డా. మోహన్ భాగవత్ జీ |
: పూర్వప్రయత్నం మరియు సంఘస్థాపన :
కొలకత్తాలో త్రైలోక్యనాథ చక్రవర్తి అనే ప్రసిద్ధ విప్లవకారుడు ఉండేవారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చారు. 1989లో మేము డా॥ హెడ్గేవార్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించినపుడు, ఆయనను శతజయంతి ఉత్పవ సమితిలోకి తీసుకోవడానికి మా కార్యకర్తలు ఆయనవద్దకు వెళ్ళారు. ఆయన అందుకు సమ్మతించారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ, “1911లో ఒకసారి డా॥హెడ్గేవార్ మా ఇంటికి వచ్చారు.
ఆ సమయంలో డా|| హెడ్గేవార్, 'ఈ సమాజానికి కొంత శిక్షణ ఇవ్వాల్సిన అవసరముంది, అయితే ఆ శిక్షణ ఇచ్చేంత తీరిక, వెసులుబాటు ఎవరికీ లేదు. అందరూ తమతమ పనులను ఎంపిక చేసుకుని ఉన్నారు. ఈ పని నేనే చేయవలసి ఉంటుందని నాకనిపిస్తోంది.' అన్నారు.” అని వెల్లడించారు. స్వతంత్రదేశం అని పిలిపించు కోపడానికి మన సమాజానికి యోగ్యత లేదు, దానికి ఆ యోగ్యత కలగజేయడానికి పనిచేయాల్సి ఉందనే ఆలోచన అప్పటినుండే ఆయన మనసులో ఉందన్నమాట. అందువల్లే ఆయన ప్రయోగం చేశారు. ప్రశిక్షణలో ఎటువంటి అంశాలు ఉండాలనే విషయమై అధ్యయనం చేస్తూ 7,8 సం||లు ప్రయోగం చేశారు. అనేక సంస్థల పనితీరును చూశారు; వాటిలోనుండి కొంత స్వీకరించి ప్రయోగంచేసే ప్రయత్నం చేసారు. మరికొంత మనసుపెట్టి
ఆలోచించారు. శిక్షణ ఇవ్వడానికి మండలిని ప్రారంభించారు. వార్థాలో రాష్ట్రీయ స్వయంసేవక్ మండలను నిర్వహించారు. సంఘం పేరులోని రెండు పదాలు సంఘ స్థాపనకు 3-4 ఏళ్ళ ముందే ఆయన ఉపయోగించారు. ఇంత ప్రయోగం చేసి మన సమాజాన్ని మేల్కొల్పే ఒక పద్దతిని ఆయన వికసింపజేశారు.
1925 సెప్టెంబర్ 27 శుక్రవారం రోజున, విజయదశమిపర్వదినాన నాగపూర్లో, ఈ పని నేటి నుండి ప్రారంభమవుతోందని ప్రకటించారాయన. ఆనాటికి ఆయనకు ఎంతమంది సహకరించేవారు దొరికితే అంతమందితోనే ఆ పని ప్రారంభించారు. ఈ పని ఇపుడే ప్రారంభమవుతోంది అని తప్ప ఇంకేమీ వారికి చెప్పలేదు. మిగిలినవన్నీ కొత్తకొత్తగా ప్రయోగాలు చేయడంద్వారా వికసితమయ్యాయి. ఇదెలా సాధ్యమైంది అనే దానిలోకి తర్వాత వద్దాము.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..