డా. మోహన్ భాగవత్ జీ |
మనలను కలిపిఉంచేది విలువలకు ప్రాధాన్యమిచ్చే మన సంస్కృతి. మనం ఈ విలువలను నిర్లక్ష్యం చేసినపుడే మన పతనం జరిగిందనేది మన చరిత్రను. అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. అపుడు మన సమాజంలో న్యాయం అంతర్ధానమైపోయి అన్యాయం పాతుకుపోయింది. ఆ కారణంగా మనం దుర్భలురమయ్యాం. ఆ కారణంగానే మనం బానిసలమయ్యాం. మన ఈ దురవస్థకు కారణంగా ఆంగ్లేయుల లేదా ఇస్లాం ఆక్రమణలు జరిగాయి కాబట్టి అంటూ వివరణ ఇస్తూ ముస్లింలను ఇంకెంత కాలం దోషులుగా భావిద్దాం?- అని డా||హెడ్డేవార్ ఎపుడూ అంటుండేవారు. "వేలమైళ్ళ దూరం నుండి పిడికెడంతమంది దురాక్ర మణకారులు వచ్చి, బంగారు పక్షి అన్నించుకున్న శూరవీరుల భారతదేశాన్ని, చూస్తూ చూస్తూ ఉండగా గెలుచుకొన్నారు. మనలో ఏవో కొన్ని లోపాలున్నాయి, వాటిని సరిచేసుకోవాలి.' అపుడపుడూ ఆయన.నేడు దేశం ముందున్న ప్రముఖ సమస్య ఏదని మీకన్పిస్తోంది? అని అడుగుతుండేవారు.
నేను కూడా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడంలో ఆయననే అనుకరిస్తాను. 'ఇక్కడుండే అన్నింటికన్నా పెద్దసమస్య హిందువే,’ అని ఆయన అంటుండేవారు. 'ఎపుడైతే మనం మన విలువలను మరచిపోయి వ్యవహరించడం ఆరంభించామో అపుడే మన పతనం ప్రారంభమైంది'. నేను వివరాల్లోకి వెళ్ళను, ఎందుకంటే చాలా సమయం పట్టుతుంది, అందుకు రెండురోజుల సమయం సరిపోదు. మీరు అధ్యయనం చేస్తే 'మన దేశపతనం మన పతనంతో' ప్రారంభమైందని తెలుసుకుంటారు. దానినుండి మనం తప్పించుకోవాలంటే మళ్ళీ మనం మన మూలాల్లోకి తిరిగి వెళ్ళాల్సిందే.
మీరు ఈ విలువలగురించి చెప్పడం ప్రారంభిస్తే ప్రపంచ ప్రజలంతా అవి హిందూ ఆలోచనకు సంబంధించినవి అని చెబుతారు. ఇది మేము చెప్పడం లేదు, మనకు ప్రపంచమే చెబుతుంది. విలువల ఆధారిత వ్యవహార విషయమే సంస్కృతి. ఆ సంస్కృతి కారణమే మన Hinduness. కాబట్టి హిందుత్వమే మనందరినీ కలిపి ఉంచుతుంది మరియు సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తుందని డాక్టర్జీ చెప్పారు. అయితే 'మేము హిందువులం కాదు' అని చెప్పేవాళ్ళు కూడా మన సమాజంలో ఉన్నారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఈ విషయం చెప్పాలంటే వాళ్ళనూ జోడించుకుపోయే పదమేదీ మరొకటి లేదు. కాబట్టి ఆయన హిందుస్థాన్ ను హిందూ రాష్ట్రమని స్పష్టంగా ప్రకటించారు. మేము హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాము అనే ఈ నినాదం చేయడం వెనుక ఆయనకు ఎవరిపట్లా వ్యతిరేకత అనేది లేదు. ఇదేదో కొన్ని తాత్కాలిక సంఘటనలకు ప్రతిక్రియగా మొదలై ఒక రూపానికి వచ్చినది కూడా కాదు. ఎందుకంటే ఆయన స్వీయ అనుభవాలతో ఆ స్థాయికి చేరుకున్నారు.
సమాజాన్ని మొదట సరిచేయండి. సమాజాన్ని జోడించండి. భేదరహిత స్వార్ధముక్త సమాజమే జాతీయ స్వాతంత్ర్యానికి మరియు స్వాతంత్య్ర సాధన తర్వాత దేశపు పరమవైభవానికి హామీ ఇవ్వగలుగుతుంది తప్ప మరింకేదీ అలాంటి హామీ ఇవ్వజాలదు. ఆలోచన, విధానాలు, ప్రభుత్వాలు, రాజనీతిజ్ఞులు ఎన్ని ఉన్నా, ఎందరు ఉన్నా, వీరందరి ఆకాంక్షలు ఎపుడు పూర్తవుతాయంటే, పైన పేర్కొన్న సమాజంలో అలాంటి ప్రజలున్నపుడే, వాళ్ళే అందుకు సహాయకులవుతారు.
మనదేశంలో స్వతంత్రం వచ్చాక ప్రణాళికలేమైనా తక్కువగా రూపొందించ బడ్డాయా? 'రాజకీయ రంగంలో ఒకరిమీద మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప, తమను తాము సరిచేసుకోవడం లేదు. నిజాయితీగా ఏమీ చేయడం లేదు'. నేను అలాంటి ఆరోపణలేమీ చేయను. ఎంతోచెప్పినా, ఎంతో కొంత జరిగింది మాత్రం నిజం, కొందరు నిజాయితీతో చేసి వెళ్ళిపోయారు. అయితే వాటి ఫలితాలు ఎందుకు లభించడం లేదు? We have to deserve it. We have to be a deserving Society సమాజంలో అనుశాసనముందా ? అనుశాసనమున్న సమాజం వైభవస్తితిని పొందుతుంది. స్వతంత్రదేశపు మన పౌరులలో బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉందా ?బాధ్యతాయుతమైన ప్రవర్తనను దైనందిన జీవితంలో పాటించడమనేది దేశభక్తిని ఆవిష్కరించడమే అవుతుంది. దేశంకోసం రోజూ చనిపోవాల్సి రావడం జరగదు. దేశంకోసం రోజూ జీవించాల్సి వస్తుంది. దేశంకోసం చనిపోవాల్సిన అవసరం వచ్చినపుడు, దేశంకోసం చనిపోయేవారి సంఖ్య ఏ సమాజంలోనైతే ఎక్కువగా ఉంటుందో, ఆ సమాజంలో దేశంకోసం జీవించడమూ తెలిసి ఉంటుంది. కాబట్టి ఇది వ్యక్తి నిర్మాణకార్యం. హిందువు గురించి, ఈ విషయం గురించి మరింత చర్చను మనం మరి కాసేపటి తర్వాత చేద్దాం. అయితే ఈ పనిని చేయడమెలా ?దానికున్న పద్ధతి ఆర్.ఎస్.ఎస్ అని మీకు ముందే చెప్పాను.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం: డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక .