బాబ్రీ కట్టడపు కూల్చివేత కేసులో ఉత్తరప్రదేశ్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మురళీ మనోహర్ జోషి, ఎల్ కె అద్వానీ, ఉమా భారతి, రామమందిర ట్రస్ట్ అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ లతోపాటు మొత్తంగా 32 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేత ముందస్తు ప్రణాళికతో జరిగినది కాదని, ఇందులో ఎలాంటి కుట్ర జరగలేదని స్పెషల్ కోర్టు జడ్జి సురేందర్ కుమార్ యాదవ్ తీర్పులో వెల్లడించారు. .
ఈ కేసును సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయమూర్తిని ఆదేశించింది. ఈ మేరకు తీర్పు సమయంలో ప్రస్తుతం ఉన్న 32 మందిని కోర్టులో హాజరు కావాలని సెప్టెంబర్ 16న న్యాయమూర్తి ఆదేశించారు. అయితే వయోభారం, కరోనా కారణంగా అద్వానీ,మురళీ మనోహర్ జోషి, మహంత్ కోర్టుకు హాజరు కాలేకపోయారు. ఉమాభారతి కళ్యాణ్ సింగ్ లకు కరోనా సోకడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీర్పు సమయంలో వీరంతా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనగా, మిగతావారంతా కోర్టులో హాజరయ్యారు.

వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేసేందుకు 1992లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా మొత్తం 49 మంది ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే కేసు విచారణలో ఉండగానే 17 మంది మరణించారు. మిగిలిన వారిపై అభియోగాలు నమోదు చేయడానికి సుప్రీంకోర్టు 2017 ఏప్రిల్ లో సీబీఐకి అనుమతి ఇచ్చింది. కేసును రెండేళ్లలో ముగించాలని సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించగా సెప్టెంబర్ 30 2020 న జరిగిన విచారణలో వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఎలాంటి కుట్ర జరగలేదని, ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చి వేయకుండా ఆపడానికి ప్రయత్నించారని కోర్టు గుర్తించింది. ఆరోపణలను నిరూపించడంలో సీబీఐ విఫలమైందని కోర్టు తెలిపింది.
SOURCE : OPINDIA
తీర్పుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హర్షం:
బాబ్రీ కట్టడం కూల్చివేత కేసులో సీబీఐ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హర్షం వ్యక్తం చేసింది. వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్నవారందరినీ నిర్దోషులుగా గుర్తిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్ట్ ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నామని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ చేసిన ప్రకటనను సంఘ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్ చేసింది.