డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
యస్.సి. లేదా యస్.టి. చట్టం
ప్రశ్న : అత్యాచార నిరోధక చట్టంమీద సర్వోచ్ఛ న్యాయస్థానం తీర్పువల్ల ఆయావర్గాలలో ఆక్రోశం, ప్రతిక్రియ నిర్మాణమైంది. ఇది సరైందేనా? నర్వోచ్ఛ న్యాయస్థానపు నిర్ణయాన్ని పార్లమెంట్ మార్చాలా? నవర్ణులకు అంటరాని సమాజానికి మధ్య అగాధం ఏర్పడింది. ఇది సరైనదేనా
అది ఎలా దూరమవుతుంది?
జవాబు : స్వాభావికంగా మన సామాజిక వెనుకబాటుతనం కారణంగాను, మరియు మనలోని కులపరమైన అహంకారం కారణంగానూ అత్యాచార పరిస్థితి ఏర్పడి ఉంది. ఆ పరిస్థితి నుండి బయట పడవేయడానికి అత్యాచార నిరోధక చట్టం రూపొందించ బడింది. అది సరిగా అమలు జరగాలి. దాని దురుపయోగం జరగకూడదు. ఇందులో సరిగా అమలుజరగకపోవడం, దురుపయోగం కావడం అనే రెండు విషయాలున్నాయి. కాబట్టి సంఘం, ఆ చట్టం సరిగా అమలు జరగాలని, దురుపయోగం కారాదని కోరుతున్నది. అయితే ఇదెలా సాధ్యం? ఇది కేవలం చట్టంతో జరగదు. సమాజంలో సద్భావన, సమాజ సమరసతా భావన ఈ పని చేయగలవు. నేటి యుగంలో ఇంతగా చదువులు లభ్యమవుతున్నప్పటికీ వీటన్నింటినీ చూశాక, నా మనసులో మెదిలే మొదటి ప్రశ్న- మీరందరూ ఎవరు ? అంటే పేరు గోత్రం కాదు మీరెక్కడి నుండి వచ్చానేదే ? నా మనసులో ఇవి ఎందుకు కలుగుతాయి? మరోవైపున అత్యాచారమనేది ఎప్పటికైనా అత్యాచారమే. అది వారిపై జరిగింది కాబట్టి సరైనది, వీరిపై జరిగింది కాబట్టి సరైంది కాదు అని కాదు ఈ సద్భావనను తేవడం చాలా అత్యవసరం.
ఇక సర్వోన్నత న్యాయస్థానం ఏమి చెప్పింది ? ప్రభుత్వం ఏం చేసింది ? దీని గురించి నేనేమి మాట్లాడను. చట్టాన్ని కాపాడాలి, దాని దురుపయోగం చేయరాదు. సద్భావనను పెంపొదించి సమాజంలో ఈ సమస్య లేకుండా సరిచేయాలనేది సంఘం కోరిక. చట్టం ఏం చేయాలో, ఏం చేయకూడదో అది వేరే సంగతి. అంటరానితనమనేది ఏ ప్రభుత్వం చట్టం ద్వారా రాలేదు. అది సమాజంలోని పద్ధతుల కారణంగా వచ్చింది; శాస్త్రాలవల్ల కూడా రాలేదు, అది మనలోని తప్పుడు భావాలవల్ల వచ్చింది. మనలోని సరైన మంచి భావాలే దాన్ని ఎదుర్కొంటాయి. ఆ మంచి భావాలను పెంచే పని స్వయంసేవకులు చేస్తున్నారు. "సమరసతా మంచ్" రూపంలో స్వయంసేవకులు పనిచేస్తున్నారు. సద్భావనా బైఠకులు నిర్వహించి ఈ విషయాలన్నింటినీ సరిచేయడమే వారి ప్రయత్నంలో భాగంగా.ఉంది.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..