ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ జి |
సంఘంలో మహిళల స్థానం
భవిష్యభారతం:
ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి
ఉపన్యాస మాలిక..
రెండవ విషయం ఏమిటంటే, సంపూర్ణ హిందూ సమాజాన్ని, సంఘటితం చేసున్నామంటే, మరి మహిళల విషయమేమిటి? ఈ ప్రశ్నను 1931లోనే డా॥|హెడ్దేవారని ఒక మహిళ అడిగింది. మీరేమో హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తున్నామంటున్నారు. కానీ 50 శాతమున్న మహిళలను అలాగే వదిలేశారేమిటి అని! అప్పుడు డా॥ హెడ్గేవార్ ఆమెతో, మీరు చెప్పిన విషయం సరైనదే. కానీ నేడు మగవాళ్లు వెళ్లి మహిళల మధ్య పనిచేయడానికి సరైన వాతావరణం లేదు. అలా చేయబోతే అనేకరకాలైన తప్పుడు భావనలకు అవకాశమిచ్చినట్లు అవుతుంది. ఎవరైనా "మహిళ సంఘ" పనిచేయడానికి ముందుకు వస్తే, ఆమెకు మేము సంపూర్ణ సహకారం ఇవ్వగలము. అలా ఆ మహిళ 'రాష్ట్ర సేవికా సమితి'ని ప్రారంభించింది. నేడు అది కూడా అఖిల భారతీయ స్థాయిలో విస్తరించిన సంస్థగా మారిపోయింది. సంఘ సంస్కారాలతో కూడిన కార్యపద్దతి పురుషుల కొరకు 'రాష్ట్రీయ స్వయంసేవక్' సంఘ్ లో , మహిళల కొరకు 'రాష్ట్ర సేవికా సమితి' రూపంలో సమానాంతరంగా జరుగుతోంది. ఒకరు మరొకరి కార్యక్షేత్రంలో పనిచేయడం జరగదు. ఒకరికొరకు మద్దతుగా పనిచేయడం జరుగుతుంది. ఈ విషయం ఆ రోజే నిర్ణయమైంది. దీన్ని మార్చడం అనేది, ఇది మార్చబడాలి అని రెండువైపులా అన్నించినప్పుడు మాత్రమే జరుగుతుంది. లేకపోతే లేదు. ఇలాగే విడివిడిగా నడుస్తాయి.
అయితే సంఘ స్వయంసేవకులు చేసే సేవాకార్యంలో ఒక లక్షా డెబ్బైవేలకు పైగా చిన్న పెద్ద సేవా కార్యక్రమాలున్నాయి. ఆ సంఖ్య అయిదేళ్ల క్రితం నాటిది. ఈ అయిదు సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు ఇప్పుడు తీయడం జరుగుతోంది. ఆ సంఖ్య ఎక్కడికి చేరిందనేది ఈ సంవత్సరం తేలుతుంది. అందులో మహిళలు పురుషులు కలిసి పనిచేస్తున్నారు. సంఘం అనేది సన్యాసులకు సంబంధించిన సంస్థ కాదు. ఎక్కువ సంఖ్యలోని స్వయంసేవకులు గృహస్థ కార్యకర్తలు. ఇళ్ళల్లోకి రావడం పోవడం జరుగుతుంది. మా మాతృమూర్తులు, సోదరీమణులు తమతమ స్థలాలో ఉంటూనే సంఘకార్యానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇన్ని రకాల కార్యక్రమాలు
నిర్వహిస్తున్నామంటే, అందులో మహిళలు పాల్గొంటున్నారు. మరింతగా ముందుకువస్తారని భావిస్తున్నాం కూడా.
ఇది సంఘ కార్యపద్ధతి. సంఘం సంపూర్ణ సమాజాన్ని సంఘటితం చేయాలని కోరుకుంటున్నది. కాబట్టి అందులోని వారెవరూ దానికి పరాయివారు కాదు, నేడు మమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా మాకు కావలసినవారే, మావారే అనేది మా నిశ్చితాభిప్రాయం. వారి వ్యతిరేకత కారణంగా మాకు నష్టం కలగరాదనే జాగ్రత్తను మాత్రం మేము తప్పక తీసుకుంటాం. అయితే మేం ఎలాంటివారమంటే అందరినీ కలుపుకుపోయే భారతీయులమే తప్ప ఎవరినీ వదిలిపెట్టేవారం కాదు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో అందరినీ కలిపి ఉంచేదే మా ప్రయత్నం. అలాగే అందరినీ పిలవటంకూడా మా ప్రయత్నంగా ఉంటుంది. చివరకు ఎవరినైనా వ్యతిరేకించాల్సి వచ్చినా అది వాస్తవస్థితిని ఆధారం చేసుకునే ఉంటుంది. అయితే ముఖ్య విషయం మేము హిందువుకోసమే ఎందుకున్నాం?' దీని గురించి రేపు చర్చిద్దాం. దాని తర్వాత "భవిష్యభారతం" గురించి సంఘం దృష్టి ఏమిటన్న విషయానికి వస్తాను.
"ధన్యవాదములు"
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం: డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక .