రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నూతన సర్ కార్యవాహగా దత్తాత్రేయ హెూసబళే |
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నూతన సర్ కార్యవాహగా దత్తాత్రేయ హెూసబళే ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటి వరకు సహ సర్ కార్యవాహ బాధ్యతలు నిర్వర్తించారు. మార్చి తేదీలలో బెంగుళూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ సమావేశాలలో ఈ ఎన్నిక జరిగింది. దత్తాత్రేయ హెూసబళే స్వగ్రామం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సోరబా తాలూకాకు చెందిన హెూసాబలే.
1954 డిసెంబర్ 1న జన్మించారు. ఆయన 1968లో ఆర్ఎస్ఎస్ అనంతరం 1972లో ఎ.బి.వి.పి.లో చేరారు. 1978 నుంచి ఎబివిపి పూర్తి సమయ కార్యకర్తగా పనిచేశారు. ముంబై కేంద్రంగా 15 సంవత్సరాలు ఎబివిపి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అత్యవసర పరిస్థితిలో అంతర్గత
భద్రతా చట్టం (మిసా) కింద ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించారు. కన్నడ మాసపత్రిక అసీమా వ్యవస్థాపక సంపాదకులు. 2004లో ఆర్ఎస్ఎస్ సహబౌద్దిక్ ప్రముఖ్గా బాధ్యతలు చేపట్టారు. కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, సంస్కృత భాషలలో నిష్ణాతులు.
వైశ్విక ఏకత్వానికి ఫుట్ బాల్ క్రీడ ఒక గుర్తు అని హెూసబళే చెపుతుంటారు. ఈ ఆటకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖండాల్లోనూ దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఇది చాలా ప్రాచీనమైన ఆట కూడా. ప్రాచీన భారత్ నుంచి, గ్రీస్ మొదలైన దేశాల్లో ఈ క్రీడను ఎంతగానో ఆదరించారు. రాజుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఫుట్ బాల్ ఆడేవారు. సహ సర్ కార్యవాహగా విస్తృతంగా ప్రయాణించిన హెూసబళే యుఎస్ఎ, యుకెలోని హిందూ స్వయంసేవక్ సంఘ్ సంస్థాగత కార్యకలాపాలను తీర్చిదిద్దారు.