మాతృశక్తి |
:మాతృశక్తి జాగరణ జరగాలి:
మహిళల గురించి మా ఆలోచన కూడా ఇలాగే ఉంటుంది. మన దేశంలో ప్రాచీన కాలం నుంచి మహిళలకు అత్యంత ఉన్నత స్థానం ఇచ్చారు. శక్తిస్వరూపిణి, జగదంబ రూపాల్లో ఆమెను కొలుస్తాం. ఒకవైపు మన ఆలోచనల్లో ఇంతటి ఉన్నతస్థానం లభిస్తే యథార్థ ప్రపంచంలో మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. కనుక ఆమెను దేవతగా గుడిలో కూర్చోబెట్టి పూజించాల్సిన అవసరమూ లేదు, అలాగే అనేక కష్టాలకు అవమానాలకు గురిచేయాల్సిన అవసరమూ లేదు.
సమాజంలో భాగంగా ఆమెకు అన్ని రంగాల్లో సమానమైన అవకాశాలు, హక్కు ఆమెకు ఉంటాయి. అలాంటి స్థానం ఆమెకు కలిగిస్తే చాలు. అయితే ఇదంతా ఆమెను ఉద్దరిస్తున్నామన్న భావనతో చేయకూడదు. అనేక విషయాల్లో పురుషులకంటే మహిళలు ఎక్కువ నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ విషయం మీకు కూడా చాలాసార్లు అనుభవంలోకీ వచ్చి ఉంటుంది. పురుషులు చేసే పనినే మహిళలు మరింత నైపుణ్యంతో, బాగా చేయగలుగుతారు. ఇది అనేక రంగాల్లో కనిపిస్తోంది. కాబట్టి వాళ్ళకి అందుకు కావలసిన స్వేచ్ఛ, వనరులు ఇవ్వాలి విద్యావంతులుగా తీర్చిదిద్దాలి.
ఇంటి నుంచి ప్రారంభించి సామాజిక రంగం వరకూ మాతృశక్తి జాగరణ జరగాలని సంఘం కోరుకుంటోంది. సంఘ స్వయంసేవకులు, సంఘతో సంబంధం ఉన్న అనేక సంస్థల ద్వారా ఈ పని జరుగుతోంది. పురుషుడు, స్త్రీ పరస్పర పూరకాలు. జీవితం సజావుగా సాగాలంటే ఈ ఇద్దరూ సమానంగా బాధ్యతలు చేపట్టి నిర్వహించాల్సిందే. ఇలా నిర్ణయాలు తీసుకోవడం నుంచి వాటిని అమలు చేయడం వరకూ అన్నింటిలో సమానమైన పాత్ర వహించినప్పుడే జాతి నిర్మాణం సాధ్యపడుతుందన్నది. సంఘ అభిప్రాయం అయితే నిన్న నేను సైద్ధాంతిక లక్ష్యం గురించి మాట్లాడుతూ ఎక్కడ వదిలిపెట్టానో అక్కడకు మళ్ళీ వస్తాను. సంఘ సిద్ధాంతం హిందుత్వం అంటే దీనర్థం సంఘం హిందుత్వాన్ని కని పెట్టిందనో, వెదికి వెలికితీసిందనో కాదు, ఇది మన దేశంలో పరంపరాగతంగా వస్తున్న ఆలోచనాధార, కాగా దీని విషయంలో అనేక రకాల భ్రమలున్నాయి. భ్రమజాలాన్ని కలిగించే ప్రచారానికి దూరంగా జరిగి కాస్త ఆలోచిస్తే ఇది అందరి ఆమోదం పొందిన, అందరూ అనుసరిస్తున్న జీవన శైలి అని అర్ధమవుతుంది.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం: డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..