డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
: అంతర్గత భద్రత :
ప్రశ్న : సంఘం దృష్టిలో అంతర్గత భద్రతకు ప్రముఖ ముప్పు ఏమిటి ? దానికి పరిష్కారం ఏమిటి ? తీవ్రవాదం నేడు అన్నింటికన్నా పెద్ద ముప్పు అయింది. దానికి పరిష్కారం ఏమిటి ?
దేశద్రోహం చేయడానికి ఎలాంటి భయమూ లేదు మరి దీని నెదుర్కొనటానికి కఠినమైన చట్టం ఉండనక్కరలేదా ?
హింసాత్మక తీవ్రవాదంతో ముడివడియున్న కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల
అవసరం లేదా?
జవాబు : అంతర్గత కలహాలనూ, జగడాలను ప్రేరిపించే వారిపట్ల సమాజం ఆకర్షితం కారాదు. దీనికై సమాజ అభివృద్ధి అనేది అన్నిచోట్లకూ చేరాలి. చట్టముల రూపకల్పన పరిపాలన మనదే, అది పారదర్శకంగా ఉంది, బాధ్యతాయుతంగా ఉంది, అని అందరికీ అనిపించాలి. మన జీవితం ఈదేశంలో చక్కగా నడస్తుంది, మనం అభివృద్ది చెందగలం అని దేశప్రజల మనస్సుల్లో విశ్వాసం ఉండాలి- అంతర్గత భద్రతకు కీలకమైన ఈ పనిని ప్రభుత్వము చేయాలి, సమాజం కూడా చేయాలి. ఎందుకంటే, దీనిలోని లోపాలనుండి లాభపడాలని అవకాశాలకొరకు ఎదురుచూసే వ్యక్తులు అన్నిచోట్ల ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. వారి ఆటలు సాగనివ్వరాదు-అన్న కోరిక ఉంటే, మనదేశపు రాజ్యాంగాన్ని, చట్టాలను అమలు చేసే సందర్భాలలో, దానిని బహిరంగంగా వ్యతిరేకించే వారిని అదుపుచేయటమనేది కఠినంగా అమలు చేయాలి. అంతర్గత భద్రత విషయంలో ఇది ముఖ్యమైన అంశం.
అంతర్గత భద్రత గురించి ఆలోచించేటప్పుడు మన సమాజం యొక్క స్థితి ఎలా ఉన్నది అనే ప్రశ్న కూడా పరిశీలించవలసి ఉంటుంది. ప్రభుత్వం నడిచేతీరు సూటిగా బిగువుగా ఉండాలి. సంప్రదింపులు తూటాలతోకాదు, సంభాషణల ద్వారానే జరుగవలవని చెప్పటమేగాక, భారతదేశం ఒక్కటిగా ఉండడం, అఖండంగా ఉండటం అనే దిశలోనే జరగగలవనీ స్పష్టంగా చెప్పగలగాలి. ఈ స్పష్టమైన విధానంతోనే అందరూ ముందుకు సాగాలి. ఇందులో గనక ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనుకకు, మళ్లీ ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనకకు-ఇలా అయ్యేటట్లయితే, దాని ఫలితం ముప్పుతెచ్చేది అవుతుంది. అందువల్ల ప్రభుత్వవిధానంలో-అందరికీ చేరాలని, అందరూ వికాసం చెందాలని, ఈప్రభుత్వము, సమాజమూ మనవి అనే నమ్మకం ప్రభుత్వ
సేవలు, సమాజసేవలూ అందరిలో కలిగించటంతోపాటు ఈ విషయాలుకూడా ఉండటం అవసరమవుతుంది.
ఈ దృష్టితో చట్టాలను రూపొందించి అమలుచేయాలి. ఇప్పుడున్న వాటికంటే కఠినమైన చట్టాలు అవసరమనుకుంటే, తప్పక రూపొందించుకోవాలి. ఇవన్నీ నేను మాట్లాడుతాను అయితే చట్టాలను అమలుచేయటంలో అడ్డుపడుతూ, దేశభద్రతకు ప్రమాదాలను తెచ్చిపెట్టేవారికి, చట్టాలను ఉల్లంఘించేవారికి, దేశద్రోహకరమైన భాషలో మాట్లాడేవారికి వెన్నుదన్నుగా మన సమాజంలోని వారే నిలబడటాన్ని సహించటం ఉండదు అని స్పష్టం చేయటమూ అవసరం. ఇలా వ్యవహరిస్తున్నవారు సమాజంలో ఏకాకులు అయిపోయేవిధంగా సమాజం యొక్క మనఃస్థితి రూపుదిద్దుకోవాలి. ఈపని కూడా పైపనితోపాటు ఏకకాలంలో జరగాలి. అప్పుడే అంతర్గత భద్రత బలంపుంజుకొని పటిష్టంకాగలదు.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..