దివ్యాంగులు ఎవరు? దివ్యాంగులనే ఇదివరకు వికలాంగులని అనేవారు. అంగ వైకల్యం ఉన్నవారు లేదా వికలాంగులు కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాల సమస్యలతో ఇతరుల మాదిరిగా జీవించ లేరు. ఇది సర్వత్రా ఉన్న అభిప్రాయం. మానవాళి అనుభవంలో ఒక కోణం. అయితే చరిత్ర చూస్తే ఈ అభిప్రాయం తప్పని వికలాంగులే రుజువు చేయడం గమనిస్తాం. వారిలోనూ అనన్య సామాన్యమైన ప్రతిభ దాగి ఉందని కాలమే బయటపెట్టింది. చరిత్రలోనూ, పురాణాల్లోనూ చూస్తే అష్టావక్రుడు, అనూరుడు (అరుణుడు) సంత్ సూరదాస్, వాయులీన మహా విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు, సంగీత జ్ఞాని రవీంద్రజైన్, ఇటీవలి నాట్యమయూరి సుధా చంద్రన్ అవయవాలన్నీ చచ్చు పడినా విశ్వం గుర్తించిన భోతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, లూయీ బ్రెల్ వంటి వారు వారి వారి రంగాలలో అసమాన ప్రతిభ చాటి ప్రపంచం మెప్పు పొందారు, చరితార్దులయ్యారు. ఇలాంటి దివ్యమైన ప్రతిభ, సామర్థ్యం ఉంటాయనే మన ప్రధాని నరేంద్ర మోదీ వీరిని దివ్యాంగులని పిలిచారు.
2004 గణన ప్రకారం 121.8 కోట్లు భారత జనాభాలో 2.68 కోట్ల మంది దివ్యాంగులు (2.21
శాతం), ఒక వ్యక్తి వికలాంగుడైతే, దాని ప్రభావం కుటుంబం మొత్తం మీద ఉంటుంది. ప్రతి ఇంటిలో సగటున ఐదుగురు సభ్యులుంటారనుకుంటే వికలాంగులతో 11 కోట్లమంది కుటుంబ సభ్యులు సహజంగా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటున్నారని అర్ధం చేసుకోవాలి. కానీ వారి పట్ల సమాజం దృక్పథంలో క్రమంగా మార్పు వస్తున్నది. పురుషసూక్తం ప్రకారం మనమంతా ఆ పరమ పురుషుడిలోనూ తద్వారా రాష్ట్ర పురుషుడిలోనూ అంగాలం. ఈ అంగాలన్నీ చక్కగా పనిచేసినప్పుడే దేశం ముందడుగు వేస్తుంది. వైకల్యం ఉన్నప్పటికి భూమ్మీద పుట్టిన ఏ
మనిషి వ్యర్థుడు కాడు. ఈ వాస్తవం ఆవిష్కృతమవుతోంది.
పృథ్వి ముద్ర |
అంగ వైకల్యానికి కారణాలు :
అంగ వైకల్యానికి కారణాలు మూడు విధాలు బిడ్డ పుట్టక ముందు, పుట్టేటప్పుడు, పుట్టిన తరువాత.
పుట్టక ముందు కారణాలు :
1. ఇవి జన్యుపరమైనవి. ఈ కారణాల వల్ల రక్త సంబంధిత లోపాలు, అంధత్వం, బధిరత్వం
మొదలైన వైకల్యాలు వచ్చే అవకాశముంది.
2. తల్లిదండ్రుల వ్యసనాలు, మద్యపానం, మత్తు పదార్ధాలు సేవించడం.
3. తల్లిదండ్రులలో రక్తహీనత, బలహీనతలు (ఈ లోపాలను ఆసన, ప్రాణాయామ, ధ్యానం మొదలైన యోగాసనాల ద్వారా తల్లిదండ్రులు నివారించుకోవచ్చు.)
జననంలోని సమస్యలు, కారణాలు :
పేగు మెడకు వేసుకోవడం, మెదడులో కొన్ని భాగాలకు ప్రాణవాయువు అందకపోవడం, ఏ విభాగానికి అందలేదో ఆ భాగం చచ్చుబడిపోవడం వల్ల సమస్యలు వస్తాయి. కొన్ని శరీరభాగాలు సరిగా నిర్మాణం కాక పూర్తిగా పని చేయలేవు. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా బిడ్డ పుట్టుక మీద ప్రభావం చూపిస్తాయి. నెలలు నిండకనే పుట్టడంవల్ల అంగాలన్నీ పూర్తిగా వికసించవు. దానివల్ల వైకల్యం ప్రాప్తిస్తుంది.
పుట్టిన తరువాత కారణాలు :
తల్లిపాలు అందకపోవడం, పిల్లలకు ఎక్కువగా జ్వరం రావడం, ఎపిలెప్సి, 'ఎన్ సెఫెలైటిన్' వంటివాటితో, ఆరోగ్యరక్షణ, ఇంటి వాతావరణం పిల్లల ఎదుగుదలకు అనుగుణంగా లేకపోతే భౌతిక మానసిక ఎదుగుదల సమస్యలు తలెత్తుతాయి. ప్రమాదాలు, వృద్ధాప్యం కూడా అంగ వైకల్యానికి దారితీస్తాయి.
దివ్యాంగుల సాధారణ సమస్యలు :
1. అంగాలు సరిగా పనిచేయకపోవడంతో కదలికలు తగ్గిపోతాయి. దీనితో తొందరగా లావెక్కే అవకాశం ఎక్కువ. ఈ సమస్యను రోజూ ఆసన ప్రాణాయామ సాధన వల్ల, సూర్య నమస్కారాల వల్ల అరికట్టవచ్చు.
2. సాటివారి చేత వివక్షకు గురికావడం, న్యూనతా భావం వల్ల చుట్టూ జరిగే కార్యక్రమాల పట్ల ఆనాసక్తత లేక ఉగ్రతను కూడా ప్రదర్శించే లక్షణం ఉంటుంది. ఈ లోపాలను ఆసన ప్రాణాయామ, ధారణ, ధ్యానం వల్ల నివారించవచ్చు.
3. అంధులు చూడలేరు కనుక శరీరాన్ని, నోరును శుభ్రంగా ఉంచుకో లేకపోవచ్చు. శుచి అనేది నియమాలలో ఒకటి కాబట్టి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, సేవాకార్యకర్తలు శుచిని నేర్పాలి. ఇతర వికలాంగులకు కూడా ఈ సమస్య ఉంటుంది. ముఖ్యంగా బుద్ధి మాంద్యం, కుష్టురోగ ముక్తులకు ఈ సమస్య ఉంటుంది. మానసిక రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
దివ్యాంగులు - యోగ |
: దివ్యాంగులు - యోగ :
ప్రధాని మోదీ నాయకత్వంలో 'థావర్చంద్' మంత్రిగా భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో "దివ్యాంగుల హక్కుల చట్టం' తీసుకు వచ్చింది. ఇది చరిత్రాత్మక చట్టం ఈ చట్టం 21 రకాల అంగ వైకల్యాలను గుర్తించింది. ఆ దివ్యాంగులకు యోగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. అయితే సాధన చేయించడానికి దివ్యాంగుల అనుమతి అవసరం.
అంధత్వం :
అంధులు పూర్తిగా దృష్టి కోల్పోయి ఉంటారు. వారికి శస్త్రచికిత్సల ద్వారా చూపు తెప్పించే ప్రయత్నం చేయవచ్చు. చూపు రాని వారికి యోగా నేర్పవచ్చు. నేర్పడానికి ముందు ఆ ప్రదేశం శుభ్రంగా ఉండేటట్టు చేయాలి. అవసరమైన చాప పరిచి, అది - కదిలి పోకుండా చూడాలి. మొదట గోడనో, కుర్చీనో స్తంభాన్ని పట్టుకునో, ఆనుకునో చేయించాలి. ఎక్కువ వివరణ ద్వారా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అవసరమయితేనే తాకాలి. అందుకు వారి లేక సంరక్షకుల అనుమతి ఉండాలి.
దృష్టిమాంద్యం :
వీరు అంధులు కారు. కానీ ప్రత్యేకమైన కంటి అద్దాలు, మాగ్నిఫెయిర్ పరికరాలతో చూడగలరు చదువగలరు. కంటి నరాలకు సంబంధించిన వ్యాయామాలు, ఉషోదయంలో సూర్యుణ్ణి గమనించటం వంటి ప్రక్రియలతో వారి దృష్టి మెరుగుపడే అవకాశం ఉంది. వీరు శిక్షకుల సహకారంతో అన్ని యోగా ప్రక్రియలు చేయగలుగుతారు.
కుష్పురోగం తగ్గినవారు :
కుష్టురోగం చిన్నప్పుడే సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధి చర్మాన్ని, నాడులను ధ్వంసం చేస్తుంది. చర్మం స్పర్శను కోల్పోయి, చేతి, కాలి వేళ్లకు ముక్కుకు దెబ్బ తగిలినా తెలియక పుండ్లు పడి త్వరగా మానక వికలాంగులవుతారు. వ్యాధి తగ్గినవారు రూపురేఖలను కోల్పోతారు. ఈ వ్యాధిని నివారించవచ్చును.
చర్మవ్యాధులకు ప్రాణాయామం చాలా మంచిది. ఎందుకంటే ప్రాణాలు శరీరమంతా ప్రవహిస్తాయి. ప్రాణాలను సంతులనంతో ఉంచడానికి అంతా వ్యాపించడ్డానికి ప్రాణముద్ర వేయడం మంచిది. బొటనవేలు, చిటికెనవేలు, ఉంగరపు వేలు కలిపి ఉంచి ధ్యానం చేయవచ్చు. చెన్నై నగరంలో 'సక్షమ్' స్వచ్చంద సంస్థ రామకృష్ణ మఠంతో కలసి కుప్టురోగులకు సేవలందిస్తోంది. వారికి 'వేదాద్రి మహర్షి యోగ'ను నేర్పుతున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గిపోతున్నాయి. వారి మానసిక సంతులనం అభివృద్ది చెందుతోంది. వేదాద్రి మహర్షి యోగను యూ-ట్యూబ్ చానల్లోనూ చూడవచ్చును.
వినికిడి సమస్య :
వినికి డి నమస్యలున్నవారు అన్నీ చూసి నేర్చుకోగలుగుతారు. చాలావరకు సంజ్జల ద్వారా నేర్పాలి. వీరు అన్నిరకాల ఆసన ప్రాణాయామాదులు చేస్తారు.
మరుగుజ్జు యోగా |
మరుగుజ్జులు :
అడుగుల 10 అంగుళాల కంటే తక్కువ పొడవుంటారు. వీరు రెండు రకాలు :
1. అసమ మరుగుజ్జులు : వీరి శరీరాంగాలు వ్యత్యాసాలతో ఉంటాయి. కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా ఉంటాయి. ఈ విధమైన మరుగుజ్జుతనంలో ఎముకల ఎదుగుదల సరిగా ఉండదు. వారి సమస్యలు :-
- కూర్చోవడం, పాకడం, నడవడం వంటి కదలికలు ఆలస్యం.
- చెవులలో చీము కారటం, దీనితో వినికిడి శక్తిని కోల్పోవడం,
- నిద్రలో శ్వాస తీసుకోవడంలో సమస్య ,
- పుర్రె కింది భాగంలో వెన్నుపూసపై ఒత్తిడి,
- మెదడు చుట్టూ ఎక్కువ ద్రవం
- దట్టమైన పళ్లు
- క్రమంగా గూని పెరగడంతో వెన్ను నొప్పి,
- శ్వాసతీసుకోవడంలో సమస్యలు
- దిగువ వెన్నెముక (వెన్నెముక స్టెనోసిస్)లో 'రంధ్రం, ఫలితంగా వెన్నుపై ఒత్తిడి, తరువాత నొప్పి, కాళ్లలో తిమ్మిరి.
- కీళ్లవాతం,
- బరువు పెరగడంవల్ల కీళ్లు, వెన్నెముకలో సమస్యలు క్లిష్టమవుతాయి.
నరాలపై ఒత్తిడి ఈ సమస్యలకు విజియోథెరవి చేస్తారు. యోగాలో ఫిజియోథెరప్ని మించి, మానసిక ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. ఆసన ప్రాణాయామం, ఇతర యోగాంశాలు పై సమస్యలను ఎదుర్కోవడంలో ప్రాముఖ్యం వహిస్తాయి. అయితే వీరికి అన్ని ఆసనాలు కుదరకపోవచ్చు. కుర్చీ దిండు, బంతి లాంటివి తీసుకుని వాటి సాయంతో సాధన చేయడం మంచిది.
2. సమ మరుగుజ్జుతనం ఈ రకం
మరుగుజ్జులలో అంగాలు తగినంతగా ఎదుగుతాయి. కానీ వాటిలో సమస్యలుంటాయి. లైంగికాభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. అసమ మరుగుజ్జుతనం ఉన్నవారికి కాన్పులో ఊపిరి సమస్యలు ఉండవచ్చు. వారికి సిజేరియన్ కాన్సు అవసరం. యోగసాధన మరుగుజ్జుకు ఆ సమస్యను పోగొట్టలేకపోవచ్చును కానీ, దానితో వచ్చే భౌతిక, ఆరోగ్య సమస్యలను కొంతమేర దూరం చేస్తుంది.
3. బౌద్ధిక వైకల్యం
దీనినే మెంటల్ రిటార్గేషన్ అంటారు. దీనివల్ల సమస్యల పరిష్కారం, నేర్చుకోవడం, పరిశీలన వంటి నైపుణ్యాలు తగినంతగా ఉండవు.
ఆటిజం స్పెకమ్ డిజార్డర్
నరాల సంబంధమైన ఈ లోపం క్రమంగా పెరిగే సమస్య.. ఇది ప్రవర్తన, నైపుణ్యతలపై ప్రభావం చూపుతుంది. ఇది ఏ వయసులోనైనా బయటపడ వచ్చు. సాధారణంగా రెండేళ్ల వయసులో బయట పడుతుంది. ఈ సమస్య వ్యక్తి అభిజ్ఞ, మానసిక సామాజిక, భౌతిక ఆరోగ్యాలను ప్రభావితం చేస్తుంది.
నిర్దిష్ట అభ్యాస వైకల్యాలు :
ఈ వైకల్యాలు ఉన్నవారు వినటం, ఆలోచించడం, మాట్లాడటం, రాయడం, వర్ణక్రమం లెక్కల దగ్గర ఇబ్బందులు వంటి సమస్యలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉండవచ్చు
ప్రసంగం, భాష వైఫల్యం :
అనేషియా -మూగతనం, రాయలేకపోవడం, భాషను అర్థం చేసుకోలేకపోవడం, లారింగెక్టొమి-స్వరపేటికలోను శస్త్ర చికిత్సతో తొలగించడం; ఈ సమస్యలున్న దివ్యాంగ బాలలకు పాఠశాలలో యోగా నేర్పుతారు. పిల్లలు కూడా చాలా ఆసక్తిగా చేస్తారు. హైపర్ యాక్టివ్ గా ఉంటే, కొంత సాత్వికతను పొందుతారు. మందంగా ఉన్నవారు చురుకుతనాన్ని పొందుతారు. పిల్లల్లో మానసిక ప్రశాంతత కనిపిస్తుంది. మెల్లగానే కావచ్చు, నిత్య సాధన వల్ల మంచి మార్పులు వస్తాయి. అటువంటి పిల్లలుంటే కుటుంబ సభ్యులకు సంరక్షకులకు ఓపిక, సహనం. కావాలి.
మానసిక వ్యాధిగ్రస్థులు :
వీటిలో చాలా రకాలున్నాయి. బైపోలార్, డిజార్డర్, స్కిజోఫ్రెనియా మొదలైనవి. యోగ సాధన ఓంకార ఉచ్చారణ, శ్వాసను చక్కగా నియంత్రిస్తాయి. గుండె లయను సామాన్య స్థితికి తీసుకువస్తాయి. ఆలోచనల వేగాన్ని నియంత్రిస్తాయి. ఉద్వేగాలనుబట్టి ఆసనాలను, ప్రాణాయామాన్ని వేగంగా లేక నెమ్మదిగా చేయాలి. సూర్యనాడి ద్వారా శ్వాస వల్ల ఉగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. చంద్రనాడి శ్వాస వల్ల ఆలోచనల వేగం తగ్గుతుంది. డీప్ రిలాక్సేషన్ టెక్నిక్, యోగ నిద్ర నుంచి ప్రశాంతతను చేకూరుస్తాయి. ఇవన్నీ భాగ్యనగరం లోని ట్రాంక్విన్ మైండ్స్ కేంద్రంలో ఈ వ్యాసకర్త అనుభవాలు.
మస్కులార్ డిస్ట్రాఫి (కండరాల బలహీనత) :
కొన్ని జన్యువరమైన జబ్బుల కారణంగా కండరాలు బలహీన పడడం, కండరాలు మందం
కోల్పోవడం సంభవిస్తుంది. ఇది కాలక్రమేణా పెరిగే సమస్య, వీరు చాలావరకు చక్రాల కుర్చీకే అతుక్కుని ఉంటారు. వీరికి చక్రాల కుర్చీలోనే కూర్చుని వేసే ఆసనాలు నేర్పించాలి. వీరికి కూడా చాలావరకు ఏదైనా ఆధారం సహాయంతో ఆసనాలు నేర్పించవలసి ఉంటుంది. కింది భొమ్మలను చూడండి ::
గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేయని కండరాలకు పని కల్పించే ప్రయత్నం చేయరాదు. ఎక్కడనుంచైనా నొప్పి మొదలౌతుంటే, దానికి ముందరే అంగాల కదలికను ఆవి వేయాలి. గాలిని పీల్చగలిగినంత వరకూ ప్రాణాయామం చేయాలి. ఇదంతా వైద్యుడి పర్యవేక్షణలో చేయడం మంచిది.
క్రానాక్ న్యూరలాజికల్ కండిషన్స్ :
వీటినే దీర్ఘకాలిక నాడీ సంబంధిత సమస్యలు అనవచ్చును. అల్టమర్స్, డెమెన్షియా, పార్కిన్సన్స్, డైరస్టోనియా, ఏ.ఎల్.ఎస్, హంటింగ్టన్, సాహపీకండర్ వ్యాధులు, మల్టిపుల్ స్లెరోసిస్, ఎపిలెప్పి, రిస్టోక (గుండె లేక మెదడు) లాంటి వ్యాధులు, వైకల్యాలు దీని ఫలితమే. వీటితో బాధపడుతున్న వారికి కుర్చీ బల్ల వంటి ఆధారాలతో తగినంత ఆసన ప్రాణాయామాలు చేయించాలి. నెమ్మదిగా ఫలితాలు కనిపిస్తాయి.
మల్టిపుల్ స్లైరోసిస్ :
దీనిలో వ్యక్తిలోని వ్యాధి నిరోధక వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. ఆ వ్యవస్థలో మెదడు వెన్నుపూస కూడా భాగాలే. దీనివల్ల నరాలు కణజాలాలు దెబ్బతిని వాటి ద్వారా సమాచార సరఫరా సమస్యలు వస్తాయి. కాలక్రమేణా నరాలు దెబ్బతింటాయి. వీటికి కూడా పైన చెప్పుకున్న వైకల్యాలకు చేయించినట్టే యోగా చేయించాలి. ఆధారాల సహాయం కూడా కావాలి.
అస్టిబాధిత వికలాంగులు - (లోకోమోటార్ డిజెబిలిటీస్) :
కచ్చితంగా చెప్పాలంటే ఇది చలన సమస్యలకు సంబంధించిన వైకల్యం. అంటే కాళ్లలో వైకల్యం ఎముకలు, కీళ్లు, కండరాలకు సంబంధించిన వైకల్యాలు కూడా ఇందులోకే వస్తాయి. దీనితో నడకలోనూ, వస్తువులను పట్టుకోవడంలోనూ తీసుకోవడంలోనూ సమస్యలు వస్తాయి. వీరు చక్రాల కుర్చీ (వీల్ చైర్), కాలిపర్- ఊతకర్రలు వంటివి ఉపయోగిస్తారు. వీరికి యోగా ద్వారా ఎముకలకు, కండరాలకు కీళ్లకు ఉపశమనం, బలం, మనశ్శాంతి కలుగ చేయవచ్చును. స్కోలియోసిస్ లాంటి వాటిని సరిదిద్దవచ్చు. స్కోలియోసిస్ అంటే పార్శవగుది శరీరం వంకరలను సరిదిద్దే ప్రయత్నం చేయవచ్చు.
తలస్పీమియా :
తలస్పీమియా జన్యుపరంగా వారసత్వంగా వచ్చిన రక్త రుగ్మత. ఇది తక్కువ లేదా అసాధారణమైన హిమోగ్లోబిన్ ఉత్పత్తి ద్వారా బయటపడుతుంది. హిమోగ్లోబిన్ ఎర్ర రక్తకణాలతో కనిపించే ప్రోటీన్, శరీరంలో ఆక్సిజన్ మోయడానికి హిమోగ్లోబిన్ బాధ్యత వహిస్తుంది. తలస్సీమియా వల్ల పెద్ద నంఖ్యలో ఎర్రరక్త కణాలు నాశనమవుతాయి. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనత వల్ల తలస్సీమియాతో బాధపడుతున్న వ్యక్తి చర్మం పాలిపోయి ఉంటుంది. త్వరగా అలసట వస్తుంది. మూత్రం ముదురు రంగులో ఉంటుంది.
హిమోఫీలియా :
హిమోఫీలియా అంటే రక్తం గడ్డ కట్టకపోవడమనే సమస్య, రక్తంలో గడ్డకట్టే ప్రోటీన్లు లోపించడం వల్ల రక్తస్రావం సామాన్యంగా జరగవలసిన దాని కంటే కూడా ఎక్కువగా జరుగుతుంది. హిమోఫీలియా దాదాపు మగవారిలోనే కనిపిస్తుంది. అది వారి తల్లుల నుండి సంక్రమిస్తుంది.
సింగల్ సెల్ డివైజ్ :
ఇది రక్త రుగ్మతల సమూహం. ఇది ఎర్ర రక్తకణాలు విచ్చిన్నం కావడానికి కారణమౌతుంది. దీనివల్ల ఆర్బీసీల ఆక్సిజన్ మోసే సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది. ఇది జన్యుపరంగా సంక్రమించే వ్యాధి. ఈ మూడురకాల రక్త సంబంధిత వైకల్యాలకు పూర్తి నివారణ మార్గాలు కనుగొనలేదు. వీరికి రక్త మార్పిడి, మజ్జ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఈ సమస్యలున్నవారికి యోగా ద్వారా కండరాల శక్తికి, శ్వాస సంబంధిత ఉపశమనాన్ని ఇవ్వవచ్చు మానసికంగా ఆశాజనకమైన స్థితి యోగా సాధనతో కలుగుతుంది. ఈ నమస్యలున్నవారు పెండ్లికి ముందే జన్యువరీక్షలు చేయించుకోవడం మంచిది. వివాహాలలో మేనరికాలు వద్దు.
బహుళ వైకల్యాలు (మూగ, అంధత్వం సహా) :
ఒకసారి రెండు లేక అంతకంటే ఎక్కువ వైకల్యాలు కలిగి ఉండటం బహుళ వైకల్యం అంటారు. అది వ్యక్తి అవగాహనా శక్తిని ప్రభావితం చేయవచ్చు. వీటిలో చలనం, స్పర్శలకు సంబంధించినవి కూడా ఉండవచ్చు. వీరి పరిస్థితిని బట్టి, వైద్యుల సహాయంతో బల్లలు, కుర్చీలు, బంతులు మొదలైన వాటి సాయంతో యోగ సాధన చేయించాలి.
యాసిడ్ దాడుల బాధితులు :
భగ్న ప్రేమికుడు ప్రేయసిపై యాసిడ్ దాడి చేసాడని ఫత్రికలలో చదువుతూ ఉంటాం. కక్ష సాధింపుతోను, కర్మాగారాలలో అజాగ్రత్తవల్ల కూడా యాసిడ్ దాడికి గురవుతూ ఉంటారు. దీనితో వ్యక్తులు వికారంగా తయారవుతారు. చర్మం, కండరాలు నరాలు కాలిపోతాయి. కర్మేంద్రియరాలు జ్ఞానేంద్రియాలు కోల్పోవచ్చు. ఆ బాధ జీవితాంతం కుంగదీయవచ్చు. వీరి భౌతిక, మానసిక స్థితులను బట్టి యోగ సాధన చేయించాలి.
పార్కిన్ సన్స్ వ్యాధి :
ఇది కేంద్ర నాడీ మండల వ్యవస్థ సమస్య కదలికలను ప్రభావితం చేస్తుంది. శరీరంలో వణుకు కండరాలు పట్టుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి, కాలం గడుస్తున్న కొద్దీ వ్యాధి పెరుగుతుంది, ప్రస్తుతానికి దీనికి వైద్యం లేదు వీరితో ఆసన, ప్రాణాయామం చేయించడం కష్టమే కానీ, సాధన చేస్తే కొంత ఫలితం ఉంటుంది.
ఈ వైకల్యాలతో ఉన్నవారి జీవితాలలో యోగసాధన మంచి మార్పుకు నాంది పలుకుతుంది. వీరితో యోగ సాధన చేయించే కుటుంబ సభ్యులు సామాజిక కార్యకర్తలు, వైద్యులు కూడా చేయాలి. ఎంతో సహనంతో చేయవలసిన సేవ ఇది. మనోబలం, స్టెర్యం ఉండాలి. ఈ అంశం మీద అవగాహన కల్పించడానికి 'సక్షమ్' (వికాలంగుల ఉన్నతి కోసం పనిచేస్తున్న సంస్థ) జాతీయస్థాయిలో కృషిచేస్తోంది.
వ్యాసకర్త : లక్క రాజు కాశీనాథ్ - జాతీయ ఉపాధ్యక్షులు -సక్షమ్
ఈసీ మెంబరు- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకో
మోటార్ డిజెబిలిటీస్, యోగ శిక్షకులు