ఉత్తరప్రదేశ్ కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పోలీసులు మూకుమ్మడి మతమార్పిడులకు పాల్పడుతున్న ముఠా గుట్టును శుక్రవారం రట్టు చేశారు. మతమార్పిడుల సూత్రధారులు ముఫ్తీ ఖాజీ జహంగీర్ ఆలం, మొహమ్మద్ ఒమర్ గౌతమ్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా 1000 మందికి పైగా యువకులను మతం మార్చారని విచారణలో తేలింది.
ఉత్తర ప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ….. ” ఉత్తరప్రదేశ్ ATS పోలీసులు మూకుమ్మడి మతమార్పిడుల సూత్రధారులైన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. కొందరికి డబ్బులు ఇస్తామని, మరికొందరికి ఉద్యోగాలిస్తామని, ఇంకొందరికి వివాహాలు జరిపిస్తామని ఆశ చూపి అనేకమంది పేద యువకులను వారు మతం మార్చారు. వీరికి ఐ ఎస్ ఐ తో సహా మరికొన్ని ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు అందినట్లుగా కూడా సమాచారం. అరెస్టయిన నిందితులిద్దరూ ఢిల్లీలోని జామియా నగర్ కు చెందిన వారు. జామియా నగర్లో తాము నిర్వహిస్తున్న ఇస్లామిక్ దవా సెంటర్ నుంచి వారు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
నోయిడా కేంద్రంగా నడిచే నోయిడా చెవిటి వాళ్ళ సంఘం (Noida deaf society) ఈ మత మార్పిడి ముఠా కేంద్రం. పేద విద్యార్థులకు డబ్బు ఆశ చూపి, ఉద్యోగాలలిస్తామని, అందమైన యువతులతో వివాహం జరిపిస్తామని చెప్పి మతం మారుస్తున్నారు.
తన కుమారుడు, నోయిడా డెఫ్ సొసైటీ విద్యార్థి అయిన మన్నును మతం మార్చడమే కాకుండా కుటుంబ సభ్యులకు చంపాల్సిందిగా అతడిని వత్తిడి చేస్తున్నారని మన్ను తండ్రి రాజు యాదవ్ ఫిర్యాదు చేశారు. మరో విద్యార్థి ఆదిత్య గుప్తా తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల దర్యాప్తులో అవి నిజమని తేలింది కూడా.” అని తెలిపారు.
” మేం మా అబ్బాయి ప్రవర్తనలో మార్పును గమనించాం. అయితే ఏం జరుగుతుందన్న విషయాన్ని మేం గ్రహించలేకపోయాం. పోలీసులకు ఫిర్యాదు చేసిన మీదట అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆరంభంలో మాకు ఎవరు సహకరించలేదు. ప్రస్తుతం మా అబ్బాయి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నాం.” అని రాజీవ్ యాదవ్ మా ప్రతినిధితో చెప్పారు.
Source : Organiser. - విశ్వ సంవాద కేంద్రము