డా. మోహన్ భాగవత్ జీ |
- స్వావలంబనం కల్గిన సంస్థ -
అయితే కొన్ని కార్యక్రమాలకోసం డబ్బు ఖర్చుచేయాల్సి వస్తుంది. మా సంస్థ స్వావలంబనంతో కూడినది. చేయవలసిన ఖర్చుకొరకు డబ్బును మేమే సమకూర్చుకుంటాము. సంఘకార్యం నడపడానికి మేము ఒక్కపైసా కూడా బయటివాళ్ళ నుండి తీసుకోము, ఎవరైనా వచ్చి ఇచ్చినా మేము దాన్ని తిరిగి ఇచ్చేస్తాము. రా.స్వ.సంఘ స్వయం సేవకుల గురుదక్షిణమీద నడుస్తుంది. సంవత్సరంలో ఒకసారి గురువుగా భావించే భగవాధ్వజానికి పూజచేసేటపుడే దక్షిణ సమర్పిస్తారు.
గురువుగా భగవాధ్వజం ఎందుకు ? ఎందుకంటే అది అనాది నుండి నేటివరకూగల పరంపరకు చిహ్నంగా ఉంది. చరిత్ర విషయం వచ్చినపుడల్లా భగవాధ్వజం ప్రస్తావన వచ్చి తీరుతుంది. గతంలో స్వతంత్ర భారతదేశపు జెండా ఎలా ఉండాలనే విషయంలో ఫ్లాగ్ కమిటీకూడా తామిచ్చిన నివేదికలో అందరికీ సుపరిచితమైన, గౌరవాన్వితమైన భగవాధ్యజాన్నే ఎంపిక చేసింది. అయితే తర్వాత అందులో మార్పు వచ్చింది, త్రివర్ణ పతాకం మన జాతీయ జెండా అయింది. మేము దానిపట్ల కూడా పూర్తి గౌరవం చూపుతాము. శాఖలో భగవాధ్వజాన్ని ఎగురవేస్తారు, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయరెందుకు? అని కొందరు ప్రశ్నిస్తుంటారు.
త్రివర్ణ పతాకం అవతరించిననాటి నుండి దాని గౌరవంతో సంఘ స్వయంసేవకులు జోడింపబడినారు. నేను మీకొక నిజమైన సంఘటనను తెలియజేస్తున్నాను. నిర్ణయమైన కొత్తలో అప్పటికి జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకంలో చక్రం లేదు, చరఖా ఉండింది. మొదటిసారి ఫైజాపూర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో ఆ జెండాను ఎగురవేయడం జరిగింది. ఎనభై అడుగుల ఎత్తున్న ధ్వజస్తంభాన్ని, ఏర్పాటు చేయడం జరిగింది. నెహ్రూ ఆ సమావేశాలకు అధ్యక్షుడు. జెండా మధ్యలో ఇరుక్కుపోయింది. పూర్తిగా ధ్వజస్తంభం పైకి వెళ్లలేకపోయింది. అంత పైకి ఎక్కి దాన్ని సరిచేసేంత సాహసం ఎవరూ చేయడం లేదు. అంతలో జనసమూహం నుండి ఒక యువకుడు పరిగెత్తుకుంటుూ వచ్చి గబగబా ఆ స్తంభంపైకి ఎగబ్రాకాడు. ముడిపడి ఉన్న త్రాడును విడదీసి, జెండా పైకివెళ్లేలా చేసి క్రిందికి దిగివచ్చాడు. సహజంగానే అదంతా చూసిన కార్యకర్తలు అతడిని భుజాల పైకెత్తుకుని నెహ్రూ వద్దకు తీసుకొచ్చారు. నెహ్రూ అతడి వీపును చరుస్తూ, నువ్వు సాయంత్రం సమావేశాలకు రావాలి, అందులో నీకు అభినందన
కార్యక్రమం జరుపుతాం అన్నాడు. అయితే అంతలో కొందరు నాయకులు ఆయనతో అతడిని పిలవకండి. అతడు సంఘశాఖకు వెళ్తాడు అన్నారు. అతడే జలగాంలోని పైజ్ పూర్లో నివసించే శ్రీ కిషన్ సింహ రాజపూత్ అనే స్వయంసేవక్. (అయిదారేళ్ల క్రితమే అతడు స్వర్గస్థుడయ్యాడు.) డా|॥ హెడ్గేవార్ విషయం తెలిసి అక్కడికి పర్యటనకు వెళ్లాడు. అతడికి ఆయన ఒక చిన్న వెండి గ్లాసును బహుమానంగా ఇచ్చి అభినందించారు. అలా త్రివర్ణపతాకం మొదటిసారిగా ఎగురవేసినప్పటి నుండి దాన్ని గౌరవించే విషయంలో స్వయం సేవకులు జోడింపబడి ఉన్నారు.
మొదటిసారిగా సంపూర్ణ స్వాతంత్య్రం అనే తీర్మానాన్ని కాంగ్రెస్, లాహోర్ సమావేశాలలో చేసినప్పుడు డాక్టర్ జీ ఒక సర్యులర్ను అన్ని శాఖలకు పంపించి, కాంగ్రెస్ ను అభినందించే తీర్మానాన్ని, అన్ని శాఖలలో అంగీకరింపచేసి, దాన్ని కాంగ్రెస్ కమిటీకి పంపేలా చేశారు. ఇది 1930 నాటి సంగతి. డా|॥ హెడ్గేవార్ జీవితంలో దేశపు పరమవైభవం, దేశ స్వాతంత్య్యం అనేవే జీవన గమ్యాలుగా ఉండేవి. సంఘానికి మరింకే కోరిక ఉంటుంది? కాబట్టి మన స్వాతంత్ర్యానికి ఎన్ని ప్రతీకలైతే ఉన్నాయో వాటన్నింటిపట్లా స్వయంసేవకులు అత్యంత శ్రద్ధా గౌరవాలు చూపుతారు. ఇది కాక మరే విషయమూ సంఘంలో నడవదు.
అలా, ఆ భగవాధ్వజాన్ని మేము గురువుగా భావించి, దాని ముందు గురుదక్షిణ సమర్పిస్తాము; అలా వచ్చిన దాంతోనే మేము మా ఖర్చులను చేస్తాము. నేటికీకూడా ఈ పరిస్థితే ఉంది. సంఘం నేడు ఇంతగా విస్తరించింది, ప్రసిద్ధి పొందింది. ఎంతోమంది సంఘ స్వయంసేవకులు బాగా సంపాదించేవారైనా, నాకు తెలిసి మార్చినుండి జులై నెలవరకూ ఖర్చులను నిర్వహించడంలో కాస్త ఇబ్బంది వస్తూనే ఉంటుంది. సేవకు సంబంధించి అనేక పనులు మా స్వయంసేవకులు చేస్తున్నారు. వాటికోసం సమాజం నుండి సహాయం పొందుతారు; దానికొరకు వాళ్లు ట్రస్టులు ఏర్పాటు చేశారు. చట్టప్రకారం క్రమబద్దంగా నిధులను సేకరిస్తారు. వాటికి సంబంధించి జమా ఖర్చులను సిద్ధంగా ఉంచుతారు. చట్టప్రకారం అవి ఏ పద్ధతిలో ఉండాలో అదే ప్రకారం తయారుచేస్తారు. అయితే సంఘం మాత్రం బయటి నుండి ఒక్కపైసా కూడా తీసుకోదు. ఇచ్చినా కూడా తీసుకోదు. సంఘాన్ని నిర్వహించే బాధ్యత సంఘ స్వయంసేవకులదే. ఇలాంటి
స్వావలంబన కల్గిన మా సంస్థ సంస్కారాలనిచ్చే పని చేస్తున్నది.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం: డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
{full_page} భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక .