Women RSS members earn laurels for service during pandemic |
దేశం కోవిడ్ పోరాడుతున్న ఈ సమయంలో సమాజానికి సేవ చేసినందుకు ఆర్ఎస్ఎస్ పురుషులు విభాగం ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, ఆహారం మరియు ఔషధాలను సరఫరా చేయడం ద్వారా అవసరమైన వారికి ఎనలేని సేవ చేస్తూ దేశ ప్రజల మన్నలలు పొందుతున్నారు.
ఇదే కోవలో మేముసైతం అంటూ "రాష్ట్ర సెవికా సమితికి" చెందిన ఆర్ఎస్ఎస్ మహిళా బృందం కూడా కోవిడ్ సంక్షోభ సమయంలో బలంగా నిలబడినందుకు ప్రశంసలు సంపాదిస్తున్నారు. వైరస్ వల్ల ప్రాణాలను కోల్పోయిన వారి అంతిమ సంస్కారాలు చేయడం, వ్యాక్సినేషన్ పై అవగాహన పెంపొందించడం, యోగా శిబిరాలు నిర్వహించడం అదేవిధంగా అవసరమైన వారికి ఔషధాలను పంపిణీ చేయడం ద్వారా వారు ప్రజలకు సహాయం చేస్తున్నారు.
అంత్యక్రియలకు పండితులు అందుబాటులో లేనిచోట మరణించిన వారిని శ్మశానవాటికకు చేరుస్తూ అన్ని ఆచారాలను నిర్వహించడం ద్వారా ఆర్ఎస్ఎస్ మహిళా సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
- అజ్మీర్ లోని మహిళలుకు పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ చేయించుకోవడంలో సహాయపడ్డారు. ఆర్ఎస్ఎస్ మహిళా సభ్యులు స్థానిక ఆసుపత్రుల నుండి వ్యాక్సినేషన్ కేంద్రాల జాబితాలను సేకరించి వాట్సప్ గ్రూపులో వారి చిరునామాకు నేరుగా చేరుకొని వారికీ వ్యాక్సినేషన్ చేయించారు. ఇలా సుమారు ౬౦౦ (600) మందికి టీకాలు వేయడానికి సహాయపడింది.
- జైపూర్ ప్రరాంట్ ప్రచార్ ప్రముఖ్ గుల్షన్ షెఖావత్ మాట్లాడుతూ జైపూర్, ఉదయ్ పూర్ ఆర్ఎస్ఎస్ మహిళా సభ్యులు నెలకు పైగా ఇక్కడ యోగా శిబిరం నిర్వహించారని తెలిపారు. ప్రయోజనం పొందిన వారిలో కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు, పోస్ట్ కోవిడ్ సంక్లిష్టతలు ఉన్న వ్యక్తులు అదేవిధంగా ఆరోగ్యంగా ఉండటానికి యోగా నేర్చుకోవాలని కోరుకునే వారు ఉన్నారని చెప్పారు.
- సీనియర్ సభ్యులు రోజూ కోవిడ్ సంరక్షణ కేంద్రాలను సందర్శించి హనుమాన్ చాలీసా పఠిస్తూ ప్రజలలో సానుకూలతను తీసుకురావడానికి భజనలు పాడారు.
- సాలంబూర్, రాజ్ సమంద్ లలో సుమారు 2,000 మందికి హోమియోపతి మందులు పంపిణీ చేశారు.
- జోధ్ పూర్ ప్రాంట్ ప్రచారిక, రీతు మాట్లాడుతూ మహిళా సభ్యులు జంతువులు మరియు పక్షులకు కూడా ఆహారాన్ని సేకరించారు.
- భిల్వారాలో ఈ సభ్యులు అవసరమైన కుటుంబాలకు మాస్కులు, ఆక్సిజన్ మొదలైనవాటిని పంపిణీ చేస్తున్నారు.
- కోటాలో, షుగర్ టెస్ట్ స్ట్రిప్ వంటి పదార్థాలను మరియు ఆక్సిజన్ ను ఏర్పాటు చేశారు.
మొత్తం మీద, ఈ మహిళా సభ్యుల సేవల నుండి సుమారు 50,000 మంది ప్రయోజనం పొందాయి.