణిలో ఎల్.ఎం. అండ్ ఎస్.పరీక్షలోవారు ఉత్తీర్ణులైనారు.
సమాజంకొరకు పాటుపడే వ్యక్తులపట్ల గౌరవం, విశ్వాసం ఉండాలంటే ఇతర గుణాలతోపాటు విద్యాయోగ్యత కూడా ఉండడం ఎంతో అవసరమని డాక్టర్‌జీ విశ్వాసం. సంఘకార్యకర్తలీ విషయాన్ని ఎన్నడూ ఉపేక్షించరాదని డాక్టర్‌జీ పదేపదే నొక్కి చెబుతూండేవారు. విద్యార్థులుగా ఉన్నంతవరకు “దేశభక్తి అంటూ తళుకు బెళుకులతో మెరసి, విద్య పూర్తికాగానే స్వార్ధంతో మునిగితేలుతూ, దేశాన్నేకాక ఉచితానుచితాలను కూడా విస్మరించే కృత్రిమాచరణ ఆయన చేయలేదు. “డాక్టర్” పరీక్షలో ఉత్తీర్ణులైనా ఆయన 'డాక్టరీ మాత్రం చేయలేదు. రాష్ర్ట్రోద్ధరణ, సమాజసేవ ఇదే జీవితానికి ఆదర్భాలుగా ఎన్నడో బాల్యంలో స్వీకరించిన ప్రతిజ్ఞను డాక్టర్‌జీ తన బొందిలో ప్రాణమున్నంతవరకూ విసర్జించలేదు. ధ్యేయాన్ని సాధించడానికి జీవితాంతంవరకు పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటంలోనే తుట్టతుదకు తన ప్రాణాల్ని సైతం ఆహుతి చేశారు.
కర్తవ్య దీక్ష
దాక్టర్‌జీ తన జీవనపద్ధతిని తాను స్వీకరించిన ధ్యేయానికి అనుగుణంగానే ఏర్పరచుకున్నారు. తుదివరకు ఆ ధ్యేయానికి ఎలాంటి బాధలనూ రానివ్వలేదు. అందుకే ఆయన జీవితాంతంవరకూ వివాహమే చేసుకోలేదు. వివాహంకంటే పరమ శ్రేష్టమైన కర్తవ్య మొకటి తన్ను ఆహ్వానిస్తున్నదని ఆయన గ్రహించారు. ఆ కర్తవ్యాన్ని పూర్తిచేస్తే తన జీవితం సార్ధక మవుతుందని ఆయన విశ్వాసం.
వ్యక్తిగత వ్యామోహాలవల్లకానీ, ఇతర వ్యామోహాలవల్లకానీ తాను స్వీకరించిన ధ్యేయాన్నుంచి కొంచెమైనా చలించకుండా ఉండడమే ఆయన అభీప్సితం. అందుకే “ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని హృదయంలోనే భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నారు.
మొదట రకరకాల సంసార తాపత్రయాలను సృష్టించుకోవడం, తరువాత వాటికి తట్టుకొనలేక ఆదర్శాలను వదలుకోవడం మహాదోషమని డాక్టర్‌జీ అభిప్రాయం. యౌవనంలో ఉండే జవసత్వాలు, సాహసం, త్యాగం పట్టుదల మొదలైన సుగుణాలన్నీ తన ఆదర్శాన్ని సాధించడానికి ఉపయోగపడాలికాని, సంసారంలోపడి జీవితాన్ని నిరుత్సాహంగా, నిరాశామయంగా చేసుకొని స్వార్థ దారిద్ర్యాదులకు లోనే ఆత్మను చంపుకోడానికి కాదని ఆయన వాదన. అదే డాక్టర్‌జీ వ్యక్తిగత జీవితంలో కన్పిస్తుంది. ఆదర్భ్శంపట్ల ఎడతెగని భక్తిగలిగి ఉండడమే ఆయన సంకల్పం. ప్రతిరోజు 24 గంటలు కష్టపడినా సమయం చాలనట్లుంటే, ప్రత్యేకంగా జీవనోపాధికీ ధనసంపాదనకూ సమయం ఎక్కడిది ? కాని భగవత్మార్యాన్ని నెరవేరుస్తున్న ఈ మహాపురుషుని పోషించేభారం ఆ పరమేశ్వరుడే వహించాదని చెప్పక తప్పదు. చేతిలో దమ్మిడీకూడా ఉండేదికాదు. ఐనా నిరాశకు తావులేదు. ఇంతేకాక ఇతరులకు తన దారిద్ర్యాన్ని సూచనప్రాయంగానైనా తెలియనిచ్చే వారుకాదు. ప్రతి సంవత్సరం గురుదక్షిణగా భగవధ్వజ సమక్షంలో భక్తిపురస్సరంగా రూ॥ 101/-లు అర్పిస్తూ తన అల్పశక్తికి ఎంతో పరితపించేవారు.
తీవ్రజిజ్ఞాస
1915 నుండి 1924 వరకు దేశంలో జరుగుతూ ఉన్న ఉద్యమాలనూ, సంస్థల కార్యక్రమాలనూ చూస్తూ వాటిని గ్రహించడానికీ లోతుపాతులను తెలుసుకోడానికీ, దేశంలోని దుస్థితికి యదార్ధ కారణాన్ని కనిపెట్టడానికీ ఆ పదిసంవత్సరాలు వినియోగించారు. మన మాతృభూమియైన భారతవర్షం వైశాల్యంలో, జనసంఖ్యలో, సృష్టి సౌందర్యంలో, ఖనిజ సంపత్తిలో, పాడిపంటల్లో ఇవేగాక వేదాంతం, ధర్మం, సంస్కృతి, చరిత్ర, విద్య, పరాక్రమం కళాకౌశల్యాదుల్లో ప్రపంచంలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఇప్పుడూ వెనుకబడలేదు. మరి ఏ దౌర్చల్యంవల్ల ఇంత ప్రాచీన హిందూరాష్టం నానాటికి అధోగతిపాలవుతున్నది? డాక్టర్‌జీ హృదయాన్ని ఈ సమస్య నిరంతరం వేధిస్తూ వుందేది. ఈ సమస్యకు తగిన పరిష్కారం లభించక మహానాయకులే కనుపించిన కాలిబాటన రాష్ట్రాన్ని తమ వెంట నడిపించే ప్రయత్నం చేస్తున్నారని దాక్టర్‌జీ (గ్రహించారు. ఆయన బుద్ధికి ఈ మార్గాలు తృప్తిని చేకూర్చలేకపోయినాయి. అందుకని రాష్ట్రోద్ధరణకై జరిగే ప్రతి ఉద్యమంలోనూ పాల్గొంటూ ఉన్నా, పై ప్రశ్నకు సరియైన సమాధానం వెదకుతూ ఉండేవారు.