డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
: భారత రిపబ్లిక్ మరియు సంఘం :
ప్రశ్న: నోటా సదుపాయం గురించి సంఘం దృష్టికోణం ఏమిటి ?
అమెరికా, రష్యాలలో మాదిరిగా, దేశాధ్యక్షుడి ప్రత్యక్ష ఎన్నిక భారతదేశంలో అవసరం లేదా, అలాగే రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమైతే, అల్పసంఖ్యాకులకు విశేష సదుపాయం ఎందుకు?
జవాబు : రాజ్యాంగ నిర్ణయసభలో అల్పసంఖ్యాకులు అనే పదాన్ని తొలగించడం గురించి చర్చ జరిగింది. అలాగే మనం అల్పసంఖ్యాకులు అని పిలుస్తున్న వారికి ప్రతినిధులుగా ఉన్నవారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. ఇలాంటి విషయం మూలంగానే దేశవిభజన జరగటమే అందుకు కారణం. మళ్లీ విభజన జరగాలని ఎవరూ కోరుకోవడం లేదు. అయితే రాజ్యాంగ నిర్మాతల మనసుల్లో, జనసంఖ్య బాగా తక్కువగా ఉన్న వర్గాలవారికి కొద్దిగా ప్రత్యేక అవకాశాలను కల్పించడానికి ఆలోచన వచ్చి ఉండవచ్చుని నాకు అన్నిస్తుంది. అందుకే ఇలాంటి సదుపాయం చేయబడి ఉండవచ్చు. అయితే 'అల్ప సంఖ్యాకులు' అనే పదం చాలా సందిగ్ధతతో కూడుకున్నది. కాశ్మీర్లో అల్ప సంఖ్యాకులు ఎవరు ? దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరుగా ఇలాంటి పరిస్థితే ఉంది కదా ! చట్టంలో వ్రాసి ఉన్న ప్రకారం ఏం జరగాలో అది జరుగుతూ ఉండగా, మనం మార్పుకి యత్నించగలమా? ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎదురైనపుడు మళ్ళీ మనస్పర్థలు, అనుమానాలూ తలెత్తుతాయి. అయితే సమాజంలో ఎవరూ అల్ప సంఖ్యాకులు,బహుసంఖ్యాకులు కాదు. కాబట్టి ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. మనమంతా ఒకదేశ ప్రజలం. ఒకరికొకరం అన్నదమ్ములం కాగా వైవిధ్య భరితంగా ఉండటం మన విశేషత. దీన్ని అనుసరించి నడుచుకోవాలి. అన్నదమ్ముల్లా ఒక దండలోని పుష్పాల్లా ఒక క్రమంలో కలసి నడవాలి; దీనికొరకు చాలా చేయాల్సి ఉంటుంది.
అమెరికా, రష్యాల్లాంటి నమూనా గురించి మనం మాట్లాడుకుంటున్నాము. భారతదేశపు నమూనా భారత్ లాగా ఉండాలిగానీ, అమెరికా, రష్యాల్లో లాగా ఎందుకుండాలి. భారతదేశంలోని ప్రజలందరూ కలిసి దేన్ని నిర్ణయిస్తే అది ఉండాలి. ఎందుకంటే ఏ పరిపాలన పద్ధతిని అమలు చేస్తే, దాని ఆధారంగా నేను నా జీవితాన్ని రూపొందించుకోగలననేది భారతదేశంలోని ప్రతి సాధారణ వ్యక్తికి కూడా తెలుసు. వారితో చర్చజరగాలి తద్వారా ఏర్పడే ఏకాభిప్రాయం ప్రకారం ఉండాలి. నేటి వరకూ సరిగానే నడుస్తోంది.ప్రపంచమంతా అలా గుర్తించితీరాలనే కోరికేమీ లేదుగానీ, ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువ విజయవంతమైన ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉంది. ఇది తెలిసినవారు ఆలోచించగల్గినవారు కొన్ని సంస్కరణల గురించి మాట్లాడుతుంటారు. కచ్చితంగా వాటిగురించి ఆలోచన జరగాలి, అంగీకారయోగ్యమైనవి అమలుకావాలి. దీనికొరకు అనేక రకాల సలహాలు వచ్చాయి. అయితే అమలులో ఉన్న పద్దతిలో ఆమూలాగ్ర సంస్కరణలు తీసుకురండి అనే సూచనలు రాలేదు. ఎన్నికలపద్దతిని సంస్కరించండి. దాన్ని సంస్కరించండి, దీన్ని సంస్కరించండి అని మాత్రమే వచ్చాయి. వాటి గురించి ఆలోచించాలి. అవసరమైన సంస్కరణలను తీసుకురావాలని నాకన్నిస్తుంది.
అడిగిన ప్రశ్నలో 'నోటా''కు సంబంధించింది కూడా ఉంది. ఎన్నికల్లో నిలబడిన అయిదు మందిలో ఒక్కరు కూడా నాకు నచ్చలేదనుకోండి. ఆ విషయాన్ని ప్రకటిస్తూ, నమోదు. చేయడాన్ని నోటా అంటున్నాం. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అందుబాటులో ఉన్న వారిలో నుండి సర్వశ్రేష్ఠుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. నూటికి నూరు శాతం సర్వత్రేష్ఠుడు దొరకడం, గగనకుసుమంలాగా, చాలా కష్టం. నేను ఇప్పటి విషయం మాట్లాడటం లేదు మహాభారత కాలం నాటిది చెబుతున్నాను.
'కౌరవపాండవ యుద్ధం దగ్గరపడింది. యాదవుల సభలో, ఎవరిని సమర్థించాలనే విషయం ఆలోచనకువచ్చింది. కొంతమంది కౌరవుల పక్షాన ఉన్నారు. కొందరు పాండవుల పక్షాన ఉన్నారు. కౌరవుల అధర్మం గురించి చర్చ జరుగుతుండగా, కొంతమంది పాండవులేమైనా పులుగడిగిన ముత్యాలా ? ఎవరైనా తమ భార్యను పందెంలో కాస్తారా? వాళ్ళవికూడా అనేక తప్పులున్నాయి, వాళ్ళను ధర్మపరులని ఎలా అనగలం ? అనికొందరు అంటుంటే బలరాముడు, మీరంతా చాలా విషయాలు చర్చించారు అయితే మీ అందరికీ తెలుసు, కృష్ణుడు ఏం చెబితే అదే చేస్తామని; కానీ అతడేమో మౌనంగా ఉన్నాడు, అతడిని అడగండి అంటే కృష్ణుడిని అడగడం జరిగింది. తర్వాతే కృష్ణుడు రాజసభనుద్దేశించి ఉపన్యాసమిచ్చాడు. అందులో ఆయన రాజకీయాలు ఎలాంటివనే విషయంతో ప్రారంభించి, అందులో మీకు నూటికి నూరుశాతం మంచివాళ్ళ దొరకడం చాలా కష్టం అన్నాడు. దొరికితే దొరకవచ్చు 'దీనదయాళ్' లాంటి వాళ్ళెవరైనా ఇది శ్రీకృష్ణుడు చెప్పలేదు. ఇక్కడ నేను చెబుతున్నాను.అయితే దీనికోసం ప్రజలముందు ఒకే ఒక ఉపాయం ఉంటుంది. అందుబాటులో ఉన్నవారిలో శ్రేష్ఠుడిని ఎన్నుకోవాలి. శ్రీకృష్ణుడి మాటలు విన్నాక యాదవులంతా, పాండవుల పక్షాన నిలబడాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మనం నోటాను ఒత్తితే, మనకు అందుబాటులో ఉన్న వారిలో శ్రేష్ఠతమ అభ్యర్థి కూడా గెలుపుకు దూరం కావచ్చు. ఆ లాభం ఉన్నవారిలో నికృష్ణుడైన అభ్యర్థికి లభించవచ్చు. కాబట్టి నోటా సదుపాయం ఉన్న్పటికీ నోటాను ఏమాత్రం వాడకూడదు. అందుబాటులో ఉన్నవారిలో సర్వశ్రేష్ఠమైన వ్యక్తికే ఓటు పడాలి. ఇది నా అభిప్రాయం.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..