డా|| హెడ్గేవార్ జి |
సంఘ సంస్థాపకులు డా|| హెడ్గేవార్
సంఘం గురించి తెలుసుకోవాలంటే మొదట డా॥ హెడ్గేవార్ గురించి తెలుసుకోవడం అవసరం. ఆయన సంఘ సంస్థాపకులు. డాక్టర్ హెడ్గేవార్ సంఘాన్ని మట్టిలో బీజరూపంలో నాటి వృక్షరూపంలోకి మార్చారు అని సంఘంలో మేము చెప్పుతూఉంటాం. జరుగుతుంది. కాబట్టి సంఘంలోని అన్ని పనులలో డా|| హెడ్గేవార్ మనస్తత్వం ప్రతిఫలిస్తూ కన్పడుతుంది. డా॥ హెడ్గేవార్ ను గురించి తెలుసుకోకుండా సంఘాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం; సాధ్యం కాదు. నేడు గనుక మనం సంఘాన్ని చూస్తే హెడ్గేవార్ మనసులో ఏముండిందనే విషయం తెలుస్తుంది. కాబట్టి తెలుసుకోవాలనుకునేవారు అక్కడి నుండి మొదలుపెట్టవలసి ఉంటుంది.
నాగపూర్'లోని ఒక దిగువ మధ్య తరగతికి చెందిన, పౌరోహిత్యంపై ఆధారపడి ఉదరపోషణ చేసుకునే వైదిక కుటుంబంలో డా|| హెడ్గేవార్ జన్మించారు. ఇంటి పరిస్థితి ఏమంత సంపన్నమైనది కాదు. ముగ్గురు అన్నదమ్ములలో ఆయన అందరికన్నా చిన్నవాడు. ఆ సమయంలో స్వాతంత్ర్యం సాధన అనే విషయం సమాజంలో వినబడుతుండేది. ఆంగ్లేయుల రాకకు ముందు నాగపూర్ భోంస్లే రాజుల పాలనలో ఉండేది. రాజ్యాన్ని భోంస్లేరాజునుండి ఆంగ్లేయులు ఎలా స్వాధీనం చేసుకున్నారనే విషయం కళాకారులైన వ్యక్తులు దేవాలయాల్లో కథలు చెప్పే వ్యక్తులు ఏదో ఒక సందర్భంగా ప్రస్తావిస్తుండేవారు. ఇలాంటి వాతావరణంలో బాల్యంనుండే డా||హెడ్గేవార్ మనం స్వతంత్రులం కావాలనే కోరికతో పెరిగి పెద్దవాడయ్యాడు
మొదటి భాగంలో 'భవిష్య భారతం' - డా. మోహన్ భాగవత్ జీ మొదటిరోజు ఉపన్యాసం 🖜
మొదటి రోజు ఉపన్యాసం: