స్వయం సేవకులు |
సంఘటనయొక్క అస్తిత్వము మహత్వము :
ఈ రకమైన వైఖరిని అవలంబించటంద్వారా సంఘం తన అస్తిత్వాన్ని కాపాడుకోవటం పట్లనే శ్రద్ధ వహిస్తున్నదని కొందరు అంటారు. బయటివాళ్ళు ఇలాంటి అర్ధాలు తీసినా దానిని పట్టించుకోవలసిన అవసరంలేదు. ఒకవేళ సంఘస్వయంసేవకులుకూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటే అది చింతించదగిన విషయమౌతుంది. సంఘం తన అస్తిత్వాన్ని (మనుగడను) కాపాడుకోవాలని ఆలోచించటం ఎందుకు? సంఘ ఆస్తిత్వం ఒక మహత్వం కల్గిన విషయంకాబట్టే. మన అస్తిత్వంకాపాడుకోవాలన్న ఆలోచనవెనుక మన చర్మం కందకుండా రక్షించుకోవాలన్న ఆలోచనలేదు. సంస్థయొక్క అస్తిత్వమే ముగిసిపోయేటట్లయితే దానిద్వారా నిర్మాణమవుతున్న అనేక విషయాలు ముూతబడిపోయినట్లేకదా! కాబట్టి అస్తిత్వాన్ని నిలబెట్టుకొంటూనే పనిచేస్తుంటామనే విధానం సరియైనదే.
అస్తిత్వాన్ని ఎంత ప్రభావవంతంగా నిలుపుకోగల్గుతామో అంతగా సమాజానికి మేలు కల్గుతుంది. సంఘం ఏ లక్ష్యాన్ని తనముందు ఉంచుకున్నదో, దానిని సాధించడానికి నిరంతర ప్రయత్నం జరుగవలసిఉంది. తాత్కాలికమైన సమస్యలను ఎదుర్కొనడానికి దేనికి ఎంతశక్తి కేటాయించాలి అనే విషయమై యోగ్యమైన రీతిలో ఆలోచించాలన్నది ఈ దృష్టితోనే. ఏదో ఒక సమస్యలో పూర్తిశక్తి పణంగా పెట్టి పోరాడుదాం, జరిగేదేదో జరుగుతుంది. ఆ ఫలితాన్ని ఎలా ఎదుర్కోవాలో అప్పుడు ఆలోచిద్దాం అని అనుకోవటం సరైన విధానం కాదు. చిన్న చిన్న సమస్యలనుకూడా అతిగా ఊహించుకొని భయాన్ని పెంచుకొని, ఇప్పటికిప్పుడే తలపడాలనుకోవటం సరికాదు.
ఈ విషయంలో నెపోలియన్ జీవితంలోని ఒక ఉదాహరణ చక్కగా ఉపయోగపడుతుంది. అతడు ఎల్లప్పుడూ ఒక పెద్ద రిజర్వ్ ఫోర్స్ ను తన దగ్గర ఉంచుకొనేవాడు. దానికి సాధారణంగా పని ఉండేదేకాదు. లేదా పనంతా అయిపోయిందన్న చివరిక్షణంలో మాత్రమే దానిని రంగంలో దించుతూ ఉండటం జరిగేది. ఒకసారి ఒక పోరాటం జరుగుతూ ఉన్న సమయంలో ఈ రిజర్వ్ ఫోర్స్ ఒక ఎత్తైన ప్రదేశంలో నిలిచి ఉంది. నెపోలియన్ కూడా అక్కడే ఉండి జరుగుతున్న పోరాటాన్ని గమనిస్తున్నాడు. ఆ సైన్యంలో ఉన్న సిపాయిలు జరుగుతున్న యుద్ధాన్ని చూస్తూ మాకూ ఒక అవకాశం ఇవ్వండంటూ మారాం చేస్తున్నారు. ఆ దళానికి చెందిన ఒక అధికారి ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయినాడంటే- ఎక్కువ ఆలోచించకుండానే, అతని నోటినుండి 'ఆన్ వర్డ్-ఆన్వర్డ్' అంటూ ఆదేశం బయటకు వచ్చేసింది. అప్పుడు అక్కడే ఉన్న నెపోలియన్ తన చేతిలో ఉన్న కత్తిపిడితో ఆ అధికారిని గట్టిగా కొట్టి 'నేనిక్కడ ఉండగా, సైన్యానికి ఆదేశం ఇవ్వడానికి నీవెవడవు? నేను చాలా యుద్ధాలు చేసిగెలిచాను. ఎప్పుడు, ఎక్కడ, ఎంతశక్తిని వినియోగించాలో నాకు తెలుసు' అని హెచ్చరించాడు.
ఎప్పుడు ఆ సంరక్షిత సైనికదళాన్ని వినియోగించటం అవసరమో, అప్పుడే నెపోలియన్ వారిని పోరాటంలోకి దించాడు అవలీలగా గెలుపుసాధించాడు. ఉదయంనుండి యుద్ధం చూస్తున్న ఆ దళంలోని సైనికులు కనీసం పదిసార్లయినా- ఇక మనం యుద్ధంలోకి దిగాల్సిన సమయం వచ్చేసింది అని అనుకొని ఉంటారు.
ఇదేవిధంగా దైనందిన కార్యకలాపాలలో పాల్గొంటున్నవారికి-సమస్యలు తమ ఎదుట కనిపించుతూ ఉంటే, సంఘశక్తిని వినియోగించి అమీ తుమీ తేల్చేసుకోవాలనుకుంటారు. సమస్యలు ఉధృతమయినప్పుడు ఈ రకమైన ఆలోచనలు మరింతగా ఎక్కువవుతాయి. ఆ సమస్యలోకి సంఘం చొరబడకుండా ఉండిపోతుంటే, వీరి మనస్సులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటవి. సంస్థాగత ప్రేమ ఎక్కువైపోయి, మనం సంస్థను సురక్షితంగా ఉంచుకొనడానికి
ఆరాటపడుతున్నామనో, వివిధరకాల సమస్యలగురించి మనం ఆలోచించటమే లేదనో, సంఘు లక్ష్యం ఎప్పటికి పూర్తవుతుందో ఆ భగవానుడికే తెలియాలి హిందూ సమాజం ఛిన్నాభిన్నమైపోతూ ఉంటే, మనం ఏమీ చేయకుండా నిర్ణష్తంగా ఉంటే ఎప్పటికైనా సంఘలక్ష్యం ఏ విధంగా నెరవేరుతుంది....
ఇలా అనేక రకాల ఆలోచనలు ముసురుతూ ఉంటాయి. ఇలా విభిన్నదృష్టికోణాలలో సంఘకార్యాన్ని గురించి ఆలోచించేవారు విమర్శించేవారు డాక్టర్టీకాలంలోనూ ఉండేవారు. నేడున్నూ ఉన్నారు. నాగపూర్ లో 'డాక్టరీ కాలంనాటి సంఘం వేఱు, ఈనాటి సంఘం వేఱు' అనేవాళ్ళకూడా కొందరు కనిపించుతారు.