అస్సాం అసెంబ్లీ |
గౌహతి | మే 23, 2021 :: 2021 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం, అస్సాంలోని బిజెపి ప్రభుత్వం తన హిందుత్వ ఎజెండాను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ముందుకు వస్తోంది.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అస్సాం ప్రభుత్వం 'గో సంరక్షణ' బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు గవర్నర్ జగదీష్ ముఖి శనివారం అసెంబ్లీలో ప్రసంగిస్తూ "మనమందరం ఆవులను గౌరవిస్తాము, తల్లిలా ఆరాధిస్తాము. ఒక పవిత్ర జంతువుగా పరిగణిస్తాము, ఎందుకంటే గోవు తన జీవాన్ని పాల ద్వారా మనల్ని పోషిస్తోంది. వాస్తవానికి, ఇది భూమిపై ఉన్న ప్రత్యక్ష దైవంగా మనం చెప్పవచ్చు" అని ముఖి అన్నారు. ప్రతిపాదిత బిల్లు ద్వారా గోవధ మరియు ఇతర రాష్ట్రాలకు పశువుల రవాణాపై పూర్తి నిషేధం విధించాలని భావిస్తోంది, తద్వారా నేరస్థులపై కఠినమైన శిక్షను అమలు చేస్తుందని ముఖి చెప్పారు. "ఈ బిల్లు ఆమోదించిన తర్వాత, అస్సాం ఇలాంటి బిల్లులను ఆమోదించిన ఇతర రాష్ట్రాల జాబితాలో చేరనుంది" అని ఆయన చెప్పారు.
అలాగే ధర్మ సత్రాలు మరియు ఆలయ భూములను ఆక్రమణదారుల నుండి స్వాధీనం చేసుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడుతుంది" అని ఆయన చెప్పారు.
మే ౨ న ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఆధారంగా, బిజెపి స్పష్టమైన మెజారిటీని గెలుచుకుంది, డాక్టర్ హిమంత బిస్వా శర్మ అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, అయన హిందుత్వాన్ని ప్రజలలోకి నేరుగా తీసుకొస్తున్న సందేశాన్నీ ఈ బిల్లు ద్వారా తెలియజేయనున్నారు.
ఇప్పటికే అస్సాంలోని బిజెపి ప్రభుత్వం నియంత్రణలో ఉన్న మదరసా పాఠశాలలను రద్దు చేసి జనరల్ స్కూల్ బోర్డులో విలీనం చేసింది. ఇప్పుడు, అస్సాంలోని బిజెపి ప్రభుత్వం 'లవ్ జిహాద్' కు వ్యతిరేకంగా కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఆలోచిస్తోంది, రాష్ట్రంలో చాలా మంది హిందూ బాలికలు మరియు మహిళలు చాలా కాలం నుండి ముస్లిం ప్రేమ రాకెట్ కు బాధితులవుతున్నారు.
__Inputs from PTI.