డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
హిందుత్వానికి సంబంధించినవి:
ప్రశ్న : హిందుత్వాన్ని హిందూయిజం అనవచ్చా ? దేశంలోని ఇతర మత సంప్రదాయాలతో హిందుత్వం కలవడం సాధ్యమవుతుందా ? జనజాతులతో కూడిన సమాజం కూడా హిందువులేనా?
జవాబు : హిందుత్వం అంటే హిందూ తత్త్వం Hinduness, హిందూయిజం అనేది తప్పుడు పదం, ఎందుకంటే ఇజం అనేది బంధిత వస్తువుగా గుర్తింపబడుతుంది, అలాంటి ఇజం అనేదేదీ లేదు. ఇదొక ప్రక్రియ. అది కొనసాగుతూ వస్తున్నదంతే! సత్యమనే దాని గురించిన నిరంతరం వెదుకులాట పేరే హిందుత్వం అన్నారు గాంధీజీ. డా॥ రాధాకృష్ణన్ చెప్పిన ఒక గొప్ప వ్యాఖ్యానం ఇలా ఉంది : Hinduism is a movement not a position; a process not a result; a growing tradition not a fixed revelation. Its past history encourages us to believe that it will be found equal to any emergency
that the future may throw up, whether in the field of thought or of history" (Hindu View of life P:95).
(హిందుత్వమనేది ఒక ఉద్యమం, ఒక స్థాయి కాదు; నిరంతరం కొనసాగే ప్రక్రియ ఫలితం కాదు; విస్తరిస్తున్న ఆచారం, బిగుసుకుపోయిన సాక్షాత్కారం కాదు. దాని గత చరిత్ర మనల్ని ఉత్తేజపరచి, ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా అది ఒకే రకంగా కన్నడుతుందనే విశ్వాసాన్ని కల్గించి, అటు ఆలోచనా రంగంలోనైనా, చారిత్రక రంగంలోనైనా భవిష్యత్తును చూపుతుంది.) హిందుత్వమనేది నిరంతరం కొనసాగుతుండే ప్రక్రియ, అన్నింటికంటే గతిశీలమైనది. అందులో భారతదేశంలో జన్మించిన మేధావులందరి భాగస్వామ్యమూ ఉంది. కాబట్టి హిందుత్వాన్ని హిందూయిజం అనకూడదన్నది నా అభిప్రాయం.
ఇతర మత సంప్రదాయాలతో కలసిపోగల్గిన ఏకైక ఆలోచన, అందులోనూ భారతీయ ఆలోచన అనేదేదైనా ఉంటే అది హిందుత్వ ఆలోచన మాత్రమే. అలా కలగలసిపోవడానికి ఆధారం 'మూలంలో ఏకత్వం', పద్ధతులు వేర్వేరుగా ఉండడం తప్పనిసరి. ఎందుకంటే ప్రకృతి వైవిధ్యంతోనే నడుస్తుంది. వైవిధ్యమనేది తేడా కాదు, వైవిధ్యం అలంకారు అవుతుంది. ఇలాంటి సందేశమిచ్చేది మరియు సందేశమంటే కేవలం సిద్ధాంత ఆధార మీద కాకుండా, అనుభూతి ఆధారంగా ఇచ్చే ఏకైక దేశం మనదేశమే. అందువల్లే పిందుత్వమే మిగతా వాటన్నింటితో కలబోతకు ఆధారమూ అవుతుంది.
జనజాతీయ సమాజం కూడా హిందువులే, మా దృష్టిలో జాతీయత అంటే ఏమిటో నిన్నటి రోజున వివరించాను. ఆ ప్రకారంగా జనజాతి సమాజం కూడా హిందూ సమాజమే అవుతుంది. భారతదేశంలో నివసించే ప్రజలంతా గుర్తింపుదృష్ట్యా జాతీయతదృష్టా హిందువులే అవుతారు. ఇది కొంతమంది గుర్తించి గర్వంగా చెప్పుకుంటారు, కొందరు గుర్తించినా గర్వంగా భావించరు. అవును, అంతే అని మాత్రమే అంటారు. ఇంకొందరు గుర్తించినా, ఇతర కారణాలవల్ల చెప్పడానికి సంకోచవడతారు. మరికొందరు తెలియకపోవడంవల్ల, ఏమీ చెప్పలేరు.
భారతదేశపు ప్రాచీన దర్శనం మరియు ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చిన ఆలోచన రకరకాల రూపాలలో అన్నింటా ప్రకటితమైంది; ఆయా రూపాలలో రకరకాల వైవిధ్యాలున్నా అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్లనిపించినా, అవి సమానమైన విలువలను కలిగిఉన్న దర్శనాలే. అలాంటి విలువల ప్రారంభం మన జనజాతి బంధువులు మరియు పామరుల జీవితాలనుంచే జరిగింది. ఆ రకంగా వాళ్లు మన పూర్వీకులు. ఈ విధంగానే వాళ్ళను చూడాలి. అలాగే వారి స్థితిగతులను, సమస్యలనుగురించి ఆలోచించాలి. వాళ్ళంతా మనవాళ్ళే. భారతదేశంలో పరాయివాళ్ళెవరూ లేరు, పరాయితనాన్ని మనమే ఏర్పరచుకున్నాం తప్ప అది మన పరంపరలో లేదు. అది ఏకత్వాన్ని మాత్రమే నేర్పుతుంది.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..