డా. మోహన్ భాగవత్ జీ |
కుల వ్యవస్థ - సమరసత:
ప్రశ్న : మొత్తం హిందూ సమాజంలో సమరసత కోసం సంఘం ఏం చేస్తుంది? కులాంతర వివాహం లేదా మతాంతర వివాహం విషయంలో సంఘం ఎలా ఆలోచిస్తుంది? హిందూ సమాజం కులాలుగా చీలిపోకూడదనే నిర్ణయానికి రావడం సాధ్యమేనా?
జవాబు : ఆహారం, వివాహం (రోటీ-బేటీ) విషయంలో సమరసతను మేము పూర్తిగా సమర్థిస్తాము. అయితే ఆహారం విషయంలో దీన్ని పాటించడం చాలా సులభం మనమందరం సులభంగా దీన్ని పాటించవచ్చు, అయితే చాలామంది నేడు దీనిని తమ కర్మకాలి దాపురించిన తప్పనిసరి వ్యవహారమనుకుంటూ ఉన్నారు. కాగా ఈ పని మనసు పెట్టి చేయాల్సినది, దాని అవసరమూ ఉంది. విషయాన్ని అర్ధం చేయించడం సరైన పద్దతిలో చేయాల్సి ఉంది. కాగా వివాహ విషయం కొంత కష్టమైనది. కాబట్టి ఇందులో కేవలం సామాజిక సమరసత అనే ఆలోచన మాత్రమేగాక, కుటుంబాలు కలవడం అనే విషయంకూడా మిళితమై ఉంది. వధూరులు ఒకరికొకరు నచ్చాల్సిన అంశమూ ఉంది. వీటన్నింటినీ సరిచూసుకుని మనం దీన్ని సమర్థించాల్సి ఉంటుంది.
మహారాష్ట్రలో మొదటి కులాంతర వివాహం 1942లో జరిగింది. మొట్టమొదటిది కావడమేగాక, విద్యావంతులైన వారి మధ్య జరగడంతో, అది ప్రసిద్ధి పొందింది. ఆ సమయంలో, ఆ వివాహానికి
శుభాకాంక్షలు తెలిసినవారిలో పూజనీయ శ్రీ బాబాసాహెబ్ అంబేడ్కర్, పూజనీయ శ్రీ గురూజీ కూడా ఉన్నారు. శ్రీ గురూజీ తమ సందేశంలో, మీ వివాహం కేవలం శారీరక ఆకర్షణకోసం మాత్రమేకాక సమాజంలోని మనమంతా ఒకటే, కాబట్టి మేం వివాహం చేసుకుంటున్నామని ప్రకటించగలగాలి అని వ్రాశారు. అలాగే మీ ఈ నిర్ణయానికి నేను మమ్మల్ని అభినందిస్తున్నాను మరియు మీ దాంపత్యజీవితంలో అన్నీ శుభాలే కలగాలని కూడా కోరుకుంటున్నాను అని వ్రాశారు.
మనిషికి మనిషికి మధ్య తేడా చూపరాదు. రుచి, అరుచి అనేవి ఎవరికి వారికి వేర్వేరుగా ఉంటాయి. జీవితాంతం కలసి ముందుకు సాగాలి. వారిరువురూ సరిగా ముందుకు సాగుతారా లేదా అనేది మాత్రమే చూడాల్సి ఉంటుంది. కులాంతర వివాహం విషయంలోనూ మా సమర్థన ఉంది. భారతదేశంలో కులాంతర వివాహాలను లెక్కబెట్టితే, అందులో అలా చేసుకున్న వారిలో స్వయంసేవకుల శాతమే ఎక్కువగా ఉంటుందని నేను అపుడపుడూ చెబుతూనే ఉన్నాను. ఈ రోటీ బేటీ వ్యవహారాల సంఖ్య పెంచడంతోనే సమస్య పరిష్కారమైపోదు. అంటే కేవలం పెళ్ళి చేయడమో లేక కలసి కూర్చొని భోజనం చేయటమో వీటికే పరిమితమైన పైపైకి కన్పించే విషయం మాత్రమే కాదు మనముందున్న సమస్య జీవితంలోని ప్రతి పనిలో సమాజాన్ని ఎలాంటి తేడా లేకుండా చూడగల్గడం, పైకి కనబడని మానసికమైన తేడాలనుసైతం దూరం చేయడం లాంటివి చేస్తేనే హిందూసమాజం కులాలవారీగా చీలిపోకుండా దాన్ని సుస్థిరంగా ఉంచగలము.
అది చీలిపోదని నేను నమ్ముతున్నాను. దానికై ప్రతి హిందువు ఆత్మసౌక్షిగా, ఏకాత్మభావన పట్ల విశ్వాసం వ్యక్తం చెయాలి, మనిషి శరీరము, మనస్సు, బుద్ధి అనేవి ఆత్మనుండి విడివడి ఎక్కువసేపు నడవలేవు. ఆ ఆత్మ తక్షణమే దేశం, కాలం, పరిస్థితులకనుగుణంగా తప్పనిసరిగా
తగినవిధంగా కొత్త శరీరాన్ని దర్శిస్తుందనే విషయంలో నాకు సంపూర్ణ విశ్వాసముంది కాబట్టి మేము హిందువులందరినీ సంఘటితం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విశ్వాసంతోనే మేం పనిచేస్తున్నాము. సంఘం ప్రారంభమైన రోజుల్లో ఇలాంటి విశ్వాసం ఇతరులకెవరికీ లేదు. భుజాలపై అయిదవ వ్యక్తి (శవం) లేకపోతే, ఈ సమాజంలోని నలుగురు వ్యక్తులు ఒకే దిశలో కలసి నడవలేరు. అలాంటి సమాజాన్ని మీరు ఎలా సంఘటితం చేస్తారు. అని చాలామంది డా|| హెడ్డేవార్ ను ప్రశ్నించారు. అయితే దాన్ని మేము సాధించడాన్ని మీరంతా చూస్తున్నారు. అందువల్ల ఇది తప్పనిసరిగా జరుగుతుంది. ఇది సాధ్యమవుతుందని మేము చేసి చూపించాము. ఇది జరిగి తీరాల్సిందే, మేము చేయగలం కూడా.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..