: జిహాద్-ఇస్లాం నిరంతర మత యుద్ధం :
మొదటి అధ్యాయం
జిహాద్ ప్రస్తావన
జిహాద్ ఇస్లాం మతంలో ఒక ముఖ్య అంశం. ముస్లిములతో శతాబ్దాల తరబడి జీవిస్తూ, వ్యవహరిస్తూ వచ్చిన హిందువులకు జిహాద్ అంటే ఏమాత్రం అవగాహన లేదు. కొందరు హిందువులు జిహాద్ అంటే ధర్మయుద్ధమని అనువదిస్తారు. ఈ అనువాదం పూర్తిగా తప్పు. ధర్మయుద్ధమంటే ధర్మశాస్త్రాలలో చెప్పిన నియమాల ప్రకారం చేసేయుద్ధం. ఆయుధం లేనివాడితో, ఆయుధాన్ని జారవిడిచినవాడితో యుద్ధం చేయకుండా ఉండటం, శరణుకోరిన శత్రువుకు హాని కలిగించకపోవటం, ఓడిపోయి పారిపోతున్న శత్రువును చంపకుండా ఉండటం, శత్రు శిబిరంలో ఉండే సైనికేతరులపై దాడి చేయకపోవటం, శత్రు రాజ్యపు స్త్రీలు, దేవాలయాలు, సాధుజనులకు హాని చేయకపోవటం మొదలైన నియమాలు కలది ధర్మయుద్ధం.
హిందువుల్లో మత యుద్ధమనే సాంప్రదాయం లేదు. మత యుద్ధం సెమిటిక్ (యూదు, అరబ్బు) జాతుల ప్రత్యేక లక్షణం. సెమిటిక్ మతాలు (యూదు, క్రైస్తవ, ఇస్లాం). యూరపులోను, ఆసియాలోను మత యుద్ధాల ద్వారా సృష్టించిన భీభత్సం ఎంతటిదో తెలియని సాధారణ హిందువు తన సాంప్రదాయంలో తనకు పరిచయమున్న యుద్ధ లక్షణాలను జిహాదు ఆపాదించి అది కూడా ధర్మయుద్ధం వంటిదే అని భ్రమపడతాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు (ముఖ్యంగా ముస్లిమేతరులు) జిహాద్ నిజ స్వరూపాన్ని, దాని మూలసూత్రాలను తెలుసుకోవడం అత్యవసరం. రోజు రోజుకీ మన దేశంలో ఉగ్రరూపం ధరిస్తున్న మతకలహాలు పూర్తిస్థాయి నిరంతర యుద్ధం (జిహాద్)గా ఏదో ఒకనాడు జలయ్యే అవకాశం ఉంది. ఒక సాధారణ ముస్లిం కూడా ఒక సాధారణ హిందువుకు లాగే శాంతిని, సామరస్యాన్ని కోరుకుంటాడనడంలో సందేహం లేదు.. అయినప్పటికీ ఒక సాధారణ ముస్లిం ఇస్లాం సూత్రాలను ఉల్లఘించకుండా శాంతి, సహజీవనాల కోసం ప్రయత్నించడం అసాధ్యం.
జిహాద్ కి ఐదు ముఖ్యలక్ష్యాలు ఉన్నాయి. అవి :
1. ఇస్లామును బలప్రయోగంతో వ్యాప్తి చేయడం,
2. ముస్లిమేతరులను సంపూర్ణంగా నాశనం చేయడం.
3. యుద్ధంలో లొంగిపోయిన ముస్లిమేతరుల మీద జిజియా పన్ను విధించి, తద్వారా వాళ్లు ఇస్లాంలో చేరేటట్లు ఒత్తిడి చేయడం.
4. ముస్లిమేతరుల ఆస్తులను దోచుకోవడం.
5. ఓడిన ముస్లిమేతరుల స్త్రీలను, పిల్లలను చెరబట్టడం.
హిందువులు జిహాద్ గురించి సరైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఎందుకంటే దానివల్ల వారి ప్రాణాలకు, ఆస్తులకు, స్త్రీల గౌరవానికి ప్రమాదముంది. తమ మధ్య జీవించే ముస్లిములు జిహాద్ సిద్ధాంతాన్ని విడిచి పెట్టేటట్లుగా హిందువులు గట్టి ప్రయత్నం చెయ్యాలి. అంతకంటే ముందు తమ ఉదాసీనతను వదిలి పెట్టి ఇస్లాం సిద్ధాంతాల గురించి తగినంతగా తెలుసుకోవాలి. లేనట్లయితే హిందువులు సంపూర్ణంగా నాశనమవడానికి ఇక ఎంతోకాలం పట్టదు. ఇరానులో '70వ దశకంలో ఖోమేనీ ప్రారంభించిన ఇస్లామిక్ విప్లవంతో మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఏడవ శతాబ్ది నాటి జిహాద్ పూనకాన్ని తిరిగి ప్రదర్శించనున్నారని స్పష్టమైన సూచనలు కనపడుతున్నాయి. భారతీయ ముస్లింలు ఆ పూనకం చేత ప్రభావితులవుతున్న స్పష్టమైన సూచనలున్నాయి. అయినప్పటికీ హిందువులు దాన్ని గమనించకుండా ప్రస్తుతం ముస్లింలతో గల అసహజ, కృత్రిమ సంబంధాన్నే సహజీవనమని భ్రమపడుతూ ఉన్నారు. ఈ ధోరణి ఆత్మహత్యతో సమానం.
ఇక ముస్లింలు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జిహాద్ సిద్ధాంతం తమకు ఇహ, పరలోకాల్లో లాభసాటిగా ఉండవచ్చు గాక. కాని ఏ మాత్రం వివేకమున్నా అటువంటి అమానుష సిద్ధాంతాన్ని వ్యతిరేకించాలి. వాదన కోసం ముస్లిం - "శత్రువులతో నిండిన ఈ ప్రపంచంలో మాకున్న ఒకే ఆత్మరక్షణ సాధనం జిహాద్” అని అనవచ్చును. కాని మతిస్థిమితం గల వాడెవరూ ఆత్మరక్షణ పేరుతో తన మతానికి చెందనివారి మీద శాశ్వత యుద్ధాన్ని ప్రకటించడు. ఆత్మరక్షణ అనేది ప్రతి వ్యక్తికి ఉన్న హక్కు ఆత్మరక్షణకు యుద్ధానికి దిగిన వ్యక్తి పట్ల లోకం సానుభూతి చూపవచ్చు. కాని జిహాద్ ఆత్మరక్షణ ప్రక్రియ కాదు. అది ముస్లిమేతరులను పూర్తిగా తుడిచి పెట్టేందుకు ఉద్దేశించిన సంపూర్ణ, శాశ్వత యుద్ధం. అలాంటి దౌర్జన్యపూరిత చర్యను ఆత్మరక్షణ పేరుతో సమర్థించేవాళ్లు ప్రజలను ఘోరంగా వంచిస్తున్నారని అర్థం.
ముస్లిమేతరులు మేలుకోవాలి : జిహాద్ మొదలైన ఇస్లామిక్ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం భారతీయులకు, ముఖ్యంగా హిందువులకు అత్యవసరం. ఒకప్పుడు ముస్లిం పండితులు జిహాద్ గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఏ మాత్రం సంకోచించకుండా దాని నిజస్వరూపాన్ని వెల్లడించారు.
కాని క్రమంగా పరిస్థితులు మారాయి. పాశ్చాత్య హేతువాదం, మానవతావాదం వృద్ధి చెంది క్రైస్తవ మతాన్ని కృంగదీశాయి. నైతిక విలువలకు పలుకుబడి పెరిగింది. ఎంత గొప్ప మత గ్రంథంలో చెప్పిన విషయాలైనా నైతిక పరీక్షకు నిలబడే వాటిని మాత్రమే అంగీకరించడం, మిగిలిన వాటిని తిరస్కరించడం పరిపాటైంది. అందువల్ల జిహాద్ సమర్ధకులు అనేక సాకులు, సమర్ధనలు సృష్టించారు. ఇంతకుపూర్వం కత్తితో సమర్ధించిన జిహాద్ సిద్ధాంతాన్ని ప్రస్తుతం పాండిత్యంతోను, తర్కంతోను సమర్థించవలసి వస్తోంది.
సాధారణంగా ఒక విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి, దాని విషయంలో మూల గ్రంథాలు ఏమి చెపుతున్నాయో వెల్లడించేది పాండిత్యమనిపించుకుంటుంది. విషయం నలుగురికీ అర్థమయేటట్లు సులభమైన ఉదాహరణలను, వివరణలను ఇవ్వడం తర్కపద్ధతి అనిపించుకుంటుంది. కాని జిహాద్ మొదలైన ఇస్లామిక్ సిద్ధాంతాల విషయంలో ముస్లిం పండితులు సాధారణ పాండిత్యానికి, తర్కానికి పూర్తి విరుద్ధమైన పద్ధతులను అవలంబించారు. సుహాస్ ముజుందార్, హర్షనారాయణ్, అన్వర్ షేక్, ఇ వారక్ మొదలైన అనేకమంది పండితులు జిహాద్ సమర్థకుల తప్పుడు పాండిత్యాన్ని పటాపంచలు చేశారు. జిహాద్ సిద్ధాంతం చుట్టూ ముల్లాలు అల్లిన సమర్ధనల వలను చీల్చి, దాని నిజస్వరూపాన్ని ప్రజల ముందు నిలబెట్టారు. రక్తం ఓడుతున్న ఇస్లాం చరిత్రలో ముఖ్యపాత్ర వహించిన జిహాద, ప్రస్తుతం కాశ్మీరులో పెద్ద ఎత్తున, దేశవ్యాప్తంగా చెదురుమదురుగా జరుగుతున్న జిహాద్ కి తేడా ఏమీ లేదని నిరూపించారు.
కొద్దిపాటి పరిశీలనా జ్ఞానం కలవారెవరైనా గ్రహించగలిగిన స్పష్టమైన ఈ విషయాన్ని కొందరు పండితులు కష్టపడి ప్రజలకు బోధపరచవలసి రావడం సిగ్గుచేటు. ఒకనాటి అరేబియాదేశపు “పొగనులు"* మహమ్మదు ప్రవర్తననుబట్టి ఇస్లాం ఎటు వంటిదో సులభంగా గ్రహించారు. కాని ఒంటిదేవుడి మతాల స్వభావాన్ని అంచనా వేయడంలో మన వివేకం ఎందుకు పనిచేయటం లేదో ఆలోచించాలి. ఈ విషయం అర్థం కావాలంటే ఇస్లాం మీద ఇటీవల ముస్లిం పండితులు కప్పిన సాధుత్వపు ముసుగును తొలగించి చూడాలి. అలా చూడగలిగింది. భారతదేశాన్ని మించినది మరొకటి లేదు.
మన దేశపు ఆధ్యాత్మికత, యోగశాస్త్రం మానవుడి సహజ తార్కికతకు, నైతికతకు అనుగుణమైనవి. అంతేకాదు ఇవి మానవుడి తార్కిక పటిమను, చేతనాస్థాయిని ఉన్నత కక్ష్యలకు తీసుకువెళ్ళగలవు. అందువల్లనే ఈ పుస్తకంలోని మూడవ భాగంలో యోగ దర్శనం సహాయంతో ఇస్లాం మతాన్ని విశ్లేషించి చూపడం జరిగింది. ఆ విశ్లేషణలో మానవత్వమనే నిచ్చెనలో ఇస్లాం ఏ మెట్టు మీద ఉందో మనకు కనబడుతుంది.
శుక్రనీతి సారం ఆరు రకాల ఆకతాయిలను గుర్తించింది. హిందూ శాస్త్రాల ప్రకారం ఆతతాయిలంటే అధార్మికులు, అధర్మపరులు :
అగ్నిదః గర్దశ్చైవ శస్త్రపాణిర్ధనాపః క్షేత్ర దారహరశైవ షడేతే ఆతతాయినః||
తాత్పర్యం : ఇతరుల ఆస్తులకు నిప్పు పెట్టేవాడు, వ్యక్తులకు విషం పెట్టేవాడు, ఇతరుల మీద ఆయుధ ప్రయోగం చేసేవాడు (చంపే ఉద్దేశ్యంతో), ఇతరుల సంపదను దోచుకొనేవాడు, ఇతరుల భూములను ఆక్రమించేవాడు, పరస్త్రీలను చెరబట్టేవాడు - ఈ ఆరుగురూ ఆతతాయిలు.
అటువంటి ఆతతాయిల విషయంలో భగవద్గీత ఇలా బోధిస్తుంది. 'జహిమా వ్యతిష్ణో”- అంటే 'ఆతతాయి కనిపించిన వెంటనే చంపు' - అని. ఇదీ అధర్మ పరులపట్ల మనకుండవలసిన దృక్పథం.
బైబిల్లో అధార్మికుల పట్ల మరొకరకమైన దృక్పథం కనపడుతుంది. అదే దృక్పథం కురానులోను కనిపిస్తుంది. వారి మతగ్రంథాల్లో ఆయా మతాల దృక్పథాలను స్పష్టంగా వివరించారు. వారి దృక్పథం ప్రకారం పై చెప్పిన దుండగీడు చర్యలకు వారి దేముడి అంగీకారం, అనుమతి, మెచ్చుకోలు కూడా ఉన్నాయి. దుండగీడు చర్యలు చేసేవాళ్లు, వాటిని సమర్థించేవాళ్ళు ఆ. మతాల్లో ఉన్నత స్థానాలను పొంది దేవదూతలుగా, ప్రవక్తలుగా, సూఫీలుగా, సెయింట్లుగా గౌరవించబడుతున్నారు. ఈ దృక్పథాన్ని సెమిటిక్ దృక్పథమంటారు. దీంట్లో కూడా కొన్ని శిక్షలు ఉన్నాయి. కాని అవి దుండగీడు చర్యలకు పూనుకొనేవాళ్ళకు, వాళ్ళను సమర్ధించేవాళ్ళకు వేసే శిక్షలు కావు. దుండగీడు చర్యలను అడ్డుకొనేవాళ్ళకు శిక్షలు వేయాలనేది వారి సిద్ధాంతం!
సెమిటిక్ దృక్పథం ఇస్లాం రూపంలో భారతదేశంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించింది, ఆ తరువాత పోర్చుగీసుల ద్వారా క్రైస్తవ మతం వచ్చింది. ఇస్లాం క్రైస్తవ ఆతతాయి ఉద్యమాల నిజస్వరూపాలను అనేక దౌర్జన్య చర్యల రూపంలో హిందువులు రుచి చూశారు. అయినప్పటికీ ఆయా మతస్తుల దుండగీడు చర్యలకు ప్రేరణ వారి మతాల్లో ఉందనే సత్యాన్ని హిందువులు గ్రహించలేకపోయారు. అలా గ్రహించలేకపోవడం చాలా పెద్ద తప్పిదమని చరిత్ర ఋజువు చేసింది.
ముస్లింలు, క్రైస్తవులు చేసే దురాగతాలకు కావలసిన ప్రేరణ కురాను, బైబిళ్ళ నుంచి వస్తోందని గ్రహించలేని హిందువులు 'నిజమైన ఇస్లాము', 'నిజమైన క్రైస్తవం' పేరు మీద సరిగ్గా ప్రవర్తించండంటూ వాళ్ళకు విన్నపాలు చేస్తూ వచ్చారు. అలాంటి విన్నపాలు చేసినవారిలో ముఖ్యుడు. మహాత్మాగాంధీ. ముస్లింలకు, క్రైస్తవులకు తెలిసినదానికంటే, వాళ్ళు ఆచరించే దానికంటే వేరుగా 'నిజమైన ఇస్లాము', 'నిజమైన క్రైస్తవం' ఎక్కడో వేరుగా ఉన్నాయనీ, ఆ 'నిజమైన' మతాల పేరున విన్నపాలు చేస్తే వాళ్ళు మారతారని భావించడం హిందువుల భ్రమ. భ్రమ మాత్రమే కాదు మూర్ఖత్వం కూడా. అట్టి భ్రమ క్రమంగా ముదిరి నేటి వికృత సెక్యులర్ ధోరణిగా, కుహనా సర్వధర్మ సమభావనగా బలపడింది.
సర్వధర్మ సమభావాన్ని సమర్ధించే హిందువులు హిందూమతంతో ఇస్లాము, క్రైస్తవాలను సమానం చేయడం ద్వారా ఆయా మతాలు హిందువుల మీద నిరంతరం జరిపే దుండగాలను సమర్ధించినవాళ్ళయ్యారు. ఈ మాటను వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. కాని ఇది పచ్చినిజం. హిందువుల గుడ్డి నమ్మకం, దాన్నుంచి పుట్టిన అపాత్ర విశ్వాసం (నమ్మకూడని వారిని నమ్మడం) హిందూ సమాజానికి చేస్తున్న హానిని వెల్లడి చేయక తప్పదు.
పైన చెప్పిన సెక్యులరిజం కాకుండా మరొక రకం సెక్యులరిజం కూడా ఉంది. అది పడమటి నుంచి దిగుమతైన మార్ఫిజం నుంచి పుట్టింది. ఈ రెండో రకం సెక్యులరిజం హిందూ మతాన్ని ఇస్లాం, క్రైస్తవాలతో సమానంగా పరిగణించదు. అది హిందూ మతాన్ని బాహాటంగా, సంపూర్ణంగా ద్వేషిస్తుంది. మరోవైపు ఇస్లాం, క్రైస్తవాలను సమర్థించి, అవి హిందూ మతం మీద చేసే దాడులకు తనవంతు సహాయ సహకారాలను అందిస్తుంది. అటువంటి ధోరణిని తిట్టడం కంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అవసరం. అప్పుడు అనేక ఆసక్తికరమైన, ఉపయోగకరమైన విషయాలు తెలుస్తాయి. సైద్ధాంతిక మూలాల్లో మార్ఫిజానికి, సెమిటిక్ మతాలతో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ సిద్ధాంత బీజాలన్నీ బైబిల్లో కనబడతాయి. లెనిన్, స్టాలిన్, మావోల దుండ
గాలను సమర్థించేవాళ్ళు ఇతర దుండగీడుల దుశ్చర్యలను వ్యతిరేకిస్తారని ఆశించడం పొరబాటు. అందులోనూ తాము ప్రధాన శత్రువుగా భావించే హిందూ మతం పై దుండగాలను సాగించే ఇస్లాం, క్రైస్తవాలతో మార్క్సిస్టులు చేయి కలపడంలో ఆశ్చర్యమేమీ లేదు, ఇక జిహాద్ గురించి వివరించే ముందు ఇస్లాం మూల ఆధారాలను సంక్షిప్తంగా పరిచయం చేయడం అవసరం.
మీకు తెలుసా !
* ఒకే దేవుడు, ఒకే ప్రవక్త, ఒకే పవిత్ర గ్రంథం, ఒకే విశ్వాసుల బృందం గలవి ఒంటి దేవుడి మతాలు లేక సెమిటిక్ మతాలు. అనేకమంది ఇష్టదేవతలు గలవి, ఇతర మతాలను అకారణంగా ద్వేషించనివి పొగనుమతాలు, లేక బహుదేవతామతాలు. విగ్రహారాధన పాగను మతాల సహజ లక్షణం కాగా, విగ్రహ విధ్వంసకత సెమిటిక్ మతాల సహజ లక్షణం. *
రచన: ముక్కంటి