డా. మోహన్ భాగవత్ జీ |
:సంఘం రాజకీయాలకు దూరంగా ఉంటుంది:
ఈ విషయాన్ని ఇంత వివరంగా ఎందుకు చెపుతున్నానంటే తరుచుగా సంఘానికి రాజకీయ రంగానికి సంబంధం ఏమిటి ? సంఘం ఏవైనా రాజకీయ లక్ష్యాలతో పనిచేస్తుందా? అనే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. సాధారణంగా లోకంలో వ్యక్తులు ఏదో ఒక రంగంలో ప్రగతి సాధించిన తరువాత రాజకీయ రంగంవైపు దృష్టి సారిస్తూ ఉంటారు. ఆలోచనలు, అభిప్రాయాలు వేరువేరుగా ఉండడంవల్ల వివిధ రాజకీయ పార్టీలో చేరుతారు. దీనివల్ల స్పర్గ ఏర్పడుతుంది. దీనివల్ల సమాజం మొత్తాన్ని గురించి ఆలోచించడం. అందరితో కలిసి పనిచేయడం సాధ్యపడకపోవచ్చును. అందుకనే సంపూర్ణ సమాజాన్ని సంఘటితపరచడానికి పూనుకున్న సంఘం రాజకీయ రంగంతో ఎలాంటి సంబంధం పెట్టుకోరాదని ప్రారంభంలోనే నిర్ణయించుకుంది.
పోటీ రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఎన్నికల్లో పోటీ చేయకూడదని, సంఘ అధికారి ఎవరికీ ఏ రాజకీయ పార్టీలో కార్యనిర్వహణాధికారాలు ఉండరాదని నిర్ణయించుకుంది. సంఘం ఎన్నికలకు ఓట్లరాజకీయాలకు దూరంగా ఉండాలనే వైఖరిని అవలంబించింది. డా. హెడ్డేవార్ స్వయంగా రాజకీయాలలో పాల్గొన్నవారు. మంచి రాజకీయ కార్యకర్త కలకత్తాలో చదువుకుంటున్నప్పుడు ఆయన పత్రికలద్వారా ప్రచారం సాగించి ప్రభుత్వ ఆదేశాలు రద్దయ్యేట్లుగా చేయగలిగారు. కలకత్తాలో ఆయన చదువుకున్న నేషనల్ కాలేజీ ఇచ్చే సర్టిఫికెట్లు చెల్లవంటూ బ్రిటిష్ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఆయన ఈ ప్రచార ఉద్యమం లేవదీశారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా సమాజంలో మద్దతు కూడగట్టేందుకు భారీ ఉద్యమాన్ని సాగించే అవకాశం లేకపోయింది. దానితో ఆయన మరో మార్గం వెతికారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖులందరినీ కలిశారు. వారికి ప్రభుత్వ ఆదేశాల గురించి వివరించి మీ దగ్గరకు ఎవరైనా వస్తే ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా తమ ప్రాంతంలో సభ జరిగిందని, దానిలో తాము పాల్గొన్నామని. పలానాఫలానా వాళ్ళు మాట్లాడారని చెప్పాలంటూ ఒప్పించారు. సభకు చాలామంది హోజరయ్యారని, అందులో విద్యార్థుల సర్టిఫికెట్ల రద్దును అంతా వ్యతిరేకించినట్లు చెప్పాలని కోరారు. ఆ తరువాత ఫలానా చోట సభ జరిగింది, దానికి మూడువేల మంది హాజరయ్యారు ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ వక్తలు మాట్లాడారంటూ వివిధ పత్రికల్లో వార్తలు వచ్చేట్లు చేశారు.
ఇలా పత్రికల్లో ప్రతిరోజూ వార్తలు రావడంతో బ్రిటిష్పాలకులకు కంగారు పుట్టింది. అసలు ఈ వార్తలు నిజమో కాదో తెలుసుకునేందుకు ఉద్యోగుల్ని వివిధ ప్రదేశాలకు పంపారు. ఎక్కడికి వెళ్ళినా సభలు జరిగిన మాట వాస్తవమేనని సమాచారం వచ్చింది. ప్రభుత్వ ఆదేశాలపట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, దీనివల్ల ప్రభుత్వానికి అనవసరమైన సమస్యలు తలెత్తుతాయని రిపోర్ట్ వచ్చింది. దానితో ప్రభుత్వం నేషనల్ మెడికల్ కాలేజీ విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవలసి వచ్చింది. అలా కుశల రాజకీయ నాయకుడిగా డాక్టర్టీ వ్యవహరించారు. విదర్బ ప్రాంతంలో ఆయన పని చేసినప్పుడు అక్కడి ప్రముఖ నాయకుల పేర్లలో ఆయనది కూడా ఉండేది. అప్పటికి ఆయన యువకుడు కాబట్టి ముఖ్యంగా యువకులలో ఆయనకు చాలా పేరు ఆదరణ ఉండేది.
కానీ సంఘ కార్యం మొత్తం సమాజాన్ని కలపడానికి సంబంధించినది కాబట్టి దైనందిన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని సంఘం నిర్ణయించుకుంది. సంఘ సిద్ధాంతాన్ని అనుసరించి స్వయంసేవకులకు రాజకీయాలపట్ల కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని సందర్భానుసారంగా వ్యక్తీకరిస్తుంటారు. దేశహితం చేకూర్చేవిధంగా ఆ రాజకీయాలు ఎలా నడవాలన్నదానిపై సంఘానికి కచ్చితమైన అభిప్రాయం ఉన్నది. దానిని ఎప్పుడూ వెల్లడిస్తూనే ఉంది కూడా. సంఘం రాజకీయాలగురించి మాట్లాడదంటే దానర్థం చొరబాటుదారుల సమస్య గురించి కూడా పట్టించుకోదని కాదు. అది దేశానికి సంబంధించిన సమస్య కాబట్టి తప్పకుండా మాట్లాడుతుంది. దానితో కొంతవరకూ రాజకీయాలు ముడిపడి ఉన్నప్పటికీ అది ప్రధానంగా దేశం మొత్తానికి సంబంధించిన సమస్య, కాబట్టి అలాంటి విషయాల్లో సంఘం తన అభిప్రాయాన్ని తప్పక తెలియజేస్తుంది.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం: డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..