చేయకూడని పనులు
- ఇతరుల వస్తువులను వారి అనుమతి లేకుండా తీసుకోవదు.
- సాధ్యమైనంతవరకు ఇతరుల వస్తువులను ఉపయోగించవద్దు.
- ఇతరుల దోషములను, లోటుపాట్లను గురించి వారి పరోక్షంలో మాట్లాడకూడదు.
- ఇతరుల ఉత్తరాలను చదువకూడదు.
- ఇతరులతో మాట్లాడునపుడు కండ్లు, ముఖము పక్కకు తిప్పకూడదు.
- కాలిమీద కాలువేసి కూర్చోవడం, కాళ్లు ఆడించడం సభ్యతా లక్షణం కాదు.
- మీరు మాట్లాడాలనుకున్న వ్యక్తి ఏదైనా వ్రాస్తుంటే, ఏమి వ్రాస్తున్నారో చూడరాదు.
- వేళ్ళు విరుచుకోవడం, గోళ్ళు కొరకడం సభ్యతా లక్షణం కాదు.
- భోజనంచేస్తుంటే వారి ఎదురుగా నిలబడి మాట్లాడవద్దు.
- ఏ వస్తువునూ ఎడమచేత్తో ఇవ్వకూడదు.
- నిలబడి నీళ్ళు త్రాగకూడదు.
- నిలబడి మూత్ర విసర్జనము చేయకూడదు.
- మనకంటే పెద్దవారిని ఏకవచనంతో పిలువకూడదు.
- గడపను త్రొక్కకూడదు.
- గడపమీద కూర్చోకూడదు.
- గోవు, పుస్తకము మరియు పెద్దలకు కాళ్ళు తగలకుండా జాగ్రత్త పడుతుండాలి.
- ఆహారాన్ని వెదజల్లకూడదు. పారేయకూడదు.
- దేవాలయములోనున్నపుడు, ప్రాపంచిక భౌతిక ఆలోచనలు చేయకూడదు.
- ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకోకూడదు.
- రైలు, బస్సు ప్రయాణంలో స్వంత విషయాలను బంధువులతోగాని పరాయివాళ్ళతోగాని చర్చించకూడదు.
కుటుంబానికి కరదీపికలో తరువాతి అంశం చదవండి → " పెద్దలు ఆలోచించవలసినవి "