సంఘం విషయంలో సమాజంలో రకరకాలుగా నిర్ధారించుకొన్న అభిప్రాయాలున్నవి. సంఘంపట్ల వ్యతిరేకమైన అభిప్రాయాలున్నవారు బుద్ధిపూర్వకంగా సంఘాన్ని గురించి తప్పుడు అభిప్రాయాలను వ్యాపింపజేస్తున్నారు. సంఘం యొక్క పైకి కనిపించే రూపం-గణవేషము, సమయానికి కార్యక్రమానికి చేరుకొనే పద్ధతి, అనుశాసనంపట్ల దృఢంగా ఉండటం, ఆజ్ఞాపాలనము మొదలైనవాటిని చూసి కొంతమందిలో భ్రమలు ఉత్పన్నమౌతూ ఉండవచ్చు. అయితే, సంఘంలోని మంచి విషయాలపట్ల ఏవిధమైన భ్రమలుకానీ ఉత్పన్నం కాకూడదుగదా! అయినా అన్నింటికీ తప్పుడు అర్థాలు తీసేవారుంటారు. కమ్యూనిస్టులే కాదు; మనవాళ్ళు (మన ప్రభుత్వం) కూడా ఎంతో కొంతగా సంఘం గురించి అపప్రచారం చేస్తున్నారు. ఒక అమెరికన్ పుస్తకంలో నకూశా గ్లాండ్ (పైకి కనబడకుండా అంతర్గతంగా ప్రభావంచూపే వినాళగ్రంధి) అంటూ సంఘాన్ని వర్ణించటం జరిగింది. సంఘంలో గణవేష ధరించి పెరేడ్ చేస్తుంటాం కాబట్టి సంఘ విరోధులైన కొందరు 'నాజీవాద'మని దీనిపై ముద్రవేస్తుంటారు. సంఘం ప్రారంభమైంది 1925. అప్పటికీ నాజీ శబ్దం రూపుదిద్దుకోలేదు. ఎవరూ వినలేదు. ఇలా సాలూమూలంలేని ఆరోపణలను సంఘంపై గుప్పించుతుండేవారు. భ్రమలను నిర్మాణం చేయడానికి పనిగట్టుకొని యత్నిస్తుండేవారు. వాటిని మనం ఏనాడూ పట్టించుకోలేదు. వాటి గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోలేదు.
ఈనాడు సమాజంలో రకరకాల శబ్దాలు రూఢియై ప్రయోగించబడుతున్నవి. ఆయా శబ్దాలకుగల అసలైన అర్థాలను వెలికితీసి, వైజ్ఞానికంగా వ్యాఖ్యానించటం జరిగితే, వాటికి ఏమాత్రం విలువ ఉండదు. అయినా ఆ శబ్దాలను బట్టి ఆయా సమయాల్లో లోకం ఏదారినపోతూ ఉందో, మనం గ్రహించుకోవచ్చు. సమాజవాదం (సోషలిజం), ప్రగతిశీలత, మితవాదులు (రైటిస్టులు) మధ్యమ మార్గీయులు (సెంట్రిస్టులు)-ఇలాంటి మాటలు అనేకం మాటిమాటికి వినబడుతూ ఉంటవి. విశ్లేషించి చూస్తే, ఈ పదాలవెనుక ఏవిధమైన విషయం ప్రాధాన్యం లేదని తెలిసిపోతుంది. కాగా ప్రపంచం ఏదిశలో నడుస్తున్నదో గ్రహించుకొనడానికి ఈ పదాలు ఉపయోగపడగలవు.
విషయసూచిక :
♦♦♦♦