ఏపీలో కదంతొక్కిన బీజేపీ శ్రేణులు
విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల పదోతేదీన జరుపతలపెట్టనున్న వినాయక ఉత్సవాలపై ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించకుండా అనుమతులు ఇవ్వాలని సోమవారం రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శ్రేణులు కదంతొక్కాయి. తాము కరోనా నిబంధనలు పాటిస్తూ మండపాల్లోనే వినాయకచవితి ఉత్సవాలు జరుపుకొంటామని ప్రకటించాయి.
జిల్లా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, కడప తదితర చోట్ల కలెక్టరేట్లు, సబ్ కలెక్టరేట్లను ముట్టడిరచాయి. విశాఖపట్నంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గణేశుడి విగ్రహాన్ని తలపై పెట్టుకుని కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ శ్రేణుల ఆందోళనతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
__విశ్వసంవాద కేంద్రము