డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
: 370వ అధికరణం మరియు 35ఎ ప్రకరణం :
ప్రశ్న : 370వ అధికరణ మరియ 35ఎ ప్రకరణానికి సంబంధించి సంఘం అభిప్రాయం ఏమిటి ?
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించాలా ?
కాశ్మీర్లోయలో దారితప్పిన యువకులలో జాతీయ భావన పెంపొందించడానికి సంఘం చేస్తున్న ప్రయత్నం ఏమిటి ?
జవాబు : 370వ అధికరణ మరియ 35ఎ ప్రకరణం విషయంలో మా ఆలోచన సర్వవిదితం. మేము వాటిని గుర్తించం. అంటే అది ఉండకూడదని మా అభిప్రాయం. కారణాల్లోకి వెళ్తే చాలాసేపు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఒక వాక్యంలో చెబుతాను. ఆ విషయం అనేక ఉపన్యాసాలలో మేము చెప్పిందే. దానికి సంబంధించిన పుస్తకాలు కూడా దొరుకుతున్నాయి. వాటన్నింటినీ 'సురుచి ప్రకాష్'కు వెళ్ళి చూడవచ్చు.
రాష్ట్రం ఏర్పాటు, విభజన మొదలైన విషయాలు, వాటి వెనుక ఉండే ఆలోచన ఎలా ఉండాలి దేశ అఖండత్వం, ఏకాత్మత, రక్షణ మరియు పరిపాలనా సౌలభ్యం లాంటివి పరిగణనలోకి తీసుకోవాలి. దీన్ని గుర్తించి, మూడుప్రాంతాలు చేయాలని భావిస్తే ఆ సమయానికుండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏ అవసరం లేదనుకుంటే, అదలాగే ఉంటుంది. అయితే జమ్ము, లడాఖ్, కాశ్మీర్లోయ నేటికి కూడా భారత్ వద్దే ఉన్నాయి.(కాశ్మీర్ కు చెందిన ఆక్రమిత కాశ్మీర్ నేటికీ అటువైపే ఉంది) కనీసం ఈ మూడింటిమధ్య భేదభావాలు లేని అన్నింటినీ అభివృద్ధి చేసేలా పరిపాలన సాగుతోందా? దీని గురించి ఆలోచించాలి దాంతోపాటు ఈ మూడు ప్రాంతాలు భారత్ లో కలిసి ఉండేందుకు ఏకాత్మత, అఖండత, రక్షణ విషయాలలో అక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అనే విషయమూ ఆలోచించాలి. ఆ ఆలోచన చట్టమూ, ప్రభుత్వమూ చేయాలి. ఆలోచన వస్తే నిర్ణయమవుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే పరిపాలన ఎలా ఉండాలంటే, రక్షణ ఉండాలి. భద్రతా దళాలు, చట్టము, సంవిధానము ఇవన్నీ కాపాడుతూనే వుంటేనే రక్షణ ఉంటుంది. పై మూడింటికంటే మించి సమాజమూ రక్షణగా ఉంటుంది. అలాంటి సమాజం ఉండాలి.
దారితప్పిన యువకులకోసం ఏదైనా చేయాలని మీరడిగింది సరిగా సమంజసంగా ఉంది. నిజానికి మేము ఆ పని చేస్తున్నాము. నేను మళ్ళీ చెబుతున్నాను, మేము చేస్తున్నామని. చెప్పినపుడల్లా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేవలం శాఖలు మాత్రమే నడుపుతుంది, ఇంకేమీ చేయదు. ఏమైనా చేయాలని కూడా ఏదీ లేదు. అయితే మావద్ద తయారైన స్వయంసేవకులు సమాజంకోసం ఏమేం అవసరమో, అవి చేయడానికి పరుగులు తీస్తారు.అలంటి యువకులు అక్కడ సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఏకల్ విద్యాలయాలు నడుపుతున్నారు. అందులో జాతీయత వందేమాతరం, జాతీయగీతం చెప్పబడుతుంది. రిపబ్లిక్ దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం కూడా నిర్వహించబడుతాయి. అక్కడి విద్యాలయాలకు వచ్చే విద్యార్థులు మరియు వారి పోషకుల సహకారం, సమర్థన మాకు లభిస్తోంది. మెల్లమెల్లగా ఈ పని పెరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రయత్నం దీనికన్నా ముందెన్నడూ జరగలేదు, ఇపుడే ప్రారంభమైంది. దాని ఫలితం లభించడానికి సమయం పడుతుంది.
అయితే అందుకుగాను మేమేమీ చేయలేదనేమీ లేదు. మా విధివిధానాలను తెలిపే ఉపన్యాసమని మీరు భావించే విజయదశమి ఉపన్యాసంలో, మిగిలిన విషయాలలాగే దీని గురించి కూడా ఆలోచించాలి అని చెబుతాను. కాశ్మీర్లోని సాధారణ సమాజం మిగిలిన భారతదేశంతోపాటు తాదాత్మ్యం చెందడం, వారితో కలవడం, కలపడం కూడా జరగాలి. ఇదంతా నేనెప్పుడు చెబుతానంటే, పని అంతకన్నా ముందే మొదలై ఉంటేనే. ప్రారంభం కాకపోయి ఉంటే దాని గురించి మేము మాట్లాడము. అది జరుగుతోంది, పెరుగుతోంది కూడా. విస్తరణ జరిగి మరియు తగినంత బలోపేతం అయ్యాకనే దాని గురించి చెబుతూ ఉంటాం.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..