డా. మోహన్ భాగవత్ జీ |
భవిష్య భారతం - ఆర్ ఎస్ ఎస్ దృష్టికోణం
సంఘం మరియు కుల వ్యవస్థ
ప్రశ్న : హిందూ సమాజంలో కులవ్యవస్థను సంఘం ఎలా చూస్తుంది? సంఘంలో అంటరాని కులాలవారికి, జనజాతుల వారికి ఎలాంటి ప్రాతినిధ్యం, స్థానం ఉన్నాయి ? సంచార మరియు వెనుకబడిన కులాల కోసం సంఘం ఏమైనా ప్రయత్నం చేస్తోందా ?
జవాబు : కుల వ్యవస్థ అని పిలిస్తే అది తప్పవుతుంది. నేడు వ్యవస్థ అనేది ఎక్కడుంది అదంతా అవ్యవస్థే, కులం అన్నది వ్యవస్థితంగా ఉన్నపుడు అది ఉపయోగకరంగా ఉండింది లేదా నిరుపయోగకరంగా ఉండింది అనవచ్చు. నేడు దాని గురించి ఆలోచించడానికి తగిన కారణమేదీ లేదు. అది నశించిపోయేదే. నశించిపోవడానికి ప్రయత్నం చేస్తే మరింత నిశ్చయంగా పోతుంది. దాన్ని పోగొట్టడానికి ప్రయత్నించడం కన్నా, ఏది రావలసి ఉందో దానికోసం మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
చీకటిని కర్రతో కొడుతూ కూర్చుంటే అది తొలగిపోదు. ఒక దీపాన్ని వెలిగించాలి, అపుడు అది తొలగిపోతుంది. అన్నింటినీ కలుపుకొంటూ ఇముడ్చుకొంటూ ఒక పెద్ద గీతను గీసేస్తే మొత్తం భేదభావాలన్నీ నశించిపోతాయి. ఈ పనే సంఘం చేస్తోంది. సామాజిక వైషమ్యాన్ని పెంచి పోషించేవారిలో ఆ భావాలు తొలగిపోవాలి. మేము వైషమ్యంపట్ల విశ్వాసం కల్గినవాళ్ళం కాదు. మార్గం కఠినమైనది, సుదీర్ఘమైనది కూడా, అయితే దాన్ని ఆచరించి తీరాల్సిందే. ఆ దిశలో మేం అడుగులు వేయడం మొదలుపెట్టాం. సంఘ కార్యం పెరిగేకొద్దీ అన్నిచోట్లకూ చేరుకుంటాం. నిజానికి మేం సంఘంలో ఎవరినీ కులం గురించి అడగం.
నేను మొదటిసారి సర్ కార్యవాహగా ఎన్నికైన సందర్భమది. ఆ సమయంలో శ్రీ సురేశ్ సోనీ జీ సహసర్ కార్యవాహగా నియుక్తులు కాగానే, 'ఈ భాగవత్ బృందం విజయం సాధించింది, అయితే ఓ.బి. సి.కి ప్రాతినిధ్యం ఇవ్వాలి కాబట్టి సోనీజీని సహ సర్ కార్యవాహ చేశారని' పత్రికారంగం పేర్కొన్నది. అపుడు నేను, సోనీజీని మీరు ఓ.బి.సి. గ్రూప్లోకి వస్తారా? అని ప్రశ్నించాను. అపుడాయన కాసింత మందహాసం చేశారే తప్ప సమాధానమివ్వలేదు. ఇప్పటికి కూడా సోనీజీ ఏ వర్గానికి చెందినవారో నాకు తెలీదు. సంఘంలో ఉండే వాతావరణం ఇది. ఈ విధంగా మనం ముందుకు సాగితే, మార్పు సాధ్యమవుతుంది.
నేను నాగపూర్ లో చదువుతున్నప్పుడు, ఆ సమయంలో సంఘంలోని దాదాపు అధికారులందరూ ఒక కులం, బ్రాహ్మణ కులానికి చెందినవారై ఉండేవారి. అయితే 1980 దశకంలో నేను నాగపూర్ కు ప్రచారక్'గా వచ్చినపుడు, నగరంలోని బస్తీలన్నింటిలో కార్యకారిణి ఏర్పాటు చేయడం జరిగింది. మా శాఖలు పెరగడంవల్ల మేము ఆ బస్తీలకు చేరుకున్నాం. ఆలా మేము పనిని పెంచాం. స్వాభావికంగా అందులోనుండి కార్యకర్తలు తయారయ్యారు. వాళ్లే ముందుకు వచ్చారు. కోటాపద్దతి అమలు చేస్తే కులం వెలుగులోకి వన్తుంది. నహజ ప్రక్రియద్వారా అందరినీ కలుపుకుపోతే కులం అనేది గుర్తింపు కోల్పోయి నశించిపోతుంది. సహజ ప్రక్రియ ద్వారా తీసుకొచ్చేటపుడు, అలా తీసుకొచ్చేవారి మనసులో ఈ జ్ఞానం ఉండాల్సి ఉంటుంది; ఎందుకంటే స్వాభావికంగామనిషి తనలాంటి వారినే దగ్గరకు తీసుకునే ప్రవృత్తి కలిగి ఉంటాడు. మనం మనలాంటి వారినే కాదు, అందరినీ దగ్గరకు తీసుకోవాలి. ఇది దృష్టిలో ఉంచుకుని పనిచేసుకుంటూ పోతే, ఇది సాధ్యమవుతుంది.
50వ దశకంలో సంఘంలో మీకు బ్రాహ్మణులు మాత్రమే కనబడేవారు. నేడు సంఘంలో అది కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. ప్రాంతం మరియు దానిపై ఉండే క్షేత్రం (Zone) స్థాయిలో అన్ని కులాలకు చెందిన కార్యకర్తలు వస్తున్నారు. అఖిల భారతీయ స్థాయిలో కూడా నేడు ఒకటే కులం అనేదేదీ లేదు. ఇది పెరుగుతూపోతోంది మరియు సంపూర్ణ హిందూ సమాజపు సంఘటనా కార్యంలో పనిచేసే వారిలో అన్ని కులాలకు, వర్గాలకు చెందినవారు కలగలసి ఉన్నారు. అలాంటి కార్యకారిణి మీకు కనబడుతుంది. నేను ముందే చెప్పాను, మార్గం సుదీర్ఘమైనదని, కానీ మేము ఆ మార్గంలో ముందుకు సాగిపోతున్నాం అన్నదే ప్రాముఖ్యం కల్గిన విషయం.
సంచార కులాల కోసం మేం పనిచేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చాక వారి మధ్యకు వెళ్ళి, విశ్వాసంలోకి తీసుకుని పనిచేసినవారిలో మేమే మొదటివాళ్ళం. మహారాష్ట్రలో ఈ పని మొదలైంది. తద్వారా చాలా సంగతులు జరిగాయి. వారిని స్థిరపడేలా చేయడం వారి పిల్లలను చదువుకునేలా చేయడం, విద్యాభ్యాసంతర్వాత సమాజంలో వారు ముందుకు వెళ్లేలా చూడటం, పరంపరానుగతంగా వారిలో వచ్చే మూఢాచారాలు, తప్పుడు విధానాలను తొలగించే భావనలను వారి మనసుల్లో పెంపొందించి, వాటిని తొలగించడంలాంటి పనులు చేస్తూ పోవడం ద్వారా మొదట మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత ఇపుడు కేంద్ర ప్రభుత్వం కూడా వీరి కోసం ఒక ప్రత్యేక కమీషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
యమగర్వాడి అనే చోట మేము చేపట్టిన Pilot Programme నడుస్తోంది. అక్కడ వారికి సంబంధించిన సమగ్ర పరిచయం మరియు పని ప్రాతినిధ్య స్వరూపంలో చూడటానికి మీకు అవకాశం లభిస్తుంది. వెళ్ళాలనుకునేవారు తప్పక వెళ్ళిచూడండి. మానసికోల్లాసంకోసం మీరు దేశంలో విదేశాలలో యాత్రలు చేస్తుంటారు, ఒకసారి ఇక్కడికికూడా యాత్ర చేయండి. ఎన్నో కష్టాలు, దెబ్బలు ఓర్చుకుంటూ కార్యకర్తలు ఆ సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతుంది. నేడు అఖిల భారతస్థాయిలో ఎన్ని సంచార జాతులున్నాయో, వారందరి కోసం కార్యక్రమాలను చేపట్టడానికి కార్యప్రణాళిక సిద్ధం చేశాం. దాని ఆధారంగా వారికోసం పనిచేయబోతున్నాం.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..