![]() |
సంస్కార భారతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సంగీత పోటీలు - State level music competitions under the auspices of Sanskara Bharati |
సంస్కార భారతి, ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో “బ్రహ్మ కడిగిన పాదము” పేరుతో రాష్ట్ర స్థాయి సంగీత పోటీలు నిర్వహింపబడుతున్నాయి.
ఈ పోటీలు జూనియర్స్ (12 – 25 సం. వయస్సు వారు), సీనియర్స్ (26 – 40 సం.ల వయస్సు వారు) రెండు విభాగాలుగా జరుగనున్నాయి. పోటీలలో పాల్గొనదలచిన వారు ఒకే ఒక అన్నమాచార్య కీర్తనను పాడి, రికార్డు చేసి, ఆ ఆడియోను ఆయా జిల్లాల వారీగా క్రింది పోస్టర్లో ఇచ్చిన ఫోన్ నెంబర్లకు పంపవలసిందిగా నిర్వాహకులు తెలియజేశారు. పోటీకి పంపే కీర్తన నిడివి 5 నిమిషాలకు మించరాదనే నియమం ఉంది. ఆడియోను జూన్ 15, మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా పంపాలి.
జూన్ 27, ఆదివారము సాయంత్రం ఏడు గంటలకు ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లైవ్ ద్వారా విజేతల ప్రకటన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు క్రింది పోస్టర్ ను చూడగలరు.
![]() |
సంస్కార భారతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సంగీత పోటీలు ! |
Sanskar Bharati, Andhra Pradesh is organizing state level music competitions in the name “Brahma Kadigina Padamu”.
The competition will be held in two categories, Juniors (12 – 25 years old) and Seniors (26 – 40 years old). The organizers said that those who wanted to participate in the competition should sing and record a single Annamacharya keerthana and send the audio to the phone numbers given districtwise in the following poster. There is a rule that the length of the song sent to the competition should not exceed 5 minutes. Audio must be submitted by 5pm on Tuesday, June 15th.
Organizers said there will be a winners announcement via Facebook and YouTube Live on Sunday, June 27 at 7 p.m. See the poster below for more details.
__విశ్వ సంవాద కేంద్రము