ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక నేరం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ట్వీట్లను తొలగించకపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ట్విట్టర్ పై చర్యలు ప్రారంభించిందని టైమ్స్ నౌ నివేదించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
వివరాల్లోకి వెళితే.. " జై శ్రీరామ్ " అని జపించడానికి నిరాకరించినందుకు తమని కొట్టారని నటిస్తూ కొందరు వ్యక్తులు మతపరమైన రంగుపులుముతు సోషల్ మీడియా లో ఓక వీడియోని పోస్టుచేశారు. మతవిద్వేషాలు రెచ్చగొడుతూ చేసిన ఈ మీడియాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహించిన యోగి సర్కార్ ట్విట్టర్ పై కేసు నమోదు చేసింది. దీనికి కారణమైన మరో ౮ (8) మందిపై కూడా కేసు నమోదైంది.
కేసు నమోదైన వార్త తెలుసుకున్న ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ ఈ విషయానికి సంబంధించి తాను పోస్ట్ చేసిన వీడియోలను తొలగించినట్లు ప్రకటించారు.
I've deleted the videos that I had posted. The victim's version of him being forced to chant "Jai Shri Ram" at this point in time do not seem to add up based on my conversations with police authorities and other journalists reporting on this issue. https://t.co/cof5bjv3I4
— Mohammed Zubair (@zoo_bear) June 15, 2021
ఘజియాబాద్ పోలీసులు, ఈ విషయంపై దర్యాప్తు చేసిన తరువాత, మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించే ఉద్దేశ్యంతో వ్యాప్తి చెందిన కాల్పనిక కథనాన్ని సామాజిక వేదికల నుంచి తొలగించారు.
ఘజియాబాద్ పోలీసులుకు 'బాధితుడు' అబ్దుల్ సమద్ సైఫీ తెలిపిన వివరప్రకారం తనకు తెలిసిన వ్యక్తులు కొట్టారని, వారిలో ఒకరి కోసం తాను సిద్ధం చేసిన క్షుద్ర తాయెత్తు వారికి పనిచేయలేదని అందుకే వారు కొట్టారని చెప్పాడు. ఈ వీడియో నాటకమాడిన నిందితుల్లో ఇప్పటివరకు పర్వేష్ గుజ్జర్, ఆదిల్ మరియు కల్లులను సోమవారం అరెస్టు చేశారు.
ఈ విషయమై విద్వేషపూరిత కథనాన్ని ప్రచారం చేసిన ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్ తో పాటు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా నకిలీ వార్తలను వ్యాప్తి చేయడంలో ముందున్నారని, రాష్ట్ర ప్రజలను అవమానించడమే పనిగా వీరు ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని యుపి సీఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.
झूठे वीडियो को लेकर Twitter पर FIR दर्ज, अब भारतीय कानूनों के तहत होगी हर कार्रवाई #Twitter #ViralVideo #UPPolice pic.twitter.com/B9kZV8ghCL
— India TV Hindi (@IndiaTVHindi) June 16, 2021
Source: Opindia