:గోరక్షణ:
ప్రశ్న : గోవు విషయంలో గుంపుదాడి (Mob lynching) సరైందేనా? గోరక్షణ ఎలా జరుగుతుంది.?
గోరక్షా చట్టం అమలు కావటం లేదు., చట్టాలను ఉల్లంఘించి గోవులను రవాణాచేసేవారి పలుకుబడి, తెగువ పెరుగుతున్నవి. గోరక్షణ చేసేవారిపైన దాడులు జరుగుతున్నవి వీటన్నింటికీ పరిష్కారమేమిటి?
జవాబు : గోవు గురించే ఏమిటి, ఏ విషయంలోనైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, హింస, అల్లర్లకు, విధ్వంసానికి పాల్పడటం లాంటివి అత్యంత అనుచితమైన అపరాధాలు. వాటిపట్ల కఠినంగా వ్యవహరించాలి. దోషులకు శిక్షలు పడాలి. కాగా గోవు పరంపరాగతంగా శ్రద్ధకు, విశ్వాసానికి సంబంధించిన విషయంగానేకాక మానబిందువుగానూ భావించ బడుతోంది.
నేను పశువైద్యుడిని. ఆ శాస్త్రాన్ని అధ్యయనంచేసి గ్రహించిన దాని ఆధారంగా చెప్పుతున్నాను. మన దేశంలో చిన్న రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారి ఆర్ధిక స్థితి బలపడడానికి గోవు ఆధారం కాగలదు. మరింకేదీ కాదు. గోవు అనేకరకాలుగా ఉపయోగకరం. ప్రస్తుతం అనేక విషయాలు బహిర్గతమవుతున్నాయి. మొదట తెలియక పోయినా, నేడు విజ్ఞానశాస్త్రం ద్వారా విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి 'గోరక్షణ జరిగి తీరాల్సిందే'. రాజ్యాంగపు మార్గదర్శక సూత్రాలుకూడా ఉన్నాయి. వాటిని పాటించాలి. అయితే గోరక్షణ కేవలం చట్టం ద్వారా జరగదు. గోరక్షణ చేయాలనుకున్న దేశ పౌరులు మొదట గోవును పోషించాలి. గోవుల భద్రతకు, సంరక్షణకు వ్యవస్థ చేయకుండా స్వేచ్ఛగా వదిలేస్తే ఉపద్రవం జరుగుతుంది. గోరక్షణ అంటే శ్రద్ధావిశ్వాసాలకు పరిమితమైన' సమస్యగాకాక, గోసంవర్ధనం (గోవంశ వృద్ధి) గురించీ ఆలోచించాలి. సాధారణ దైనందిన జీవనంలో గోవువల్ల ఎన్ని ఉపయోగాలున్నాయి, వాటిని నేడు ఎలా అమలుచేయవచ్చు. ఎలాంటి సాంకేతికతను ఉపయోగించుకుని ఈ ఉత్పాదనలను ఇంటింటికీ చేరవేయాలి అనే అంశాలపై చాలా మంది పనిచేస్తున్నారు.
గోరక్షణ గురించి మాట్లాడేవారు హింసాత్మకంగా గుంపుదాడికి పాల్చడేవారిలో లేరు. వాళ్ళు సమాజపు మంచికోసం పనిచేస్తున్నారు. సాత్త్వక ప్రవృత్తి ఉన్న వ్యక్తులు వాళ్ళు కేవలం సంఘ స్వయంసేవకులు మాత్రమే కాదు. జైన సమాజమంతా ఈ పనిచేస్తోంది. ఇంకా అనేకమంది కూడా ఉన్నారు. మంచి గోళాలలు నడిపేవారు, భక్తితో నడిపే ముస్లింలు కూడా మనదేశంలో అనేకచోట్ల ఉన్నారు. వీళ్లందరినీ మూకదాడులకు పాల్పడేవారితో కలిపివేయరాదు. వారు చేస్తున్న పనికి ప్రోత్సాహం లభించాలి. ఎందుకంటే ఇది మనదేశపు సామాన్య వ్యక్తి హితానికి సంబంధించిన పని, మనదేశపు ఆర్థికవ్యవస్థలో ఒక పెద్ద ఆధారం అవుతుంది. గోవుల దొంగలు, దొంగచాటుగా రవాణా చేసేవారు దాడులకు పాల్పడతారు, హింసకు పాల్పడుతారు. దీనిగురించి ఎవరూ మాట్లాడటం లేదు, ఈ ద్వంద్య ప్రవృత్తిని వదిలిపెట్టాలి. గోవు విషయంలో గోవులవల్ల ఎన్నిరకాల ఉపయోగాలున్నాయో తెలియజెప్పి ప్రజలలో చైతన్యం తీసుకురావడమే వీటన్నింటికీ పరిష్కారం అవుతుంది. ఈ చైతన్యం వస్తోంది,పెరుగుతోంది. అన్ని విషయాలగురించి పరిశోధనా పత్రాలు వెలువడుతున్నవి. గో సంరక్షణ గురించి పనిచేసేవారు సాత్విక ప్రవృత్తితో ఈ పనిని వృద్ధి గావిస్తున్నారు. వీరిని హింసాత్మక శక్తులతో ముడి పెట్టి మాట్లాడటం తగదు. గోవు సాన్నిధ్యంలో ఉన్నవారి ప్రత్యక్ష అనుభవం ఏమిటంటే, గో సంరక్షణను స్వహస్తాలతో చేసేవారిలో అపరాధ ప్రవృత్తి తగ్గిపోతుంది. జైళ్ళలోని గోశాలల్లోనూ ఈ ప్రయోగం చేస్తున్నారు. దీనివల్ల దేశంలో నేరాలు కూడా తగ్గిపోతాయని నాకన్పిస్తుంది.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం - డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..