వందనము |
: ప్రతిరోజు స్త్రీలు గమనించవలసినది :
- ప్రొద్దున లేచిన వెంటనే ఇంటిముందు చిమ్మి కసువు తీసి నీళ్ళుచలి ముగ్గువేయాలి.
- ప్రతినిత్యమూ కసువును (చెత్త) రెండుసార్లు ఊద్చాలి (చిమ్మాలి). చీపుళ్ళు కనపడకుండా చాటుగా దాచి ఉంచాలి.
- రోజూ కనీసం రెండుపూటలు (ఉదయం, సాయంత్రం) దేవుని ఎదుట దీపారాధన చేయాలి.
- వంటగదిలోకి వెళ్ళేముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి.
- కొందరు స్నానము చేసే లోపలికి వెళతారు. అది మరీ మంచిది.
- ఎప్పుడైనా కూర్చునే భోజనం చేయాలి.
- పురుషులు తమంతతామే వడ్డించుకోకూడదు. ఇంకెవరైనా వడ్డించాలి. తిన్నపాత్రలను వెంటనే కడగడం నేర్చుకోవాలి.
- ఇంటికి ఇతర స్త్రీలు వచ్చి వెళ్ళేటప్పుడు బొట్టుపెట్టి పంపించే అలవాటు చేసుకోవాలి.
- ఇంట్లో ఏదైనా విశేషంగా పదార్ధాలు వండినపుడు సమీపములోనున్న రెండుమూడు ఇండ్లకు వెళ్ళి పంచిపెట్టే అలవాటు చేసుకోవాలి.
- రోజూ లలితా సహస్రనామము లాంటివి పారాయణ (చదవడం) చేయడం బాగుంటుంది.
- పండుగలందు భక్ష్యములను (పదార్థములను) ఇంట్లోనే తయారుచేయాలి. బయటి నుండి కొనుగోలుచేసి తీసుకురాకూడదు.
- ఆడపిల్లలు తమ జడలను కాపాడుకోవాలి కదా! ఆలోచించండి.
కుటుంబానికి కరదీపికలో తరువాతి అంశం చదవండి → " చేయకూడని పనులు "