Balasaheb Deoras - బాళాసాహబ్ దేవరస్ |
: శీలాన్ని తీర్చిదిద్దే సంస్కారాలు అవసరం :
ఈనాటి మన భారతదేశంలో దీనికి భిన్నమైన స్థితి ఉంది. ఇక్కడి సామాన్య వ్యక్తి అటువంటి స్థాయిలో లేడు. శీలం అనే విషయంలో ఇక్కడి ప్రజల కల్పనకూడా విచిత్రంగా ఉంది. ఒక వ్యక్తి ఏమి తింటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏమి ధరిస్తున్నాడు, స్త్రీల వైపు అతడు ఎల చూస్తున్నాడు వగైరా నడవడి సంబంధమైన విషయాలనే శీలం అనుకొంటున్నారు. వాస్తవానికి శీలం అనేది ఇంతకంటే చాలా పెద్ద విషయం.
సమాజంగురించి, దేశంగురించి ఆలోచించటం, వీటికోసం తన సర్వాన్నీ అర్పించడానికి సిద్దమై ఉండటం ఇది శీలానికి ఉండవలసిన ముఖ్యమైన భాగం (లక్షణం). వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ పై ఇంగ్లాండు విజయం సాధించింది. ఆ యుద్ధం విజయాన్ని గురించి ఇలా చెప్తారు, ("The Battle of Waterloo was won on the play ground of Eton") ఈటన్ లో ఉన్న క్రీడామైదానంలో వాటర్లూ యుద్ధ విజయం సాధించుకోబడింది. ఇటువంటి అపూర్వవిజయాలను సాధించుకోవటం వెనుక తల్లిపాలు, తండ్రి ఇచ్చిన శిక్షణ, ఆటల మైదానము, పాఠశాల ఇవన్నీ సంస్కారములను నిర్మాణంచేసే పరంపరలో భాగస్వాములైఉండాలి. అటువంటి సమాజం తయారు కానంతవరకు మనదేశంలో సంఘంవంటి విశిష్ట సంస్థలద్వారా ప్రత్యేక ప్రయత్నాలు జరుగవలసియున్నవి.
ఈ స్వాభావిక స్వరూపాన్ని ఏర్పరచుకొనే పనిని సంఘంకాక మరెవరూ చేయటం లేదు అందరూ దీనిపట్ల నిర్లక్ష్యంగానే ఉన్నారు. సమాజంలో స్వాభావికశక్తిని (అంతర్గతశక్తిని) నిర్మించటమే మన అంతిమ లక్ష్యానికి కేంద్ర బిందువుగా, భూమికగా ఉన్న అంశం. దీనిని సరిగా అర్ధం చేసికోనంతవరకు అనేకానేక సందేహాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ఈ లక్ష్యాన్ని పరిపూర్తి చేయటం కోసమే దైనందిన శాఖా పద్ధతి నడిపింపబడుతున్నది.
మన దగ్గర ఎన్నో పరంపరలు ఛిద్రమయ్యాయి. సమాజం అస్తవ్యస్తమై పోయింది. ఈ కారణం మూలంగానే సంస్కరణల ప్రణాళికకూడా సఫలం కాలేకపోతున్నవి. ప్రయత్నము పరిశ్రమల ఆధారంతో యోజనలను పూర్తిచేయదలిస్తే చాలదు. సమాజంయొక్క స్థితిలోనూ తదనుగుణమైన ఆసక్తి, సంసిద్ధత ఉండాలి. ఆది శంకరాచార్యుల నాటికాలంలో ఎటువంటి స్థితిలో ఉందో, ఇప్పుడలాంటి స్థితి లేదు. ప్రజలలో మేలుకొలుపు, జ్ఞానదానముల పనులు శిథిలమై యున్నవి. కొన్ని వందల ఏండ్లగానో, వేల ఏండ్లుగానో మన సమాజం ఇలాంటి దురవస్థలోనే కాలం గడుపుతున్నది. ఛిన్నాభిన్నమైయున్న సమాజాన్ని మరల స్వాభావిక అవస్థకు తీసికొనిరావడానికి ఇదిగో ఇంత నిశ్చిత సమయం అంటూ ఎవరూ చెప్పలేరు.
మన కార్యం అత్యంత ఆవశ్యకమైన కార్యం. దీనిని మనం చేస్తూ ఉండాలి. ఈ కార్యం ఆరంభమై ఇప్పటికి రెండు తరాలవాళ్ళు నిమగ్నులై పనిచేశారు. ఇంకా ఎన్ని తరాలవారు పనిచేయాలి అని ఆలోచించటం మన పని కాదు. నిరంతరంగా కార్యాన్ని చేస్తూ ఉండటమే మన పని. మిగిలిన పనులు ఆధారభూతమైన, అత్యంత ప్రధానమైన మన పనికి పూరకములు సహాయకారులు మాత్రమే. ఏ సమాజంలోని జనమానసం సమాజోన్ముఖమై, స్వాభావికంగా (అతర్తసహజంగ సామర్ధ్యశాలియై తనంతతానుగా, స్వేచ్ఛాపూర్వకంగా, ఎల్లప్పటికీ పోషణ చేసుకొంటూ ఉంటుందో అటువంటి సమాజ జీవన నిర్మాణమే - సంఘంముందున్నకార్యం గురించిన కల్పన.
✹ ✹ ✹