'శ్రీరామ' |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
: శ్రీరామ జన్మభూమి మందిరం :
ప్రశ్న: విశ్వాసపుప్రశ్న చట్టపునమస్యగా తయారైంది. ఈ విషయంలో షాబానో ఉదంతంలో లాగా ఆర్థినెన్స్ తీసుకురావచ్చా ? లేక సంఘం ఏర్పాటు చేసిన ఈ వ్యాఖ్యానమాలలాగా మరొక సామాజిక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయవచ్చా?
జవాబు : ఆర్డినెన్స్ అనేది ప్రభుత్వం చేతిలో ఉంది. సామాజిక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయడం రామజన్మభూమి ముక్తి సంఘర్ష సమితి చేతిలో ఉంది. ఆ రెండింటిలోనూ నేను లేను. ఉద్యమంలో ఏం చేయాలనేది, దాని ఉన్నతస్థాయి సమితి నిర్ణయం చేస్తుంది. వాళ్ళు సలహా అడిగితే నేను చెప్పగలను నిజమే. చర్చ తప్పనిసరిగా జరగాలన్నది నా అభిప్రాయం. చర్చ జరుగుతోంది, జరగడం లేదనేదేమీ లేదు. ఆర్డినెన్స్ తీసుకురావడం లేక తీసుకురాకపోవడమా అనేది చట్టం చేయగలదా ? ఆర్థినెన్స్ తీసుకొచ్చాక, దానికి ఎలాంటి అడ్డంకి ఎదురవదనేది కచ్చితమా ? అడ్డంకి ఎదురైతే అది ఎక్కడికి వెళ్ళాలి ? ఎన్నికలు రాబోతున్న వేళ ఈ పని జరుగుతుందా ? ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయాలు, నేను కాదు.
సంఘ స్వయంసేవక్ గా, సర్ సంఘచాలక్ గా మరియు రామజన్మభూమి ఉద్యమంలో భాగంగా రామ జన్మభూమిలో త్వరగా భవ్యమైన మందిరం నిర్మించాలని నేను కోరుకుంటున్నాను. శ్రీరామచంద్రుడు మనదేశంలోని అనేకమందికి భగవత్స్వరూపుడు. అయితే ఆయన కేవలం భగవంతుడు మాత్రమే కాదు. మనదేశంలో కొందరు ఇతర వ్యక్తులు, ఆయనను భగవంతుడిగా భావించరు కానీ ఆయన ఆచరణలో చూపిన సదాచారం వల్ల, భారతీయ సదాచార జనకుడిగా చూస్తారు. ఆయనను 'ఇమామే హింద్' అని భావిస్తారు. ఇందువల్లే సమాజంలోని అన్ని వర్గాలలో ఒక విశ్వాసం నిండి ఉంది. రాముడికి అనేక దేవాలయాలున్నాయి, అనేకం ధ్వంసమయ్యాయి. అయితే అన్నింటి విషయం ఎత్తడం లేదు. ఆయన జన్మించిన చోట మందిరం నిర్మించబడాలి. మొదట అక్కడ మందిరం ఉండేది అన్నది లేజర్ కిరణాల ద్వారా నిర్ధారింపబడింది కూడా.
ఇది గనుక జరిగితే హిందు, ముస్లింలమధ్య గొడవకు కారణమైన ఓ పెద్ద అంశం తొలగిపోతుంది. సద్భావనతో గనుక ఇది జరిగిపోతే, ముస్లింల వైపు మళ్ళీ మళ్ళీ వ్రేలెత్తి చూపే పరిస్థితులు తగ్గిపోతాయి. దేశ ఐక్యతకు మరియు దేశ ఆదర్శాలకు పుష్టినిచ్చే అంశమిది. కోట్లాది ప్రజల విశ్వాసానికి సంబంధించిన ప్రశ్న ఇది. దీన్ని ఇంతగా లాగకుండా ఉండాల్సింది. దేశహితమనే బుద్ధితో ఆలోచన జరిగితే, రాజకీయాలు ఇందులో ప్రవేశించకుండా ఉంటే నిర్మాణం ఎపుడో జరిగి ఉండాల్సింది. రామజన్మభూమిలో భవ్య రామమందిర నిర్మాణం మరింకేమైనా ఉపాయంతో జరిగితే, అది శీఘ్రమే జరగాలన్నది నా అభిప్రాయం.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..