: శాఖ అనేది సంస్కార జాగరణ కేంద్రం :
పంజాబ్ లో ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. 1947లో పెద్ద ఎత్తున దాడులు, అల్లర్లు, కొట్లాటలు జరిగినవి. యాబైమంది స్వయంసేవకులు దృఢంగా నిలబడిన చోట అనేక యాభైలమంది సమాజంనుండి ముందుకు వచ్చి స్వయంసేవకులకు తోడుగా నిలిచారు. ఎప్పుడన్నా ఒక నిరసన ప్రదర్శన నిర్వహించాలనుకున్నపుడు జనం గుమిగూడేవారు, కాని ఎప్పుడైతే 'పరుగెత్తండి, పారిపోండి' అని కేకలు వినబడేవో, ఏమి జరుగుతున్నదో తెలుసుకోకుండానే పరుగెత్తి పారిపోయేవారు.
సమాజంలోని సామాన్యజనుల మానసికస్థితి ఇలాగే ఉంటుంది. అందుచేత విశిష్ట జాతీయభావంతోనూ, సంస్కారాలతోనూ నిండిన వ్యక్తులు పరీక్షా సమయంలో అచంచలంగా నిలబడేవారు తగినంత సంఖ్యలో ఉన్నట్లయితే, అది సమాజంలోని మిగిలిన వారిపైకూడా ప్రభావం చూపుతుంది. ఇది అనివార్యంగా జరుగుతుంది. సంఘస్థాన కార్యక్రమాల ద్వారా స్వయంసేవకులలో ప్రవేశించిన భావాలు సమాజంలోకి చొచ్చుకుపోతాయి. నిత్యమూ జరిగే శాఖలో జరిగే కార్యక్రమాలు-చర్చ, పాట, గణవేష సంచలన్, ఇతర కార్యక్రమాలు, పరస్పర సంబంధాలు-వీటన్నింటి ఆధారంగా ఒక నిత్య సిద్ద శక్తి రూపుదిద్దుకొంటుంది, అది సమాజంలో ఎప్పుడు ఏక్షణాన తలఎత్తిన సమస్యనైనాఎదుర్కొని పరిష్కరించడానికి ఉపయోగానికి వస్తుంది. సంఘకార్య పద్ధతిద్వారా నిర్మాణమయ్యే శక్తి ప్రభావంతో సమాజంలో మనం కోరుకుంటున్న మంచిమార్పు తప్పక వస్తుంది.
ఇలా వచ్చే మార్చే సమాజంయొక్క స్వాభావిక సామర్థ్యం. సమాజంలో ఇటువంటి సామర్థ్యం మేల్కొని ఉన్నపుడు పెద్ద సమస్యలు తలఎత్తిన సమయాల్లోకూడా, ఏదో ఒక సంస్థ ముందు నిలిచి పిలుపు నివ్వవలసిన అవసరం కూడా ఉండదు. సమాజంలో అంతర్భూతమై ఉన్న సామర్థ్యమే పరిస్థితిని చక్కదిద్దుతుంది. ఈవిధంగా నిత్యసిద్ధి శక్తిద్వారా నిర్మితమైన సమాజపు స్వాభావిక సామర్థ్యం యొక్క ప్రభావం స్థిరంగా, బలంగా ఉన్నపుడు ఆ సమాజంలో సమస్యలు ఉత్పన్నంకావు, ఒకవేళ ఏవైనా సమస్యలు ఉత్పన్నమైనా, అవి తీవ్రరూపాన్ని ధరించే అవకాశం ఉండదు. యావత్తు హిందూస్థానంలో సంఘశాఖలు పెద్దసంఖ్యలో విస్తరించి, ఒక వల లాగ విస్తృతంగా అల్లుకొని ఉన్నపుడు, సమాజంలోని పెద్దసంఖ్యలో ఉన్న ప్రజానీకం శాఖలో ఉపస్థితులైనపుడు వారిద్వారా- మనం సమాజంలో ఎటువంటి పరివర్తన తీసికొని రావాలని కోరుతామో, అటువంటి పరివర్తన తీసికొని రాగల్గుతాము. సంఘశాఖ, సంఘస్థానము ఈ విధంగా ముందుముందు రాబోయే మార్పులకు ఆధారము, సంస్కారజాగరణలో తొలిమెట్టు అన్ని క్షేత్రాలనూ సరిదిద్దాలి.