ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ జీ |
ఆర్.ఎస్.ఎస్ లో 'పేరుకోసం పాకులాట ఉండదు'
భవిష్యభారతం:
ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి
ఉపన్యాస మాలిక..
అందువల్లే ఈ విషయంలో ప్రచారం ఎక్కువగా జరగదు. ఎందుకంటే ఉపన్యాసాలను మీరు ఎన్నో వింటుంటారు. ఎన్నో పుస్తకాలు చదువుతుంటారు. అయితే చదివినదాన్ని, వ్రాసినదాన్ని, విన్నదాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో చూపే అలవాటే పని చేస్తుంది. అలా అలవాటు చేసే పని శాఖలో జరుగుతుంది. రోజూ వెళ్లే అలవాటు అవుతుంది, అనుశాసనం, సమాజాన్ని తనదిగా భావించి అన్ని పనులూ చేయటమూ అలవాటు అవుతాయి. ఉదాహరణకు కేరళలో వచ్చిన వఱదలవంటి ఎంత పెద్ద ఆపద వచ్చినా స్వయం సేవకులు అందరికన్నా ముందు అక్కడికి చేరుకుంటారు. ఎందుకు చేరుకుంటారు ? వారికి ఆపదలనెదుర్కొనే శిక్షణ శాఖలో లభించదు. మా శిక్షావర్గలలో కూడా లభించదు. దానికొరకు మేము ఏమైనా క్రమబద్ధమైన శిక్షణ ఇవ్వాలనే ఆలోచనలు వచ్చినా అవి ఇంతవరకు ఒక రూపానికి రాలేదు. అయినా వాళ్లు మొదట ఎలా చేరుకున్నారు? మేము ఒక భావనను నిర్మాణం చేశాము, అనుశాసన పద్ధతిని నిర్మాణం చేశాము. మొత్తం దేశంలో ప్రజలందరికీ ఈ ప్రశిక్షణ లభించాలి, మొత్తం సమాజం ఈ విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గా మారిపోవాలి. అనే కోరికతో మేము ఇదంతా చేస్తాము. అయితే దీనివల్ల ఏమి సాధించగోరుతున్నారు. ఇంతకు మించిన ఉద్దేశ్యం ఏమీ లేదా? మాకు ఇంతకు మించిన ఉద్దేశ్యం ఏముంటుంది! మేము సాధించగోరుతున్నది ఇదే.
చాలామంది దీనికి ఉద్దేశ్యాలను అంటగట్టుతుంటారు. కానీ అటువంటి ఉద్దేశ్యాలు ఏవీ మాకు లేవు. మేము సంఘ అజమాయిషీని కోరుకోము. సంఘ ఆలోచన దీనికి భిన్నమైన రీతిలో ఉంటుంది. ఒకవేళ సంఘం అజమాయిషీద్వారా దేశంలో ఏదైనా ఒక మంచి అనేది జరిగిందని చరిత్రలో వ్రాయబడితే, అది సంఘం యొక్క గొప్ప పరాజయమే అవుతుంది. ఎందుకంటే మేము దేశచరిత్ర, దేశ వర్తమానం దేశ ప్రజానీకంద్వారా రూపొందాలని భావిస్తాము. మహాపురుషులు, ఆలోచనాధారలు తత్త్వజ్ఞానం- ఇవన్నీ సహాయకాలు అవుతాయి. అయితే సామాన్య వ్యక్తి కర్తృత్వం ద్వారా దేశపు పరమవైభవం రావాలి. ప్రార్థనలో మేము ఇదే చెబుతాము. "విజేత్రీ చ నః సంహతా కార్యశక్తిః." మన సామూహికశక్తి ఆధారంగా పని జరగాలి. 'మన' అంటే సంఘం అనికాదు, హిందూ సమాజపు సామూహిక శక్తి ఆధారంగా అని అర్థం. ఒకవేళ అందులో ఏ రకంగానైనా సంఘం ప్రవేశించి, దానిద్వారా దేశం ఉద్ధరించబడితే అది సంఘానికి ఆమోదయోగ్యం కాదు, కాబట్టి చాలా మంచిపనులు చాలామంది స్వయంసేవకులు చేస్తున్నా, వాటికి పేరు రావాలనిగానీ, ప్రచారం
జరగాలనిగానీ కోరుకోరు.
నేడు మా మీద బాలా ఒత్తిడులు పెరుగుతున్నాయి. సంఘం పెరిగిపోయింది. మేము ఈపని చేయకపోతే అనేక తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం ఉండి. కాబట్టి ఇటీవల ఇరవై సం.రాలుగా మేం ఏమేం చేశామనేది ఒకసారి వివరాలు సేకరించి భద్రపరుస్తున్నాం. అయితే మా వీపులను మేము ఎప్పటికీ చరుచుకోము. ఎందుకంటే అది మా కర్తవ్యం, ప్రతి వ్యక్తి కర్తవ్యం కూడా. మరి సంఘం విశేషంగా ఏమి చేస్తోంది? సంఘ స్వయం సేవకులు ఇన్ని పెద్ద పెద్ద పనులు చేస్తుండటంలో పెద్ద విశేష ముందా? అదేదో గొప్ప ఉపకారమా? ఇది మన సమాజం కాబట్టి దీనికొరకు చేయాలి. అవసరమైతే దేశహితంకొరకు, సమాజహితంకొరకు చావడానికైనా సిద్దంగా ఉండాలి అన్నప్పుడు బ్రతికి ఉండి కొన్ని మంచిపనులు చేసినంత మాత్రాన వీపు చరుచుకోవడం అవసరమా? నిస్వార్థబుద్దితో దేశానికి సేవ చేయండి. అందరూ కలిసి చేయండి. దీనికొరకు సంఘంలో మీకు అడుగడుగునా సామూహికత అనుభవంలోకి వస్తుంది. సంఘంలో ఎంతమంది స్వయంసేవకులున్నా, ఎంతో పని జరుగుతున్నా ఎవరూ పేరు ప్రఖ్యాతులు కోరుకోరు. ప్రపంచం నడిచే తీరుననుసరించి సంస్థ నిర్వహణకు బాధ్యత వహించే పదాధికారులు అవసరమవుతారు. ఒకసారి ప్రసిద్ధి పొందితే షత్రికలు ఇతర ప్రసార మాధ్యమాలు వెంటపడతాయి. వారు చూపించాలనుకుంటారు కాబట్టి కెమేరాలకు ఎదురుగా నిలబడవలసి వస్తుంది. మోహన్ భాగవత్ సర్సంఘచాలకి అయ్యాడు, ఆయన ఫోటో రోజూ పత్రికలలో ప్రచురిస్తున్నారనేది మోహన్ భాగపత్అ నే నాకు చాలా చికాకు కల్గించే విషయ మవుతుంది. ఎందుకంటే అది సంఘపద్దతి ఎంత మాత్రమూ కాదు.
మీరు మంచివాళ్లను అనామకులుగా (Facelessగా) మార్చేస్తారని కొందరు అంటూ ఉంటారు. అవును. అది నిజమే. మేము Faceless గా మార్చేస్తాము. ఎందుకంటే ఇదంతా నేను చేశాను అనే అహంకారం ఉండరాదనే భావనతో వాళ్లకు కొత్తి కష్టాలు వచ్చినా సరే, ఒక విశిష్టమైన వ్యక్తిగా సమాజంలో తయారు కావడంకొరకే ఈ పని మొదలైంది. మాకు ఇంకేమీ అవసరం లేదు. అధికారంలోకి, పదవిలోకి ఎవరు వస్తారు, దేశం ఏ విధానాన్ని స్వీకరిస్తుంది. అనేది సమాజంలోని ప్రజలు నిర్ణయిస్తారు.ఆ పనికి ఉపకరణాలైనవారు దేశాన్ని నడుపుతారు. అయితే ఈ విధంగా దేశభక్తులు, నిజాయితీ పరులు, నిస్వార్థపరులు, క్రమశిక్షణ కల్గిన ఎంచుకోబడేవా ప్రజలైతే వాళ్లు మరింత బాగా నడపగలరు. ఇలాంటి వ్యక్తులు ఎంత ఎక్కువైతే అంత బాగా నడపగలరు. వాళ్లగురించి మాకెంతమాత్రం చింతలేదు. సమాజపు వ్యవహారం ఇలా తయారవుతే తద్వారా అన్ని విషయాలు సరిగా జరుగుతాయి అని మాత్రమే మేము ఆలోచిస్తాము.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం: డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక .