ఒలింపియన్‌ల కోసం ప్రధాని మోదీ చూపిన శ్రద్ధ నన్ను బాగా కదిలించింది - కపిల్ దేవ్, మాజీ క్రికెట్ కెప్టెన్
భారతదేశంలో ఏ ప్రధానమంత్రి అయినా మన దేశంలో క్రీడా సంస్కృతిని సృష్టించాలని మరియు క్రీడలు ఆడాలనుకునే పిల్లలను ప్రోత్సహించమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశాడా అనేది తెలియదు. బహుశా అలా చేయడంలో మోడీ జీ మొదటి వ్యక్తి కావచ్చు.
క్రీడలను ప్రోత్సహించమని తల్లిదండ్రులను అడగడమే కాకుండా అది ఎలా జరగాలో కూడా ప్రధాన మంత్రి క్రీడల పట్ల మరియు మన క్రీడాకారుల పట్ల తాను ఆసక్తి చూపించడం ద్వారా తెలియచేశారు. సాధారణంగా క్రీడాకారుల విజయం సాధించినపుడే మాత్రమే ప్రజలు ఆసక్తి చూపిస్తారు. ఎవరైనా విఫలమైనప్పుడు, వారు మరచిపోతారు. ఏదేమైనా, అథ్లెట్ జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే విజయం లేదా వైఫల్యంతో సంబంధం లేకుండా వారి పోరాటం గురించి ఆలోచించే ఎవరైనా ఉన్నారని గుర్తించడం. మోడీ జీ తన చర్యల ద్వారా కేవలం పతకాలు మాత్రమే కాక క్రీడాకారులు చేసిన కృషిని గుర్తించడం కనిపించింది. ఇటీవల ఒలింపిక్స్ ఆడుతున్నప్పుడు టెలివిజన్‌లో వస్తున్నప్పుడు కానీ ఒలింపిక్స్ అనంతరం కానీ ఇది కనిపించింది. మోడీ విజేతలు మరియు మెడల్స్ కోసం ప్రయత్నిస్తున్న వారితో కూడా గడిపాడు. ఒలింపిక్ హాకీ జట్టు సభ్యుడు పీఆర్ శ్రీజేష్ ఒక ముఖ్యమైన కామెంట్ చేసాడు. జట్టు గెలిచినప్పుడు చాలా మంది కాల్ చేస్తారని, కానీ ఓడిపోయినప్పుడు కూడా ప్రధాని కాల్ చేశారని అది ఓడినవారికి చాలా విలువైన సందేశం అని చెప్పారు.
ఉదాహరణకి, మోడీ జి వినేష్ ఫోగట్‌తో మాట్లాడిన విధానం మరియు పతకం గెలవనందుకు తనపై తను కోపం తెచ్చుకోకుండా ఆమెను అనునయించింది. "విజయం ఎప్పుడూ మీ తలలోకి వెళ్లకూడదు మరియు వైఫల్యం మీ హృదయంలోకి వెళ్లకూడదు". ఇది ఆమెకే కాదు, ఆ పతకం గెలవని ఈవెంట్‌లోని చాలా మందికి కూడా ఇది ఉన్నత సలహా. ఒలింపిక్స్ స్థాయిలో పోటీపడే అథ్లెట్లు తమపై తాము గొప్ప అంచనాలను కలిగి ఉంటారు. వారి ఆశలు గల్లంతైనప్పుడు, వారు స్వీయ-శిక్ష మోడ్‌లోకి ప్రవేశించడం సులభం. అటువంటి ఒంటరి సమయాల్లో, వారికి మద్దతుగా ఒక భుజం అవసరం. దీనికి ఒక దేశం మొత్తం తమతో నిలబడి ఉందని చూపించడానికి భారత ప్రధాని కంటే మెరుగైనవారు ఎవరు?
క్రీడాకారులతో ప్రధాన మంత్రి కనెక్ట్ అయ్యే విధానంలో అప్రయత్నంగా ఓదార్పు మరియు సహజమైన ప్రేమ భావన ఉంది. అతనికి చాలా మంది అథ్లెట్ల పేర్లు తెలుసు. వారి మొదటి పేరు ఆధారంగా వారితో సులభంగా కనెక్ట్ అయ్యారు. అతనికి లోవ్లినా బోర్గోహైన్ తల్లి ఆరోగ్యం గురించి తెలుసు, అతను ద్యుతి చంద్ పేరు యొక్క అర్ధం గురించి మాట్లాడారు, అతను రవి దహియాను తక్కువ సీరియస్‌గా ఉండి ఎక్కువ ఉల్లాసంగా ఉండాలని ఎక్కువ మంది అథ్లెట్లతో కనెక్ట్ అవ్వమని వారికి చెప్పారు.
మోదీకి అథ్లెట్ల వ్యక్తిగత వివరాల గురించి తెలియడం మాత్రమే కాదు, అతను శ్రద్ధతో ఒలింపిక్స్‌ను ఫాలో అయి ప్రతి క్రీడలోని సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకున్నారు. లేకపోతే, గాయం ఉన్నప్పటికీ ఎలా కంటిన్యూ అయ్యావు అని భజరంగ్ పునియాను అడగడం లేదా రవి దహియాను అతనికి జరిగిన పంటి గాటు గురించి అడగడం జావెలిన్ విసిరిన క్షణంలోనే అతను గెలిచాడని అతనికి ఎలా తెలుసని నీరజ్ చోప్రాను అడగడం అసాధ్యం. ప్రధాన మంత్రి వారి మ్యాచ్‌లను చాలా ఆసక్తిగా అనుసరిస్తున్నాడని ఒక అథ్లెట్ గుర్తుంచుకోవాల్సిన తరుణం ఇది.
సాధారణంగా ఏదైనా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు అధికారికంగా ఉంటాయి. రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలకే ప్రాముఖ్యం. క్రీడాకారులు మీరు కేవలం సైడ్ షోకు మాత్రమే పరిమితం అనే సందేశం వెళ్తుంది. దురదృష్టవశాత్తూ ఈ రాజకీయ సంస్కృతి దశాబ్దాలుగా క్రీడలను పట్టుకుంది. కానీ ఒలింపియన్లతో ప్రధాని సమావేశంలో, ప్రసంగాలు లేవు, లాంఛనాలు లేవు. మైక్ ఆన్‌లో ఉందా లేదా అని తెలియని కొందరు అథ్లెట్ల కోసం ప్రధాని వారి మైక్‌ను కూడా పట్టుకున్నారు! ఈ ప్రధాని ప్రవర్తన ఇక్కడ క్రీడాకారులు ముఖ్యం, వారు చెప్పేది ముఖ్యం అనే సందేశాన్ని వారికి స్పష్టంగా ఇచ్చింది.
ఈ ఈవెంట్ అంతటా,మంత్రులు లేదా బ్యూరోక్రాట్‌ల గురించి కాకుండా కేవలం క్రీడలు మరియు ఒలింపిక్స్ లో భారతదేశం కోసం చెమటలు చిందించిన వారి గురించేనని అందరూ దృష్టి పెట్టేటట్లు చూసారని స్పష్టమైంది. క్రీడా రంగంలో ఉన్న యువతకు ఇది ఒక ముఖ్యమైన సందేశం.
బహుశా, మోడీ జీకి నిజంగా క్రీడల పట్ల ఆసక్తి, వివిధ రకాల క్రీడలలో భారతదేశం ఎదుగుదల పట్ల ఇలాంటి ఆసక్తి ఉండవచ్చు. లేకపోతే ఇంత చక్కటి ఈవెంట్ ఇలా నిర్వహించడం సాధ్యపడదు అతను ప్రత్యేకంగా CA భవానిదేవి గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉండదు. భారతదేశంలో ఫెన్సింగ్‌ను అగ్రగామిగా తీసుకురావడంలో ఆమె కొత్త అధ్యాయాన్ని లిఖించారు అందువల్ల పతకం రావడం, రాకపోవడం పట్టింపు లేదని ప్రధాన మంత్రి అన్నారు.
నీరజ్ చోప్రాకు చుర్మతో మరియు పివి సింధుకు ఐస్ క్రీంతో ట్రీట్ చేస్తున్న మోడీ జీ చిత్రాలు వైరల్ కావచ్చు. అయితే అవి కొన్ని మధుర క్షణాల మాత్రమే అనుకుంటే అసలు దీనినుండి తెలుసుకోబడ్డది ఏమిటంటే భారతదేశ ప్రజాస్వామ్యానికి నాయకత్వం వహించే వ్యక్తి క్రీడలు మరియు క్రీడా సంస్కృతి ముఖ్యమని భావిస్తున్నారు అని. ఇది చాలా మంది యువ మరియు వర్ధమాన క్రీడా తారలకు భారతదేశంలో అథ్లెట్లుగా వారి భవిష్యత్తు గురించి ఎక్కువ ఆశలను కలుగచేసింది. వారు గౌరవించబడతారని మరియు విలువైనవారగా గుర్తించబడతారని వారికి తెలిసింది.
ఇది క్రీడా సంస్కృతిని సృష్టించడాన్ని ప్రోత్సహిస్తుంది, ఇది మోదీ జీ యొక్క అతి ముఖ్యమైన వారసత్వాలలో ఒకటి. ఒక క్రీడాకారుడిగా, క్రీడాభిమానులు ప్రధాని నుండి ప్రేమ మరియు ఆప్యాయతను పొందడం చూసి నేను చాలా భావోద్వేగంతో సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తులో మనం మరిన్ని పతకాలు గెలవాల్సి వస్తే మనం క్రీడా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి మరియు అగ్రశ్రేణి క్రీడాకారులు ఉపయోగించాల్సిన క్రీడా వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండకూడదు అని నేను సలహా ఇవ్వాలి అని అనుకుంటున్నాను.
మోదీ జీ, ఆజ్ యాప్ నే పూరీ స్పోర్ట్స్ సోదర్ కా దిల్ జీత్ లియా హై. జై హింద్. (కపిల్ దేవ్ 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్) కపిల్ దేవ్
రచన అనువాదం - చాడా శాస్త్రి...