ఆర్ఎస్ఎస్ సమావేశాలు |
: బైఠకుల మహత్వం :
సంఘంలో జరిగే బైరకులకు (సమావేశాలకు) ఎంతో మహత్వం ఉంది. ఏదైనా విషయాన్ని గట్టిగా గొంతుచించుకొంటూనో, ఆవేశపూరితంగానో చెప్పటంవల్ల అది వెంటనే అందరికీ అవగతమై పోతుందనిగాని, చెప్పిన విషయం అందరికీ అంగీకారమైందనిగాని అనుకోవటం తగదు. ఒక సమావేశంలో యాభైమంది ఉపవిష్ణులై ఉండగా, ఒకానొక విషయాన్ని ప్రస్తావించిన పిదప, బెదురులేకుండా మాట్లాడే ఒక వ్యక్తిని ప్రశ్నించినపుడు ఆవ్యక్తి అక్కడ ప్రస్తావించిన విషయానికి సమ్మతి ప్రకటించినట్లయితే, మొత్తం వాతావరణం ఎంతో ఉత్సాహవర్థకమవుతుంది. ఇటువంటి విషయాలలో డాక్టర్జీ కుశలురు. సమావేశంలో ఉన్నవారి స్థితిని గ్రహించుకొని వారు ఏ తీరున విషయాన్ని ప్రస్తావించే వారంటే-అందరూ దానికి సమ్మతి ప్రకటించవలసిందే.
సమావేశంలో ఉన్నవారు తల ఊపటం మాత్రమే కాదు కావలసింది, ఏ విధమైన బెదురులేకుండా మాట్లాడేస్వభావం గల వ్యక్తిని డాక్టర్జీ మొదటగా ప్రశ్నించేవారు. 'ఈ పని మనం ఎప్పుడో చేసి ఉండవలసింది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇది తప్పక చేయవలసిందే' అన్న తీరున జవాబు వచ్చేది. కార్యకర్తలందరూ డాక్టర్టీకి సుపరిచితులే అయినందున ఎవరు ఎటువంటివారో ఆయన బాగా తెలిసి ఉన్న కారణాన ఎవరిని ఎటువంటి ప్రశ్న అడగాలో అటువంటి ప్రశ్నను అడిగేవారు. ఎప్పుడైతే ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరు ముగ్గురు తప్పకుండా చేద్దాం అంటూ స్పందించేవారో, దాని ఆధారంగా ఉత్సాహపూర్ణ వాతావరణం అల్లుకునేది. కొదిగా భయస్థులు, బలహీన మనస్కులు అయిన వారు కూడా ఆ వాతావరణ ప్రభావంలో ఉత్సాహాన్నే ప్రదర్శించేవారు. పదిమంది ధైర్యవంతులమధ్య నిలబడిన నలుగురు బలహీన మనస్కులు ఎంతో ధైర్యం తెచ్చుకొని వ్యవహరిస్తారన్నది మనోవైజ్ఞానిక శాస్త్రం చెప్పే సూత్రం. అలా ధైర్యాన్ని కూడదీసుకున్న వారే ఉత్తరోత్తరా చాలా పెద్ద పెద్ద కార్యాలను నిర్వర్తించారు. సంఘంలో ఈనాడు పెద్ద సంఖ్యలో నిలబడి ఉన్నవారి వెనుక ఉన్న నేపథ్యం ఇటువంటిదే