భరతమాత |
భిన్నత్వంలో ఏకత్వం దర్శించడమే బంధుభావానికి ఆధారం !
ఈ బంధుభావాన్ని పెంపొందించడానికే సంఘం పనిచేస్తోంది. ఈ బంధుభావానికి ఏకైక ఆధారం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడటం. ప్రపంచం హిందుత్వం అని పిలిచే ఆలోచనాధోరణే ఇలా భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం మనకు నేర్పింది. అందుకనే మనం ఇది హిందూ రాష్ట్రం(దేశం) అంటాం. హిందూరాష్ట్రం అనగానే ముస్లింలు అక్కరలేదని కానేకాదు. ఎప్పుడైతే ముస్లిములు అవసరంలేదని అంటామో అప్పుడు ఇది హిందుత్వం కాకుండా పోతుంది.
అలాగే బౌద్ధాన్ని అంగీకరించబోమని అన్నా అది హిందుత్వంగా మిగలదు. ఎందుకంటే
మన దేశంలో సత్యాన్వేషణ నిరంతరం సాగింది. దానివల్లనే అనేక దర్శనాలు ఏర్పడ్డాయి. అవన్నీ విలువైనవే. అవన్నీ సత్యానికి రూపాలే కాబట్టి వాటిపట్ల శ్రద్ధ ఉండాలి. ఇలా అందరినీ కలుపుకుని పోయేదే హిందుత్వం. అది 'సర్వేషాం అవిరోధేన' అనే ధోరణి కలిగినది. అది ప్రతిక్రియకు ఎప్పుడూ పాల్పడదు. దానిని అనుసరించే యోగ్యతను మనం సంపాదించుకోవాలి. మనం కొంతకాలంగా ఆ యోగ్యతను కోల్పోయాం. అందువల్ల అనేక సమస్యలు వచ్చాయి. 1881 జనాభాలెక్కల వరకూ మనకు మనమంతా హిందువులమనే అవగాహన, స్పృహ ఉండింది. సయ్యద్ అహ్మద్ఆలీఖాన్ బారిస్టర్ చదువు పూర్తి చేసుకుని వచ్చినప్పుడు లాహెూర్లో ఆర్యప్రతినిధి సభ అతనికి సన్మానం చేసింది.
సయ్యద్ అహ్మద్ ఆలీఖాన్ ను పరిచయం చేస్తూ 'ఇప్పటివరకూ హిందువులే బారిస్టర్ చదువు
పూర్తిచేశారు, ఇప్పుడు మొట్టమొదటసారిగా ఒక ముస్లిం కూడా బారిస్టర్ అయ్యారు. అంటూ పేర్కొన్నారు. ఆ తరువాత మాట్లాడిన అహ్మద్ఆలీఖాన్ 'నన్ను మీరు మీలో ఒకడిగా కాకుండా వేరుచేసి మాట్లాడినందుకు నాకు చాలా బాధ అనిపించింది. మేము భారతమాత పుత్రులం కాదా? మా పూజాపద్దతి మాత్రమే మారింది అంతేతప్ప ఇక ఏదీ మారలేదు కదా ?” అని తన విచారాన్ని వ్యక్తం చేశారు.
ఇలా 1881వరకూ మనమంతా హిందువులమనే ఖావన అందరిలో ఉంది. కానీ ఆ తరువాత క్రమంగా అది మరచిపోయాం. కాబట్టి ఆ భావాన్ని తిరిగి మనం తెచ్చుకోవాలి అలవరచుకోవాలి. ఇప్పుడు హిందూశబ్దం వద్దు భారతీయ శబ్దం ఉపయోగించాలని ఎవరైనాఅంటే మాకేమీ అభ్యంతరం లేదు. అయితే ఎలాంటి సంస్కారాలు వ్యక్తుల్లో కలిగించాలని మేం అనుకుంటున్నామో వాటిని సూచించేందుకు హిందుత్వం అనే మాట సరిగా సరిపోతుందని మాకు అనిపించింది కాబట్టి దానినే మేం ఉపయోగిస్తున్నాం. ఇకముందు కూడా అలాగే చేస్తాం. అలా చేయడంవల్ల ఏదైనా నష్టంవస్తే దాన్ని భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
హిందూ శబ్దం వలన అందరినీ కలుపుకుపోయే భారతీయ తత్వం, ధోరణికి ఎలాంటి ప్రమాదం లేదని మా భావన.. కాబట్టి రాజ్యాంగాన్ని ప్రశ్నించే మాటే రాదు. రాజ్యాంగమే మనను ఒకటిగా కట్టి ఉంచుతోంది. అది ఎంత విశాలమైనదంటే, దానిగురించి ఏదైనా ప్రశ్నించడానికి, చర్చించడానికి వీలు అందులోనే ఉంది. రాజ్యాంగాన్ని సంఘం గౌరవిస్తుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా మేము ఏ పనీ చేయం. అలా చేశామనడానికి ఒక్క ఉదాహరణ కూడా లేదు. అలాగే మేమే భారతదేశాన్ని ఉద్దరిస్తామనే అహంకారం కూడా మాకు లేదు. ఇలాంటి అహంకారం ఎవరికీ ఉండకూడదు. సమాజం దానంతట అది జాగృతమవుతుంది. అంతేకానీ ఒక వ్యక్తి, సంస్థ, ప్రభుత్వంవల్ల కాదు. భేదభావాలు, స్వార్ధం వదిలిపెట్టి ప్రజలంతా ఉద్యమించినప్పుడు అది సంభవిస్తుంది. మీరు ఏ దేశపు చరిత్రనైనా చూడండి ఆ దేశం అభివృద్ది చెందిందంటే అందుకు కనీసం వంద సంవత్సరాల కృషి ఉంటుంది. అటువంటి కృషి మూలంగా సమస్యల సుడిగుండం నుంచి బయటపడిన ఆ దేశం ప్రపంచంలోనే ఉన్నతస్థానానికి చేరుకుంటుంది. అది అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, క్యూబా ఇలా ఏ దేశమైనా ఇలాగే జరుగుతుంది. ఆయా విషయాలు నేను స్వయంగా చదివాను. కాబట్టి నేను ఇంత కచ్చితంగా చెప్పగలుగుతున్నాను.
ఒకే ఒక్క ఉదాహరణ ఇస్తాను. జపాన్ గురించి 'ది ఇన్క్రెడిబుల్ జపనీస్' అనే పుస్తకం ప్రచురితమైంది. జపాన్ ప్రపంచపు ఆర్థికవ్యవస్థల్లోనే పటిష్టవంతమైనదిగా పేరుపొందినప్పటి వివరాలు, విశేషాలను ఇద్దరు ఆర్థికవేత్తలు, ఇద్దరు సామాజికవేత్తలు ఈ పుస్తకంలో వ్రాశారు. అది చదువదగ్గ పుస్తకం. ఆ పుస్తకం చివరిపేజీలో వాళ్ళు తొమ్మిది అంశాలను అందులో మొదటి అయిదు ఆర్థికశాస్త్రంతో సంబంధం లేనివి. జపాన్ ప్రజలు ఎంతో క్రమశిక్షణ, అనుశాసనం కలిగినవారని, అందుకే ప్రగతి సాధించారని రచయితలు అందులో పేర్కొన్నారు. అలాగే ఏదైనా లాభాన్ని, ప్రయోజనాన్ని గురించి ఆలోచించేప్పుడు జపాన్ ప్రజలు తమ వ్యక్తిగతలాభం కోసం చూసుకోరని, కనీసం తమ గ్రామం, బస్తీని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారన్నది వాళ్ళు పేర్కొన్న రెండవ అంశం. ఇక మూడవది దేశం కోసం ఎలాంటి సాహసానికైనా జపాన్ ప్రజలు సదాసర్వదా సిద్ధంగా ఉంటారు.నాలుగవది, దేశంకోసం ఎలాంటి త్యాగానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ఐదవది, ఆఖరు అంశం ఏమిటంటే దేశానికి సంబందించిన ఏ పని చేసినా అది చాలా ఉన్నతమైన, శ్రేష్టమైన పద్ధతిలో ఉండేట్లుగా జపాన్ ప్రజలు ప్రయత్నిస్తారు
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
{full_page} భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..