: కొరోనా వైరస్ సృష్టికర్తలు :
బయటపడుతున్న ఆశ్చర్యకరమైన నిజాలు!
ఇది మన చావు బ్రతుకులతో ముడిపడివున్న ఒక సమస్యపై వ్రాస్తున్న వ్యాసం , ప్రపంచం లో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన ఒక విపత్తుపై వ్రాస్తున్న వ్యాసం.
ఈ వ్యాసం వ్రాస్తున్న ఈ సమయానికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3,566,563. అమెరికా లో మరణాల సంఖ్య 609,767. భారత్ లో ఈ సంఖ్య 3,31,909. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 171,530,360. ఇంతమందిని పొట్టనపెట్టుకొన్న ఈ కోవిడ్ మహమ్మారి ప్రకృతి లో సహజంగా వచ్చినది కాదు , ఇద్దరు వ్యక్తులు ఒక చైనా ప్రయోగశాలలో సృష్టించిన [man made] మహా ప్రళయం. ఆ ఇద్దరు వ్యక్తుల పాపిష్టి ముఖాలను క్రింద ఫోటోలో చూడవచ్చు. ఆమె పేరు Shi Zhangli [ షీ జంగ్ లీ - చైనా ] , అతని పేరు Peter Daszak [ పీటర్ దస్జాక్ - అమెరికా ]
Shi Zhangli [ షీ జంగ్ లీ - చైనా ] , అతని పేరు Peter Daszak [ పీటర్ దస్జాక్ - అమెరికా ] |
ఈ కోవిడ్ వైరస్ ను మొదట నవంబరు - 2019 లో గుర్తించినపుడు ఇది చైనా లోని Wet Market లో జంతువుల ద్వారా వచ్చిందని అన్నారు. (బ్రతికివున్న మూగ జంతువులను , పాములు , గబ్బిలాలు , కప్పలు మొదలగు ప్రాణులను , అప్పటికప్పుడు చంపి అమ్మే దుర్మార్గపు మార్కెట్లను wet markets అంటారు. ఇలా చేసే నీచ నికృష్ట దేశం ప్రపంచంలో చైనా ఒక్కటే అని అంటారు) ఈ వైరస్ 2002 లో వచ్చిన SARS లాంటిది అని దీనికి SARS-2 అని పేరు పెట్టారు. తరువాత WHO వాళ్ళు Novel Corona Virus అని అన్నారు , చివరికి CO అంటే Corona అని , VI అంటే virus అని , D అంటే Disease అని చెప్పి , వచ్చిన ఏడాది 2019 కాబట్టి COVID - 19 అని నిర్ధారించారు.
షి జంగ్ లీ అనే ఆవిడ [ పైన ఫోటో లో చూడవచ్చు] చైనా లోని WIV [ Wuhan Institute of Virology ] లో శాస్త్రవేత్త , పరిశోధకురాలు. ఆమె గబ్బిలాల [Bats] మీద విశేషంగా రీసెర్చి చేస్తుంటారు. అందుకే ఆమెను Bat Lady అని పిలుస్తుంటారు. ఈ వైరస్ గబ్బిలాల వల్ల వచ్చిందని అని మొదట్లో తప్పుడు ప్రచారం చేసారు. మనుషులు చేసిన ఘోరమైన పాపాన్ని , పాపం గబ్బిలాల మీదకు తోసారు. ఈ జంగ్ లీ , అలాగే ఇతర శాస్త్రవేత్తలు ప్రచారం చేసినట్టు ఈ వైరస్ ఊహాన్ లో గబ్బిలాల ద్వారా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఊహాన్ లో గబ్బిలాలు లేవు. అవి వుండేది దక్షిణ చైనాలోని Yunnan ప్రాంతంలో. మన మనసులో ఒక ప్రశ్న పుట్టవచ్చు - Yunnan నుండి Wuhan కు గబ్బిలాలు రావచ్చు కదా ? అని. రావు ఎందుకంటే రాలేవు ! ఎందుకు ? యున్నాన్ కు ఊహాన్ కు మధ్య దూరం 1500 కి.మీ. గబ్బిలాలు 50 కి.మీ. కంటే ఎక్కువ దూరం ఎగరవు అని వాటిని అధ్యయనం చేసిన సైంటిస్టులు చెపుతున్నారు. మరి అవి ఊహాన్ కు ఎలా వచ్చాయి ? అంటే , వాటిని తెచ్చారు. ఎవరు ? ఇంకెవరు ఈ Bat lady నే.
Ralph S Baric |
ఎపుడు తెచ్చిందో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. 2015 లో యున్నాన్ గుహలలోంచి వాటిని జంగ్ లీ ఊహాన్ కు తెచ్చింది. ఎన్ని తెచ్చింది ? 100 గబ్బిలాలు తెచ్చింది. 2015 కు ముందు , ఆ తరువాత ఆమె యున్నాన్ గుహలకు అనేకమార్లు వెళ్ళిందని అఫిషియల్ రికార్డులు చూపిస్తున్నాయి. గబ్బిలాలు తెచ్చి ఏమి చేసింది ? అమెరికా లో North Carolina రాష్ట్రంలోని North Carolina State University లో శాస్త్రవేత్త అయిన Ralph S Baric ను సంప్రదించింది. ఆయన ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్టుల్లో ముఖ్యుడు. గబ్బిలాల లోకి , మనుషులు , ఇతర ప్రాణుల శరీరాల్లోకి ప్రవేశించే వైరస్ ను ఎలా జొప్పించాలి అనే విషయంలో ఈ జంగ్ లీ కి ఆయన పాఠాలు చెప్పాడు.
ఎలా ప్రవేశ పెడతారు ? అనే ప్రశ్నకు చాలా వివరంగా చెప్పాల్సివుంటుంది. దాన్ని చిన్నగా టెక్నికల్ భాషలో చెపుతాను : SARS -1 సూక్ష్మజీవి లోని spike protein ను తొలగించి దాని స్థానంలో గబ్బిలాలలోవుండే ఒక కణాన్ని ప్రవేశపెడతారు. ఇది మానవ శరీరంలోని సూక్ష్మ కణజాలాన్ని త్వరగా , వేగంగా infect చేస్తుంది.
ఇంత ప్రమాదకరమైన పనిని ఎందుకు చేసారు ? ఈ ప్రశ్నకు జంగ్ లీ , WIV lab వాళ్ళు తెలివైన జవాబు ఇచ్చారు. SARS-1 మహమ్మారి ఇంకోసారి భవిష్యత్తులో మరికొన్ని వ్యాధులకు దారి తీయకుండా వుండేందుకు , ఆ వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయో తెలుసుకొనేందుకు ఈ ప్రయోగాలు చేసాము అని వారు అన్నారు. ఈ అంశాన్ని వైరాలజీ లో Gain of Function అంటారు. ఇది వింటే వాళ్ళ పని తప్పు అనిపించదు కదా ?
కాదు. ఈ ప్రయోగాలు వారు చెపుతున్నట్టు '' ముందుముందు వచ్చే వ్యాధులకు సంబంధించింది '' కాదు. మరేమిటి ? ఇది ప్రపంచం మీదకు దుష్ట చైనా ఎక్కుపెట్టిన విషపు బాణం. ఎలానో వ్యాసం చివరన చూద్దాం. మరి వ్యాసం మొదట్లో చెప్పిన Peter Daszak ఎవరు ? ఈ వ్యక్తి అమెరికాకు చెందిన వైరాలజిస్టు. అమెరికా పొలిటీషియన్ల దగ్గర పరపతి ఎక్కువ వున్న వాడు. ఈ మొత్తం ' పరిశోధనలకు ' అవసరమయ్యే లక్షలకొద్దీ డాలర్ల కాంట్రాక్టును ఈ పీటర్ దక్కించుకొన్నాడు. దాన్ని జంగ్ లీ కి సబ్ కాంట్రాక్ట్ చేసాడు. అత్యంత ఎక్కువ ఇన్ ఫెక్టివిటి వున్న కొరోనా వైరస్ ను ల్యాబ్ లో సృష్టించే ప్రయత్నంలో లీ కి అండ దండ ఈయనే ! డిశెంబరు 9 , 2019 న ఇచ్చిన ఇంటర్వ్యూ లో '' ఈ వైరస్ కు వ్యతిరేకంగా వ్యాక్సినేట్ చేయలేం , ఇది untreatable వైరస్ '' అని వెన్నులో వణుకు పుట్టించే సంగతులు బయటపెట్టాడు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా తో చాలా సన్నిహితంగా వుండేవాడు. 2005 నుండి 2019 వరకూ US National Institute of Health కు నిరాటంకంగా నిధులు అందాయి. 2009 నుండీ 2017 వరకూ [ అంటే ఒబామా ప్రెసిడెంట్ గా వున్న సమయం ] ఈ నిధులు మరింత ఎక్కువగా అందాయి. ఈ సంస్థ నుండి జంగ్ లీ కి నిధులు అందేలాగా పీటర్ సహకరించాడు. తెలిసో , తెలియకో ఒబామా కూడా ఈ పాపం లో భాగం అయ్యాడు ! ఆయనకు చైనా పట్ల వున్న ప్రేమ ఎంత పని చేసింది !
కొరోన వైరస్ మొదలయ్యింది ఊహాన్ [ చైనా ] కదా , దీన్ని చైనీస్ వైరస్ , వూహాన్ వైరస్ అనకుండా WHO రాజ్యాంగం లో వున్న ఒక క్లాజ్ ను జంగ్ లీ , మరియు చైనా ప్రభుత్వం తెలివిగా వాడుకొన్నాయి. అదేమంటే '' ఏదైనా ఒక ప్రాంతంలో మొదలైన వైరస్ ను ఆ ప్రాంతం / దేశం పేరుతో గుర్తించడం , పిలవడం ఆ ప్రాంత / దేశ ప్రజలను అవమానించినట్టు అవుతుంది '' అనే ఈ క్లాజును చూపి WHO ఈ వైరస్ ను కోవిడ్ -19 గా పిలిచేలా చైనా ' మ్యానేజ్ ' చేసింది.అంతేకాదు , ఈ పాపిష్టి పనిలో చైనా తప్పు ఏమీ లేదు అని ప్రపంచాన్ని నమ్మించేందుకు చైనా ప్రపంచ ప్రఖ్యాత దినపత్రికలు , చానెళ్ళకు రచయితలకు పెద్దమొత్తంలో డబ్బులు కుమ్మరించింది. భారత్ లో కూడా సుమారుగా 60 మందికి ఈ డబ్బులు అందినట్టు సమాచారం.
ప్రపంచ వ్యాప్తంగా ఇలా డబ్బులు అందుకొన్న వాళ్ళ పని ఏమంటే వాళ్ళ వాళ్ళ దేశాల ప్రభుత్వాలు కోవిడ్ ను నియంత్రించడంలో విఫలమయ్యాయని , వున్నవి , లేనివి అన్నీ కలిపి అర్ధ సత్యాలు , అసత్యాలను పేపర్లు , చానెళ్ళ ద్వారా ప్రచారం చేయడం. [ భారత్ లో అరుంధతీ , రాణా అయూ, బర్ఖా లాంటి దేశ వ్యతిరేక , లెఫ్టిస్టు రచయితలు ఈ వర్గం కిందకు వస్తారు.] మన దేశంలో కోవిడ్ తో మరణించిన వారి శవాలను సామూహికంగా దహనం చేస్తున్న దృశ్యాలను ఈ వర్గం జర్నలిస్టులు ఫొటోలు తీసి ఒక్కో ఫోటోను 80 వేలు , ఒక లక్ష రూపాయలకు విదేశీ [ ప్రత్యేకించి అమెరికా , ఇంగ్లాండ్ కు] పత్రికలు , చానెళ్ళకు అమ్మిన విషయం మనలో ఎంతమందికి తెలుసు ? మనకేం తెలుసు అంటే ఇంత పెద్ద దేశంలో , ఇంతటి భయంకర మహమ్మారిని , అడుగడుగునా విమర్శలు గుప్పిస్తూ , అడ్డుపడుతున్న ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వాలు సమస్యను హాండిల్ చేయడంలో జరిగిన ఒకటి రెండు తప్పులను భూతద్దంలో చూపించడం మాత్రం మనకు తెలుసు ! నేను గమనిస్తున్నాను , చాలా మంది నిష్పక్షపాతంగా , నిజాయితీగా , లోతుగా అధ్యయనం చేసి కాకుండా ' పాపులర్ ' కావాలని సోషియల్ మీడియా లో కనిపించాలనే కోరికతో మాట్లాడుతున్నట్టు , వ్రాస్తున్నట్టు వుంది. [ అందరూ కాదు , చాలామంది]
మళ్ళీ వ్యాసం లోకొద్దాం..
తాను దక్కించుకొన్న కాంట్రాక్ట్ ను జంగ్ లీ కి సబ్ కాంట్రాక్ట్ చేసినది ఎవరు ? పీటర్ దస్జాక్. జంగ్ లీ ని తెగ మెచ్చుకొన్నది ఎవరు ? పీటర్ దస్జాక్. ఊహాన్ లోని ల్యాబ్ నుండీ ఈ వైరస్ బయటికిపంపబడిందా , లేదా అని నిర్ధారించేందుకు WHO ఏర్పాటు నియమించిన కమిటీ లో ముఖ్యమైన సభ్యుడు ఎవరు ? పీటర్ దస్జాక్.
ప్రాణాంతకమైన ఈ వైరస్ ను సృష్టించింది తామే అని ప్రపంచానికి తెలిసింది కాబట్టి , ఇబ్బందులొస్తాయని ఊహించి చైనా ఊహాన్ లోని జంగ్ లీ ల్యాబ్ లను సీల్ చేసాము అని చెప్పుకొంటోంది. కానీ ఇప్పటికే ఆమె వైరస్ ను సృష్టించడంలో విజయం సాధించింది కదా ! ఇక ల్యాబ్ ను మూస్తే ఏమిటి ? మూయకపోతే ఏమిటి ?
ఇపుడు అసలు విషయం. ఇదంతా చైనా ఎందుకు చేసింది ? కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం యొక్క సైన్యం పేరు People's Liberation Army [ PLA ] 2015 నుండీ ఈ PLA ఊహాన్లోని WIV తోకలిసి రహస్యంగా పనిచేస్తున్నదట. వీళ్ళ లక్ష్యం Bio weapons ను తయారుచేసుకోవడం. దేనికి ? మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే లాగా పరిస్థితులు కల్పించి , ఆ యుద్ధమే వస్తే అందులో తాము గెలిచి మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో వుంచుకోవాలని కామ్రేడ్ల సామ్రాజ్యవాద రాక్షస కాంక్ష. ఎవరి చేత , ఎలా , ఎందుకు కొరోనా వైరస్ సృస్టించబడిందో తెలిసింది కదా !
References:
గమనిక - ఇదంతా [ చివరి పేరా కాకుండా ] నీవు చూసినట్టు వ్రాసావే అనేవాళ్ళు కూడా వుంటారు. అలా ఏమీ లేదండి. Nature , Science , The NewYork Times లాంటి ప్రఖ్యాత పత్రికలకు ఎడిటర్ గా , Science Correspondent గా అనేక ఏళ్ళు పనిచేసిన Nicholas Wade అనే రచయిత May 5 , 2021 న Bulletin of Atomic Scientists అనే పత్రికలో The Origin of COVID - Did People or Nature open Pandora's Box at Wuhan ? అనే అద్భుతమైన investigative వ్యాసం లోని అంశాలను ఈ వ్యాసానికి ఆధారం చేసుకొనబడింది.