డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
: మతం మార్పిడులు :
ప్రశ్న : మతంమార్పిడులు మోసం, బల ప్రయోగం, డబ్బు ద్వారా జరుగుతున్నాయా? దీనికొరకు జాతీయస్థాయిలో చట్టం చేయాల్సిన అవసరముందా? మత - సంప్రదాయాలన్నీ సమానమే అయితే, మతంమార్పిడులను సంఘం ఎందుకు వ్యతిరేకిస్తోంది?
జవాబు : గులాబ్రావ్ మహారాజ్ అనే ఆయన ఉండేవారు. ఆయనను కూడా ఒకాయన ఇలాగే ప్రశ్న అడిగాడు. అన్ని మతాలు - సంప్రదాయాలు సమానమైతే మతమార్పిడులను వ్యతిరేకించడం ఎందుకని ? అందుకాయన ఇలా చెప్పాడు : ఒక వేళ అన్ని మత, సంప్రదాయాలు సమానమే అయితే మతంమార్పిడుల అవసరం ఏమిటి ? ఇటునుండి అటు తీసుకెళ్ళే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ? మత - సంప్రదాయాలన్నీ సమానమే గదా ! ఎవరే మతంలో ఉన్నా, దాన్ని ఆచరిస్తారు. తపస్సు చేస్తారు. వాళ్ళు దాంట్లో పూర్ణత్వాన్ని పొందుతారు. మీరు వారిని ఇటునుండి అటు తీసుకెళ్తున్నారంటే, వారికి ఆధ్యాత్మికతను నేర్పడం మీ ఉద్దేశ్యం కాదు. భగవంతుడు బజారులో అమ్మకానికి దొరకడు.
భగవంతుడు బలవంతం చేయడాన్ని అంగీకరించడు. అలా బలవంతంగా మోసంతో, బలంతో, డబ్బుతో జరుగుతుంటే, అలాంటిది జరగనే కూడదు; ఎందుకంటే వారి ఉద్దేశ్యం మనిషి ఆధ్యాత్మిక ఉన్నతి కాదు; మరింకేదో ఉద్దేశ్యం దాగిఉన్నట్లే. మీరంతా మేధావులే, నేను దీనిగురించి ఎక్కువగా వర్ణించడమెందుకు. మీరు దేశ విదేశాల చరిత్ర చదివి చూడండి, అందులో మత మార్పిడులు చేసే వారి పాత్ర ఏమిటో తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపడతాయి. ఇవి సంఘంవాళ్ళు వ్రాసినవి కావు. సంఘాన్ని వ్యతిరేకించే సిద్దాంతానికి చెందినవారు కూడా దీనిగురించి వ్రాశారు, ఆ వివరాలను చూస్తే మీకు మత మార్పిడులను ఎందుకు వ్యతిరేకించాలో తెలుస్తుంది. సంఘంవాళ్ళే ఎందుకు చేయాలి ? మొత్తం సమాజంలోనే ఇలాంటి మతమార్పిడులపట్ల వ్యతిరేకత వ్యక్తమవ్వాలి. నేను ఎవరిని పూజించాలనేది నాకు మాత్రమే సంబంధించిన విషయం.
నారాయణ్ వామన్ తిలక్ అనే చిత్సవన్ బ్రాహ్మణుడుండేవాడు. మంచి కుటుంబం ఒకరోజు అతడి మనసులో ఏసుమార్గం సరైంది అన్పించింది. దాంతో అతడు తనకు తానే క్రైస్తవుడయ్యాడు. పాస్టర్ కూడా అయ్యాడు. ఆయన భార్యమాత్రం తన మతాన్ని మార్చుకోలేదు. అలాగే ఉండిపోయింది. సంఘం వాళ్ళతో సహా మహారాష్ట్రలో చాలామంది వారిని చాలా గౌరవిస్తారు. ఆయన మతం మారిన విషయం గురించి ఎవరూ చర్చించరు.ఆయన ఎన్నెన్నో, దేశభక్తిపూరిత కవితలు, గేయాలు మనకందించారు, అలాగే సాత్విక జీవితాన్ని సమాజంముందు ఆదర్శంగా ఉంచారు. ఎందుకంటే ఆయన మోసంకారణంగానో, బలవంతంగానో మతం మారలేదు, ఆయన మనసులో మార్పు వచ్చిందంతే! దీన్నికూడా హిందువులు గౌరవిస్తారు. కానీ మతం మార్పిడులలో అలా జరగడం లేదు. చర్చికి రావడానికి ఇంత ఉబ్బిస్తాం అంటున్నపుడు దాన్ని తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిందే! ఆధ్యాత్మికత అమ్మకపు సరుకు కాదు.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..