జాతీయపతాకం |
సాధారణ ప్రజానీకం కూడా తమ ఇళ్ళలో, వ్యక్తిగతంగా జాతీయపతాకాన్ని ఎగురవేయవచ్చని సర్వోన్నత న్యాయస్థానం 2002లో స్పష్టం చేసింది.
జాతీయపతాకాన్ని ఇలా గౌరవిద్దాం |
➣ జాతీయపతాకాన్ని తగిన ఎత్తులో సరిగా ఎగురవేయాలి
➣ పిల్లలు జెండాను ఆట వస్తువుగా చూడకుండా జాగ్రత్తవహించాలి
➣ ప్లాస్టిక్ జెండాలను కొనకూడదు.
➣ అలంకరణ కోసం జాతీయజెండాను ఉపయోగించకూడదు.
➣ జెండా నలిగిపోకుండా, చిరిగిపోకుండా చూడాలి
➣ జాతీయపతాకాన్ని ఎవరు తొక్కకుండా జాగ్రత్త వహించాలి
➣ జెండా నేలపై పడకుండా చూసుకోవాలి
➣ జాతీయజెండాను పోలిఉండేట్లుగా బట్ట ముక్కలను కలిపి కుట్టకూడదు.
ఇలా జాతీయపతాకాన్ని ఎక్కడపడితే అక్కడ పారవేయడం, తొక్కడం నేరమని చాలమందికి తెలియదు. ఒకవేళ జెండా చిరిగిపోతే, పాడైపోతే దానిని ఎలా తీసివేయాలన్నది కూడా తెలియదు. ఈ నియమాలు 2002 జాతీయపతాక నిబంధనావళిలో పొందుపరచారు.
ఏం చేయాలి?
1. చొరవతీసుకోవాలి: జాతీయపతాకానికి పైన చెప్పిన పద్దతిలో ఎలాంటి అవమానం జరగకుండా ఉండేందుకు దీనిగురించి ఇతరులకు అవగాహన కలిగించడంలో మనం చొరవ తీసుకోవాలి.
2. జెండాను తొలగించడం: పాడైపోయిన జెండాను జాగ్రత్తగా తీసివేసి, ఎక్కడైనా పాతిపెట్టడమో, కాల్చివేయడమో చేయాలి. పాడైపోయిన జెండాను మడతపెట్టి గౌరవపూర్వకంగా మంటలో వేయాలితప్ప నిర్లక్ష్యంగా విసిరివేయకూడదు. ఇలా చేయకుండా జెండాను చేతిలో పట్టుకుని ఒక పక్క మంట పెట్టడం చట్టరీత్యా నేరం. పాడైన జెండాలను పూడ్చిపెట్టలంటే వాటన్నిటిని ఒక చెక్క పెట్టెలో పెట్టాలి.
3. అవగాహన కల్పించాలి: జాతీయజెండా విషయంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదన్నది పాఠశాలలు, కళాశాలల్లో తెలియచెప్పాలి.
4. అలాగే మన స్నేహితులు, బంధువులకు కూడా ఈ విషయాలు చెప్పాలి.
5. జాతీయపతాకం విషయంలో మన అనుచిత వ్యవహారాన్ని గురించి హెచ్చరించేందుకు, సరైన పద్దతిని తెలియచేయడానికి ఒక బృందంగా ఏర్పడి పనిచేయాలి.