: బౌద్దులు, జైనుల ఆధిపత్యంలో నీరసపడిన హిందూదేశం :
విదేశీ చరిత్రకారులు లేక ప్రత్యక్షంగా మనకు శత్రువులైన చరిత్రకారులు వ్రాసిన చరిత్రలే కాక స్వయంగా మన దేశీయులు వ్రాసిన చరిత్రలు కూడా స్వచ్చము, నిర్భీకమూనైన హిందుత్వ దృష్టితో వ్రాయబడినవి కావు. అందువల్ల హిందూ వైభవ చరిత్ర అనేకచోట్ల కనుమరుగు చేయబడి హిందుత్వ పరాజయ చరిత్రయే విపులంగా వ్రాయబడి అదే నిజమైన హిందూదేశ చరిత్రయని చెప్పబడింది.
ఈనాడున్న చాలా చరిత్ర గ్రంథాల్లో ముఖ్యంగా గత 200 సంవత్సరాల నుండి మన విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్న చరిత్ర (గ్రంథాల్లో భారతదేశంలో హూణుల పరాజయం తర్వాత హిందువులు సాధించిన వైభవం గురించి ఒక్కముక్క కూడా వ్రాయకుండా నేరుగా సింధులో హిందువుల మీద మహమ్మదీయులు జరిపిన దండయాత్ర గురించే వ్రాయబడింది. తర్వాత వరసగా ఒకదాని తర్వాత ఒకటి ఇతర మహమ్మదీయులు జరిపిన దండయాత్రల వర్ణనలే దానికి జోడించబడుతూ వచ్చాయి. మహమ్మదీయ పాలకుల వివరాలే ఏకరువు పెట్టబడినవి. దీని కారణంగా హిందువుల చరిత్ర కేవలం పరకీయ ఆక్రమణల, హిందూ పరాజయాల, బానిసత్వాల చరిత్రే నన్న దృఢ అభిప్రాయం ఇక్కడి చరిత్ర పాఠకుల్లో, విద్యార్థుల్లోనేకాక మేధావుల్లోకూడా ఏర్పడింది.
ఈ అబద్దపు చరిత్రనే నిజమైన చరిత్రయని మనమిత్రులు, శత్రువులు కూడా రెండు వందల సంవత్సరాలనుండి ప్రపంచమంతటా ప్రచారం చేస్తున్నారు. దా. అంబేడ్మర్‌లాంటి గొప్ప మేధావి మరియు జాతీయ నాయకుడికి కూడా ఈ విషయంలో సరియైన అవగాహన లేకపోవటం విచారించదగిన విషయం. హిందువుల చరిత్ర గురించి ఒక సందర్భంలో వారిలా వ్రాశారు. "The Hindus, has been a life of continuous defeat. It is a mode of survival of which every Hindu will feel ashamed" “హిందువులది నిరంతర పరాజయ జీవనం. ప్రతిహిందువు సిగ్గుతో తలదించుకోవాల్సిన
జీవనం అది.”
-- వినాయక దామోదర సావర్కర్.....శ్యాంప్రకాష్..🖉