డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
:హిందుత్వ విషయంలో ఆక్రోశం, హింస:
ప్రశ్న : హిందుత్వం గురించిన వ్యాఖ్యానం ఎంతో శ్రేష్ఠమైనది. అద్భుతమైనది అని చెప్పబడుతున్నా, ప్రపంచమంతటా మరియు భారతదేశంలోనూ హిందుత్వం పేరిట ఆక్రోశం. హింస ఎందుకు కన్నడుతోంది. సంఘం ఈ విషయంలో ఏం చేస్తుంది?
జవాబు : ప్రపంచంలో హిందుత్వంపేరిట ఆక్రోశం మరియు హింస జరగడం లేదు. దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. ప్రపంచంలో హిందుత్వాన్ని అంగీకరించడం పెరుగుతోంది. భారతదేశంలో ఆక్రోశం ఉంది. అయితే భారతదేశంలో ఉన్న ఆక్రోశం హిందుత్వ ఆలోచన కారణంగా కాదు, ఆ ఆలోచనను వదిలేసి గత పదిహేనువందల-రెండు వేల సంవత్సరాలలో మన ఆచరణ ద్వారా ఒక వికృత ఉదాహరణను చూపిన కారణంగా అది వ్యక్తమవుతోంది.
మన విలువల ప్రకారం ఆచరించవలసిన దాన్ని ఆచరించకుండా మనం గ్రంథాలను ఉటంకించడానికి పరిమితమయ్యాం. మూఢాచారులమయ్యాం%B ధర్మంపేరిట మనం చాలా అధర్మానికి పాల్పడ్డాం. అయితే నేటి దేశకాల పరిస్థితి కనుగుణంగా ధర్మాచరణను, ధర్మపు రూపురేఖలు మార్చి ధర్మాన్ని పాటించాలి. ఇది జరిగితే ఆక్రోశమంతా తొలగిపోతుంది. ఎందుకంటే ఆలోచనాపరంగా హిందుత్వ ఆలోచన శ్రేష్టమైంది, ఉదాత్తమైంది, పరిశుద్దమైనది. ఆలోచనకనుగుణంగా నడవడం మనకు అభ్యాసం కావాల్సి ఉంది. సంఘం ఆ పనే చేస్తోంది.
డా. హెడ్డేవార్ ద్వారా ప్రారంభదినాలలో ఇవ్వబడిన బౌద్ధిక్ లు చాలా తక్కువగా లభిస్తున్నాయి, అయితే లభిస్తున్న వాటిలో ఒకటి సిద్దాంతము-ఆచరణ అనే పేరుతో ఉంది. తత్త్వం మరియు వ్యవహారం. అందులో డా॥ హెడ్డేవార్ ఇలా అంటారు, "శ్రేష్టమైన తత్త్వం గురించి కేవలం చెప్పడం వల్ల ఏం వస్తుంది. దాని ప్రకారం వ్యవహరించి చెప్పండి. ఒక తత్తావాన్ని మీరు ఆచరణలోకి తీసుకురాకపోతే, ఆ తత్త్వం ఎందుకు పనికొస్తుంది? తత్త్వం శ్రేష్ఠమైనదైనా, వ్యవహారం తప్పుగా ఉంటే ఆ తత్త్వం ఎందుకు పనికొస్తుంది? కాబట్టి హిందుత్వ విలువల ఆధారంగా మొదట హిందువు సరైన, నిజమైన మంచి హిందువు కావాలి. అందుకోసమే సంఘం పనిచేస్తోంది. అలాంటి సంస్కారాలను ప్రతి వ్యక్తిలో నింపే ప్రయత్నం నిరంతరంగా 92 ఏళ్ళనుండి చేస్తున్నాం.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..