ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ జి |
స్వతంత్రత, స్వావలంబన కలిగిన వివిధ సంస్థలు
భవిష్యభారతం:
ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి
ఉపన్యాస మాలిక..
ఈ కార్యపద్దతిలో రెండు విషయాలున్నాయి. ఒకటేమో కంట్రోల్ (అదుపు) సంఘ స్వయంసేవక్, సంఘంయొక్క స్వయంసేవక్ అవుతాడు. అతడు తన మిగిలిన జీవితంలో ఏం చేస్తాడు? ఎలాంటి సార్వజనిక కార్యం చేస్తాడు? అది వాళ్లే ఆలోచిస్తారు వాళ్లు ఏం కోరుకుంటే అది చేస్తారు. ఫలానా రంగంలో పనిచేయండి అని మేము వారికి చెప్పడం జరగదు. వాళ్లే స్వయంగా వారి కార్యక్షేత్రాన్ని ఎంపిక చేసుకుంటారు.
నేడు సంఘ స్వయంసేవకులు అనేకరంగాలలో పనిచేస్తున్నారు. స్వయంసేవకులు చురుకుగా పనిచేసే ఈ సంస్థలన్నీ, నిర్ణయాల దృష్ట్యాగానీ, విధానాలధృష్టాగానీ' స్వతంత్రమైనవి. 'వ్యవస్థదృష్ట్యా' కూడా స్వావలంబనం కల్గినవి. వాళ్లు స్వయంసేవకులు సంఘం ద్వారా సిద్దాంతాన్ని స్వీకరిస్తారు. ఎలాంటి తప్పు లేకుండా ఉండాలనే సంఘం ఆలోచిస్తుంది. అయితే వారి కార్యక్షేత్రాలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది వాళ్ల నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడువారు అనుభవం, నైపుణ్యం కలిగిన వారైనందున సంఘం సలహా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ సంస్థలన్నీ స్వతంత్రమైనవి, స్వావలంబనతో పనిచేసేవే. సంఘ స్వయం సేవకులు కాబట్టి వారు రావడం పోవడం, కలవడం, కష్టసుఖాలు మాట్లాడుకోవడం, మంచి పనులలో ఒకరినొకరు సహాయపడటం జరుగుతాయి. మంచి పనులలో ఇతరులకు సహాయపడటం అనేది అందరికీ ఆమోదయోగ్యం. అది ఫలానా సంస్థలకు మాత్రమే అనేదేమీ లేదు. మంచిపనిలో ఎవరు జోడింపబడి ఉన్నా, మా కున్న పూర్తిశక్తితో మేము వారికి మద్దతునిస్తాము. మాకు ఆలోచనాధారతో సంబంధం ఏమీ లేదు. అలాగే వారికి సంఘంపట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది అనే విషయంలోనూ ఎలాంటి సంకోచం లేదు. వాళ్లు మంచిపని చేస్తున్నారు, నిజాయితీతో పనిచేస్తున్నారంటే, అక్కడున్న మా స్వయంసేవకులు తప్పక మద్దతు ఇస్తారు.
ఏకరూప విధానం (కామన్ పాలసీ) నిర్ణయం చేయడం కోసం సమన్వయ బైఠక్ జరగదు. వేర్వేరు కార్యక్షేత్రాలలో వేర్వేరు ప్రభావాలమధ్య పనిచేసే సమయంలో వారి సంస్కారాలను గుర్తుచేసుకోవడానికి, మధ్యమధ్యన సంఘ వాతావరణంలో కాసింత సమయం గడపడానికిగాను సమన్వయ బైఠక్ జరుగుతుంది. అక్కడ వారు మాట్లాడుతారు, చర్చిస్తారు, ఆలోచనలను ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఆ ఆలోచనలనే వారు అనుసరించాలనే నిర్భంధమేదీ లేదు. అది వారికి సంబంధించిన విషయం.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం: డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక .