డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
: సమాన పౌర సంహిత :
ప్రశ్న : సమాన పౌర చట్టం విషయంలో సంఘ అభిప్రాయం ఏమిటి ?
జవాబు : ఇది రాజ్యాంగపు మార్గదర్శక సూత్రం. ఒక దేశంలోని ప్రజలు ఒక చట్టం పరిధిలో ఉంటారని చెప్పబడుతున్నది. ఒక చట్టం పరిధిలో ఉండేలా సమాజపు మనస్తత్వం రూపొందాలి. సమాన పౌరచట్టం గురించి చర్చించడం మొదలిడగానే కొందరిలో ఒక వైఖరి ఏర్పడుతుంది. హిందు మరియు ముస్లింల మధ్య విభేదాల విషయంగా చిత్రీకరిస్తారు. సమానపౌరసంహిత ఆమోదంతో అన్ని పరంపరల్లోనూ కొంతలో కొంత మార్పులు వస్తాయి.
హిందువుల పరంపరల్లోనూ మార్పులు సంభవిస్తాయి. వారసత్వ విషయాల్లో కొందరు హిందువులు 'దాయభాగ'ను అనుసరిస్తుండగా, మరి కొందరు 'మితాక్షర'ను అనుసరిస్తున్నారు. మన జనజాతులకు సంబంధించి పరంపరాగతంగా వారికున్న చట్టాలు కూడా వెలుతున్నవి. అన్ని వైవిధ్యాలను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగంలో వీటికి అనుమతి లబించింది. దీన్నంతటినీ దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక చట్టం కోసం సమాజపు మానసికత ఏర్పడాలి, అనే ప్రయత్నం జరగాలి. వాస్తవంగా దేశ ఏకాత్మతకు సమాన పౌరచట్టం అనేది బలాన్నిస్తుంది, అది కూడా ఏకత్వం కోసమే. దానిని అమలుచేయడం ద్వారా సమాజంలో మేము వేరే వర్గం అనే భావన బలం పుంజుకోరాదు. ఈ విషయం ఆలోచిస్తూ మెల్లమెల్లగా దాన్ని తీసుకురావాలి. ఈరోజు నేను ఈ మాటలు అంటున్నాను గానీ ఇలాంటి మాటలను మన రాజ్యాంగపు మార్గదర్శక సూత్రాలు రాజ్యాంగంలో ఎపుడో పేర్కొన్నాయి. దాన్ని ప్రభుత్వం ఆ దిశలో అమలు చేయాలి. అమలు చేయడానికి అందరిగురించి సమగ్రంగా ఆలోచిస్తూ అది ఏ చట్టమైనా సరే, సమాజంలో దానిగురించి అవగాహన కల్గించి, దాన్ని అమలు చేయాలి.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..