రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించిన డాక్టర్ హెడ్గెవార్'కి అప్పటికే అనేక రకాల ఉద్యమాలలో, సంస్థలలో ఎంతగానో పనిచేసిన అనుభవముంది. అది అద్వితీయమైన అనుభవమని చెప్పవచ్చు. సంఘకార్యపద్ధతిని వికసింప జేయటంలో ఆ అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. గత అనుభవాల ఆధారంగా ఆయన ఏవిధమైన తొందరపాటు లేకుండా నెమ్మది నెమ్మదిగా అనేకపద్ధతులు క్రమంగా రూపుదిద్దుకొనేవిధంగా ఆయన శ్రద్ధవహించారు.
సంఘం ప్రారంభించేనాటికి - ఈ సంస్థయొక్క కార్యవిధానము, పద్దతి ఇదీ అంటూ ఆయన మార్పుకతీతమైన, లేదా స్థిరమైన ప్రణాళిక ఏదీ వ్రాసి పెట్టలేదు. ఏ సంస్థ నుండో తీసికొనివచ్చిన కార్యపద్ధతిని సంఘంపై రుద్దలేదు. డా॥ హెడ్గేవార్ చాలా ఓపికగా కార్యపద్దతి వికసించేందుకు యత్నిస్తూరావటమేగాక, వివిధ సమయాల్లో అవసరాన్నిబట్టి తగినవిధంగా మార్పులు చేస్తూ వచ్చారు. మరొక సంస్థ నుండి కార్యపద్ధతిని తెచ్చుకొని దానిని అనుసరిస్తూ కొద్దిపాటి మార్పులతో ముందుకు పోదామన్నా, అటువంటి సంస్థ ఏదీ దేశంలో ఎక్కడా లేనేలేదు. మిగిలిన సంస్థలు ప్రారంభమయ్యే పద్ధతికి పూర్తిగా భిన్నమైన తీరులో సంఘం ప్రారంభమైంది.
విషయసూచిక :